సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తాం
ఓఇఆర్ (ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అడాప్ట్ చేస్తాం
అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించి ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తాం
రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండే రీతిలో ఆయిల్ పామ్ ధరలను నిర్ణయిం చడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార ,మార్కెటింగ్ ,ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఆమరావతి సచివాలయం రెండవ బ్లాకు సమావేశ మందిరంలో ఆయిల్ పామ్ ధరల నిర్ధారణ అంశంపై ఆయిల్ పామ్ రైతులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ పామ్ ధరలను నిర్ణయించడం జరుగుతుందని తెలిపారు. ఆయిల్ పామ్ ధరల నిర్ణయంలో ఇటు రైతులు అటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు నష్టపోకుండా అందరికీ ఆమోదకరమైన రీతిలో ఈ ధరలను నిర్ణయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఓఇఆర్(ఆయిల్ ఎక్ట్రాక్సన్ రేషియో)ను శాస్త్రీయ విధానంలో అడాప్ట్ చేయడం ద్వారా ఆయిల్ పామ్ ధరల నిర్ణయానికి చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి గోవర్ధన రెడ్డి చెప్పారు.రాష్ట్రానికి ఫ్యాక్టరీలు రావాలి ఉపాధి అవకాశాలు పెరగాలని ఆదిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించకుండా వదిలివేసిందని ఆ బకాయి లన్నీఈ ప్రభుత్వం చెల్లించడంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయిల్ పామ్ సాగుదారుల సంఘం అధ్యక్షులు బి.వీర రాఘవరావు మాట్లాడుతూ భారత దేశంలోనే ఉత్తమ క్వాలిటీతో కూడిన ఆయిల్ పామ్ ప్రూట్ ను ఉత్పత్తి చేసున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఆయిల్ పామ్ రైతుల సంఘం జనరల్ సెక్రటరీ రంగారావు, మరో రైతు క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ కు తగిన ధరను నిర్ణయించి రైతులను ఆదుకోవాలని మంత్రికి విజ్ణప్తి చేశారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీల తరపున పాల్గొన్నగోద్రెజ్ కంపెనీ ప్రతినిధి కెవిఎస్ ప్రసాద్, మరో కంపెనీ ప్రతినిధి ఆసిస్ గోయెంకా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ కు వయబులిటీ గ్యాప్ ఫండింగ్ కల్పిస్తే రైతులకు మరింత మేలు చేసినట్టు అవుతుందని ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ణప్తి చేశారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యానవన శాఖ కమీషనర్ డా.ఎస్.ఎస్.శ్రీధర్, ఎపి ఆయిల్ ఫెడ్ ఎండి సి.బాబూరావు, అదనపు సంచాలకులు కె.బాలజీ నాయక్, యం.వెంకటేశ్వర్లు, ఇతర రైతులు ,కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.