collapse
...
Home / ఆరోగ్యం / మానసిక ఆరోగ్యం / స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం మంచిదేనా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

స్లీపింగ్ పిల్స్ తీసుకోవడం మంచిదేనా?

2022-05-26  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

sleepin pills
 

జనాభాలో అధికభాగం నిద్రలేమితో బాధపడుతున్నారు. అయితే వీరిలో 2 శాతం మంది మాత్రమే డాక్టర్లతో తమ సమస్యను చర్చించాల్సిన ఉందని భావిస్తున్నారు. కానీ మంచి నిద్ర లేదా గాఢనిద్ర కోసం తగిన వైద్య పరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఈరోజుల్లో చాలా అవసరం. నిద్రలేమి లేదా పూర్ స్లీప్ అనేది ఊబకాయం, హైపర్ టెన్షన్, మధుమేహం పెరుగుదలకు దారితీస్తుందని కోచిలోని అమృతా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభాష్ చంద్ర చెప్పారు. నిద్రలేమి అనేది చాలా సాధరణమైన డిసార్డర్. ఇది 10-30 శాతం జనాభాకు కొద్దో గొప్పో తేడాతో సహజంగా కలుగుతున్న ఇబ్బంది. జనాబాలో ఒత్తిడి స్థాయిలు పెరిగుతున్నందున నిద్రలేమి కూడా పెరిగిపోతోంది. శారీరక, మానసిక కారణాలు తదితర కారణాలు దీనికి తోడవుతుంటాయి. నొప్పి, లివర్ పనిచేయకపోవడం, రాత్రిపూట ఊపిరి సమస్య, మూత్రసమస్య వంటివి శారీరక కారణాలు కాగా, ఆందోళన పెరగటం, పనిలో ఒత్తిడి, కుంగుబాటు వంటివి నిద్ర సమస్యలకు దారితీస్తుంటాయి. నిద్రలేమి అనేది వ్యక్తికి వ్యక్తికి విభిన్నంగా ఉంటుంది.

స్లీపింగ్ పిల్స్ ఎవరు ప్రిస్క్రయిబ్ చేస్తారు     

నిద్రలేమికి నిద్రమాత్రలు సరైన చికిత్సే కావచ్చు. కానీ అవి జీవితాంతం నిద్రమాత్రలపై ఆధారపడేలా చేస్తాయని ఢిల్లీలోని బీఎల్‌కే-మాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లోని చెస్ట్ అండ్ రెస్పిరేటరీ డిసీస్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ స్ందీప్ నాయర్ చెప్పారు. వీలైనంత వరకు స్లీపింగ్ పిల్స్ ని మానేయడమే మంచిదని ఈయన భావన. వైద్యపరమైన అస్వస్థత,సర్జరీ  వంటివి సహించలేని బాధను కలిగిస్తున్న సమయాల్లో మాత్రమే నిద్రమాత్రలను అప్పుడప్పుడూ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇటీవలే ఒత్తిడికి గురై, ఆందోళన, నిద్రా భంగాలకు గురవుతున్నవారు కొన్ని రోజులపాటు నిద్రమాత్రలను వాడాల్సి ఉంటుందని, శ్వాస సమస్యతో కొట్టుమట్టాడుతున్న వారు కూడా నిద్రమాత్రలను వాడాల్సి ఉంటుంది. అయితే తప్పదు అనుకున్న పరిస్థితుల్లోనే వీటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు లివర్ డిస్ ఫంక్షన్, రెనల్ డిస్ ఫంక్షన్, ఇంట్రాక్రేనియల్ సమస్యలు ఉన్నవారు నిద్రమాత్రలు వేసుకోవడం అవసరమేనని డాక్టర్ సందీప్ నాయర్ చెబుతున్నారు.

నిద్రమాత్రలు అధికంగా తీసుకుంటే...     

నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్పలితాలను గురించి డాక్టర్ చంద్ర హెచ్చరించారు. వైద్యులు ప్రిస్క్రయిబ్ చేసిన దానికంటే ఎక్కువగా రోగులు నిద్రమాత్రలను వాడుతున్నారని ఈయన అంటున్నారు. డాక్టర్లు సూచించిన కాలానికంటే ఎక్కువగా రోగులు వీటిని తరచుగా వాడుతుండటం మరిన్ని సమస్యలకు దారితీస్తుందని, నిద్రలేమిని పట్టించుకోకపోవడం వల్ల అది దీర్ఘ కాలంలో రోగుల ఆరోగ్య సమస్యలను పెంచిపోషిస్తుందని చెబుతున్నారు.

నిద్రమాత్రలను ప్రోత్సహించడం నేరం     

ఎవరైనా సరే నిద్రమాత్రలను తీసుకోమని ప్రోత్సహించడం నేరమని డాక్టర్ నాయర్ చెబుతున్నారు. ఇవి హానికరమైన మందులు. ఇవి రోగలను నిస్సత్తువలో ముంచివేస్తాయి. వీటివల్ల తలనొప్పి, మలబద్దకం, డయేరియా, న్యూరోలాజికల్ అస్తవ్యస్తతలు, కండరాల బలహీనత, లిబిడో నష్టం వంటి ఎన్నో దుష్ఫలితాలు కలుగుతాయని ఈయన చెబుతున్నారు.

అయితే ఒకరికి ఒక సందర్భలో సూచించిన నిద్రమాత్రలను ఎవరికీ షేర్ చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా సరే నిద్రమాత్రలు వాడి తీరాలనుకున్నప్పుడు డాక్టర్‌ని సంప్రదించిన తర్వాత వారి వ్యాధికి అనుగుణమైన నిద్రమాత్రలను తీసుకోవలిసి ఉంటుంది. ఏ తరహా మాత్ర సురక్షితమైనది అనేది డాక్టర్ తేల్చవలసిన విషయం. నిద్రమాత్రలు తీసుకోవడంలో సొంత వైద్యం ప్రాణాంతకంగా మారుతుందని చెబుతున్నారు.

దుష్ఫలితాలు తప్పవు     

నిద్రమాత్రలు కూడా ఇతర మందులలాగే దుష్ఫలితాలను కొని తెస్తాయి. తగిన మోతాదులో, వ్యాధికి తగినట్లుగా వాడకపోతే, మెడికల్ ప్రాక్టీషనర్లను పక్కన పెట్టి మందుల షాపుల్లో దొరుకుతాయని వాడటం మొదలు పెడితే అవి రోగికి మరిన్ని సమస్యలు కొనితేవడం ఖాయమని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే పరిస్థితినిబట్టి రెండు వారాలకు లేదా నెలరోజులకు మించి నిద్రమాత్రలు తీసుకుంటే కచ్చితంగా అది వ్యసనం అవుతుంది. వైద్య సలహా లేనిదే నిద్రమాత్రల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అని వీరంటున్నారు.
 

మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం క్లిక్ చేయండి



2022-05-26  Health Desk