ఎంఎస్ ధోనీ.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే అత్యుత్తమ కెప్టెన్. క్రికెట్ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్ కు అందించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన విజయాలను టీమ్ ఇండియాకు అందించడమే కాకుండా.. భారత క్రికెట్ జట్టును ఉన్నత శిఖరాలకు చేర్చాడు. మిస్టర్ కూల్‌గా పేరు సంపాదించుకున్న ధోనీ 2020 లో అందరికీ షాకిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. 2008 లో చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్ గా వ్యవహారించిన మహీ చెన్నైకి ఏకంగా నాలుగు ట్రోఫీలు అందించాడు.
ధోనీ సినీ రంగ ప్రవేశం :-
క్రికెట్ లో సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పుడు తన కొత్త ఇన్నింగ్స్ ను ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలు పెట్టబోతున్నారు.చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీ వారితో సన్నిహిత సంబంధాలు కల్గిఉన్న ధోనీ ఇప్పుడు నిర్మాతగా కోలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారట. సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నిహితుడు సంజయ్ ధోనీ మొదటి ప్రాజెక్ట్ కు మేనేజర్ గా వ్యవహారించబోతున్నారని సమాచారం. స్క్రిప్ట్ మరియు నిర్మాణ సంస్థకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం.
హీరోయిన్గా నయనతార :-
ధోనీ తొలి చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ చిత్రం నిర్మాణం ప్రారంభం కానుందట. ఐపీఎల్ 2022 ముగిసిన వెంటనే దీనిపై ధోనీ అధికార ప్రకటన చేస్తారని కోలీవుడ్ వర్గల సమాచారం. నయనతార కు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో షారుఖ్ తో కలిసి ఒక సినిమా కూడా చేస్తుంది. కనుక నయనతార తో తన మొదటి ప్రాజెక్ట్ లాంచ్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కుతుందనేది మహేంద్ర సింగ్ ధోనీ ప్లాన్. నయనతార మరియు ధోనీల కలయిక అంటే ఖచ్చితంగా అది క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.
ఎంఎస్ ధోనీకి బిజినెస్ చేయడం కొత్తేమీ కాదు.ఇప్పటికే పలు సంస్థలకు మహీ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్నాడు.తన ఫామ్ హౌస్‌లో రక రకాల పంటలు పడిస్తున్నాడు. అంతేకాదు కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం కూడా ఉంది. ఇవి మాత్రమే కాకుండా మహీకి మరికొన్ని వ్యాపారాలు ఉన్నాయి.తను అడుగు పెట్టిన ప్రతి చోట సిక్సర్స్.. ఫోర్స్ తో భారీ విజయాలను దక్కించుకున్న ధోనీ సినిమా నిర్మాతగా ఎలాంటి ప్రాజెక్ట్స్ ని అందిస్తాడో...ఎంత వరకు సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి.