తమ రాష్ట్రంలో విజృంభిస్తున్న మావోయిస్టులను అరికట్టేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కొత్త నిర్ణయానికి వచ్చినట్ల తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా స్థానిక ఆదివాసీలను బస్తర్ పైటర్స్ పేరుతో నియమించుకొని, మావోయిస్టులపై పోరుకు సిద్ధం చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. దీంతో మావోయిస్టులకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న తెలంగాణకు.. పక్క రాష్ట్రం చత్తీస్గడ్ నుంచి మద్దతు లభించింది అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దాదాపు రెండు వేల ఒక వంద మంది ఆదివాసీలను బస్తర్ ఫైటర్స్ పేరుతో ప్రభుత్వం నియమించనుందని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో మావోయిస్టులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా గ్రేహౌండ్స్ పేరుతో పోలీసు దళాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకోవడంతో పాటు వారికి వ్యతిరేకంగా అనేక ఆపరేషన్లను గ్రేహౌండ్స్ సంస్థ నిర్వహించింది.
ప్రత్యేక ట్రైనింగ్..
ఇక చత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న బస్తర్ ఫైటర్స్ దళానికి ప్రత్యేకంగా కమాండో ట్రైనింగ్ తోపాటు అత్యాధునిక ఆయుధాల ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే అడవుల్లో కూంబింగ్ నిర్వహించడం కోసం వారికి నడక లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు మావోయిస్టుల పోరాటంలో భాగంగా తమ దళాలను ఆధునీకరించే పనిలో భాగంగానే బస్తర్ ఫైటర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. దీని ద్వారా మావోయిస్టుల హింసను అరికట్టడంతో పాటు, ఆదివాసులను ఈ పోరాటంలో భాగస్వాములు చేయనున్నామని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు పంచుకుంటున్న చత్తీస్ ఘడ్ కు చెందిన ఏడు జిల్లాలలో మావోయిస్టు కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి. ఈ జిల్లాల ప్రత్యేక నియమాకాలను చేయనున్నారు. ఒక్కొక్క జిల్లా పరిధి నుంచి 300 చొప్పున ఆదివాసిలను బస్తర్ ఫైటర్స్ పేరిట నియమించనున్నట్లు నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఏడు జిల్లాలు ఏవంటే..
దంతేవాడ, సుకుమా, బీజాపూర్, కొండగాం, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాలకు చెందిన యువకుల ద్వారా బస్తర్ ఫైటర్స్ అనే దళాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ బస్తర్ ఫైటర్స్ నియామకం కోసం 65 వేలకు పైగా అప్లికేషన్ వచ్చాయని, వివిధ దశల ద్వారా వడపోత తో రెండు వేల ఒక వంద మందిని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు. మరోవైపు మావోయిస్టులు తమ కార్యకలాపాలలో ఆదివాసులను బాగంగా చేస్తున్నారని, ఇప్పుడు పోలీసు దళంలో ఆదివాసులను బాగా తీసుకోవడం ద్వారా మావోయిస్టులకు కౌంటర్ ఇచ్చినట్లు అవుతుందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళా కమాండర్ లను మావోయిస్టులు ఏరివేతలో భాగంగా నియమించుకున్న సంగతి తెలిసిందే. ఏదేమైనా ఆ అబూజ్మాడ్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. ఇప్పటివరకు కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ వర్గాలు అడుగుపెట్ట లేక పోయాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత కోసం ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం తోపాటు అత్యాధునిక ఆయుధాలతో మావోయిస్టులను తుద ముట్టించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బస్తర్ ఫైటర్స్ పేట కొత్త కొత్త వ్యూహాలను రూపొందిస్తున్నట్టు విశ్లేషకులు పేర్కొంటు న్నారు.