మురారి సినిమాతో మహేష్ బాబుతో జోడీ కట్టి , చిరంజీవితో స్టెప్పులేసి, బాలయ్య పక్కన నటించి , తెలుగు ప్రజల మనసులను కొల్లగొట్టింది బాలీవుడ్ భామ సోనాలి . ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన సోనాలి ప్రస్తుతం బుల్లితెరమీద ఓ టాలెంట్ షోకు జడ్జ్ ఉంటోంది. అనారోగ్య కారణాల రిత్యా కెరీర్ మధ్యలోనే ముగించిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే సోషల్ మీడియా స్టార్ గా మారుతోంది. ఈమధ్యకాంలో సోనాలి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను అలరిస్తోంది. ఓ వైపు జడ్జ్‌గా మరో వైపు ఫ్యాషనిస్టుగా ఈ ఉంటూ ఫ్యాన్స్‌ను ఖుషి చేస్తోంది. తాజాగా ఈ భామ నలుపు రంగు డ్రెస్‌లో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
సోనాలి ఓ స్టైలిష్ ఐకాన్:
సెలబ్రిటీ సోనాలీ బింద్రే స్టైలిష్ ఐకాన్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు . వీలుదొరికినప్పుడల్లా తన స్టైలిష్ అవుట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటూనే ఉంటుంది . ఈ భామకు జడ్జ్‌గా తన లుక్‌ను ఎలా అవ్ట్స్టాండింగ్గా ఉంచుకోవాలో తెలియడంతో పాటు బిగ్ ఫ్యాట్ పార్టీలలో ఏ విధమైన అవుట్‌ఫిట్స్ ధరించాలో కూడా బాగా తెలుసు . అందుకే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహర్ బర్త్‌డే పార్టీ కోసం సోనాలి అదిరిపోయే బ్లాక్ అవుట్‌ఫిట్‌ను ధరించి ఫోటో షూట్ చేసి ఫ్యాన్స్ ను మెప్పించింది.
బ్లాక్ అవుట్‌ఫిట్‌లో పార్టీ లుక్ :
బర్త్‌డే పార్టీ కోసం సోనాలి బ్లాక్ ప్యాంట్ సూట్‌ను ఎన్నుకుని బాస్ లేడీ గెటప్‌లో అదరగొట్టింది. ఈ అదిరిపోయే అవుట్‌ఫిట్‌ను సోనాలి ఫాల్గుని షానే పికాక్ డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకుంది . బ్రాలెట్, దానికి మ్యాచింగ్‌గా వైడ్ లెగ్స్, సైడ్ స్లిట్స్ ఉన్న ట్రౌజర్‌ను ధరించి, ఫుల్ స్లీవ్స్, ప్లంగింగ్ నెక్లైన్, కాలర్డ్ బ్లేజర్, స్లీవ్స్ దగ్గర డ్రమాటిక్ ఫ్రింజ్ డీటైల్స్‌తో ఉన్న బ్లేజర్‌ను తొడుక్కుంది. ఈ అవుట్‌ఫిట్ సోనాలికి పెర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. దీనికి తగ్గట్లుగానే ఆభరణాలను ఎన్నుకుని అందరిని అట్రాక్ట్ చేసింది. మెడలో చోకర్ నెక్లెస్, చేతి వేళ్లకు స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్‌ను పెట్టుకుంది. అవుట్ ఫిట్‌కు మ్యాచ్ అయ్యే విధంగా బ్లాక్ హీల్స్ వేసుకుంది. న్యూడ్ మేకప్ వేసుకుని కనులకు హెవీ కోహెల్ ఆంపెల్ మస్కరా పెట్టుకుంది. పెదాలకు న్యూడ్ కలర్ లిప్‌స్టిక్ దిద్దుకుని తన లుక్‌ను పూర్తి చేసి ఫ్యాషన్ ప్రియుల మనసు దోచేసింది.
రెడ్ గౌనులో అందాలు అదిరేను:
సోనాలీ బింద్రే తన అభిమానులకు ఫ్యాషన్ లక్ష్యాలను చూపడానికి ఎంతో ఇష్టపడుతుంది. అందుకే తన లుక్స్ ఎప్పుడూ బెటర్ గా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే సోనాలి నమ్రతా జోషిపురా క్లాతింగ్ బ్రాండ్ నుంచి అద్భుతమైన గౌనును ఎన్నుకుని ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్వార్టర్ స్లీవ్ కేప్ గౌన్‌లో సోనాలి ట్రెండీ లుక్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నాయి. డీప్ రెడ్ కలర్ లో ఉన్న ఈ గౌనుకు నడుము భాగాన వచ్చిన బ్రాడ్ వెయిస్ట్ బెల్ట్ అవుట్‌ఫిట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌ను తీసుకువచ్చింది. మెస్సీ బన్‌తో , హెవీ ఐ మేకప్‌తో ఈ మోనోక్రొమాటిక్ స్టైలిష్ గౌన్‌లో ట్రెండ్ కనిపించి మెస్మరైజ్ చేసింది.
ఫ్లేర్డ్ స్కర్ట్‌తో ఫిదా చేస్తున్న సోనాలి:
ఇటీవలె సోనాలి తన ఇన్స్టాగ్రామ్ లో మరో బ్లాక్ అవుట్‌ఫిట్‌తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను షేర్ చేసింది. డిజైనర్ లేబుల్ ఈషా అరోరా రూపొందించిన ఫ్లేర్డ్ స్కర్ట్ వేసుకుని దానికి జోడీగా కాలర్డ్ నెక్ , క్వార్టర్ స్లీవ్స్, గోల్డెన్ మోతిఫ్స్తో వచ్చిన షార్ట్ బ్లేజరను వేసుకుంది. చెవులకు ఓవరసైజ్ హూప్ ఇయర్రింగ్స్ చేతివేళ్లకు స్టేట్మెంట్ ఉంగరాలను పెట్టుకుంది. న్యూడ్ మేకప్ తో క్లాసీ కారామిల్ లిప్ షేడ్‌తో అందరిని ఆకట్టుకుంది.