collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / డాల‌ర్ తో పోలిస్తే రుపాయి విలువ ఎప్పుడూ ఎందుకు త‌క్కువే.. కార‌ణాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Te...

డాల‌ర్ తో పోలిస్తే రుపాయి విలువ ఎప్పుడూ ఎందుకు త‌క్కువే.. కార‌ణాలు

2022-05-13  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

indian rupee
 

మనం అప్పుడప్పుడు వార్తలలో అమెరికా డాలర్ తో పోలిస్తే ఇండియన్ రూపాయి  విలువ తగ్గిపోయిందని గమనిస్తూనే ఉంటాం.  తాజాగా డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ 77 రూపాయలకు పైగానే పడిపోయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై అనేక మంది విమర్శలు చేశారు. అయితే రూపాయి విలువ బలహీన మ‌వ‌డంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఉందా..? అసలు దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా..? అని పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. 

మరోవైపు ఈ చర్చలోకి వెళ్లే ముందు రూపాయి విలువను కేవలం డాలర్తో మాత్రమే ఎందుకు పోలుస్తారు, వేరే ఇతర క‌రెన్సీలు లేవా అని అనుమానం రావడం స‌హ‌జ‌మే. అమెరిక‌న్ డాల‌ర్ అనేది ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్న కరెన్సీ. అమెరికన్ డాలర్ తో పాటు యూరో కూడా అమలులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా అమెరికన్ డాలర్లు మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యంలో చెలామ‌ణీలో ఉంది. దాదాపుగా అంతర్జాతీయ వాణిజ్యంలో 64 శాతానికిపైగా అమెరికన్ డాలర్లలో జరుగుతుండగా కేవలం 20 శాతం మాత్రమే   యూరోల‌లో జరుగు తుంది. మిగతా 16 శాతం వివిధ రకాల కరెన్సీలో వాణిజ్యం జరుగుతుంది.

క్రూడాయిల్ వ‌ర్త‌కంలో.. 
ఇక 80% అంతర్జాతీయ క్రూడాయిల్ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఇన్వాల్వ్ అయి ఉన్నది. మరోవైపు అంతర్జాతీయంగా 40 శాతానికిపైగా రుణాలు ఇవ్వడం కేవ‌లం డాల‌ర్ల‌లో మాత్ర‌మే ఇస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 120 కి పైగా క‌రెన్సీలు ఉండగా అవి కేవ‌లం త‌మ దేశాల అంత‌ర్గ‌త‌ వాడ‌కానికే ప‌రిమిత‌మ‌య్యాయి.. ఈ నేపథ్యంలో ఆ భారతీయ రూపాయి కంటే అమెరికా డాలర్ ఎందుకు అంతా పటిష్టమైన అది అని అనుమానం రావడంతో ఎలాంటి అనుమానం లేదు. 

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమోడిటీ లో ఎక్కువగా వాణిజ్యం అమెర‌కిన్ డాల‌ర్ల‌లో జరుగుతోంది. కమోడీటికి డిమాండ్ పెరిగినప్పుడు దానికి ఎక్కువగా ధ‌ర ప‌లుకుతోంది. ఇక మన దేశం విషయానికి వస్తే అమెరికా నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం.. అదే సమయంలో తక్కువగా ఎగుమ‌తి చేస్తున్నాము. ఈ నేపథ్యంలో మనకు అమెరికన్ డాలర్లు ఎక్కువగా అవసరం ఉంటుంది ఈ నేపథ్యంలోనే భారతీయ రూపీ కంటే అమెరికన్ డాలర్లకు డిమాండ్ పెరిగి, దాని ద్వారా రూపాయి విలువ బ‌ల‌హీనం అవుతోంది. 

మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న క్రమంలో రూపాయి విలువ మరింత తగ్గిపోతోంది. దీనికి గల కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోని రెండో అత్యధిక క్రూడాయిల్ ఎగుమతిదారులు రష్యా. యుద్ధం వల్ల అక్కడ సరఫరాతోపాటు అంత‌ర్జాతీయ ఆంక్ష‌లు లాంటి వ్య‌వ‌హారాల్లో అంతరాలు ఏర్పడడం వల్ల అది భారత్ పై ప్రభావం పడుతోంది. ఇందువల్ల మన రూపాయి అంతర్జాతీయంగా బలహీనపడుతోంది.

చైనాలో లాక్ డౌన్ ప్ర‌భావం.. 
ఇక అమెరికా తర్వాత చైనాతో మనకు వాణిజ్యం ఎక్కువగా ఉంది అక్కడ క‌రోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధిస్తుండడంతో మన పైన ప్రభావం పడుతుంది. ఇక రూపాయి విలువ తగ్గితే, అది మనపై అనేక రూపాల్లో ప్రభావం చూపిస్తోంది. రూపాయి విలువ త‌గ్గుద‌ల‌తో మనకు వస్తువులను కొనుగోలు చేయడానికి ఎక్కువ రూపాయలు అవసరం ఉంటుంది. ఇక క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరగడం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడమే కాకుండా, అనేక రంగాల‌పై  దాని ప్రభావం కనిపిస్తుంది.

 అత్యవసర వస్తువులను సరఫరా చేసే వాహనాలలో వాడే పెట్రోల్ ధర పెరగడం వల్ల అనేక రకాలుగా ధరలు పెరుగుతాయి. ఇందువల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఈ కారణంగానే భారత్లో consumer price index value గత 8 ఏళ్లలో అత్యధిక శాతం గా ఉంది ఇది 7.75 శాతంగా నమోదయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల మన విదేశీమారక ద్రవ్యం కూడా చాలా పడిపోయింది గత త్రైమాసికానితో పోలిస్తే 607 బిలియన్ డాలర్లకు పైగా నిల్వలు ఉండగా ప్రస్తుతం కేవలం 28 బిలియన్ డాలర్లు మాత్రమే పరిమితమైంది. రూపాయి విలువ పడిపోవడం వల్ల అనేక రూపాల్లో దాని ప్రభావం కనిపిస్తుంది ఆ తయారీ రంగంలో దాని ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. అలాగే వినియోగదారుల పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. 

మరి ఈ రూపాయి విలువను ఎవరు నిర్ధారిస్తారు అన్ని అనుమానం రాక తప్పదు. అంతర్జాతీయ కరెన్సీ ఎక్స్చేంజి లలో రూపాయి విలువ నిర్ధారిస్తారు. ఎప్ప‌టిక‌ప్పుడు అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి డిమాండ్ బ‌ట్టి రూపాయి విలువ‌ పెరగడం, తగ్గడం జరుగుతుంది. అందుకొరకే ఏ దేశానికైనా ఎగుమతులు ఎక్కువగా ఉంటే ఆ దేశపు కరెన్సీ విలువ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రూపాయి విలువ ను అదుపు చేయడంలో ప్రభుత్వ జోక్యం తక్కువగానే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాలర్లను కొనడం వల్ల రూపాయి విలువ కాస్త పెంచవచ్చు కానీ అది మరిన్ని విపరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. దీని వల్ల మన విదేశీ మారక నిల్వలు తగ్గి పోయి, ధరలు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆయా ప్రభుత్వాలు ఇందులో జోక్యం చేసుకోక, జరిగే పరిమాణాన్ని అలా చూస్తూ ఉంటాయి. ఏదేమైనా అంతర్జాతీయంగా బలమైన అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ నిర్ధారణ కావడంతో అనేక రకాల అంశాలు ముడిప‌డి ఉన్నాయి.2022-05-13  Business Desk