collapse
...
Home / ఆరోగ్యం / ఇమ్యూనిటీ / కోవిడ్ తర్వాత కాఫీ చెత్త వాసన ఎందుకు వస్తుంది? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

కోవిడ్ తర్వాత కాఫీ చెత్త వాసన ఎందుకు వస్తుంది?

2022-05-28  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

coffee
కరోనా సోకినవారు వాసన కోల్పోవడం సాధారణ లక్షణమే. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డాక వాసన చూడలేకపోతున్నారు. కొంతమంది తాత్కాలికంగా వాసనను కోల్పోతుంటారు. మరికొందరు కరోనా నుంచి బయటపడిన రెండు, మూడు నెలల వరకూ వాసనను చూడలేకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ముక్కు ద్వారా కరోనా మన శరీరంలోకి చేరుకుంటుంది. ఈ క్రమంలో ముక్కులో ఉండే నాడులపై వైరస్ ప్రభావం చూపుతుంది. నాడులను వైరస్ ధ్వంసం లేదా నాశనం చేస్తుంది. దీనివల్ల మనం వాసన చూసే శక్తిని కోల్పోతాం. వాసన కోల్పోవడం లేదా వాసన చూసే శక్తి తగ్గిపోవడాన్ని వైద్య పరిభాషలో 'పరోస్మియా'గా వ్యవహరిస్తారు. కొన్నిసార్లు తాత్కాలికంగా వాసన కోల్పోతాం. కానీ కొంతమంది రోగుల్లో నెలల తరబడి ఈ స్థితి కొనసాగుతుంది అని నిపుణులు పేర్కొంటారు. 'కరోనా వైరస్ కచ్చితంగా మెదడుకు అనుసంధానమైన ఘ్రాణ నాడులపై దాడి చేస్తుంది. వాసన, రుచి చూడటంలో ఇది చాలా ముఖ్యం

సువాసనలు కాస్త చెత్త లేదా మురుగునీటి వాసన వస్తాయి..

ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ మహమ్మారి బారి నుంచి ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటోంది. అయితే శాస్త్రవేత్తలు SARS-CoV-2` (COVID-19కి కారణమైన వైరస్) మన శరీరాలపై చూపిన ప్రభావాలను గుర్తించడానికి కృషి చేస్తున్నారు. కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన వ్యక్తులలో చాలా మంది ముందుగా వాసనను కోల్పోతారు. శాస్త్రవేత్తలు పరోస్మియా వెనుక ఒక ట్రిగ్గర్ అణువును గుర్తించారు. మనకు బాగా తెలిసిన వాసనలను సైతం గుర్తించలేకపోవడం లేదంటే దుర్వాసనగా మారిపోవడం, ఆహారం, మానసిక ఆరోగ్యంపై పరిణామాలుంటాయి. పోస్ట్-ఇన్‌ఫెక్షన్ ఫీచర్‌లో భాగంగా సువాసనలు కాస్త చెత్త లేదా మురుగునీటిని పోలిన వాసన వచ్చిన చాలా కేసులను వైద్యులు గుర్తించారు. జర్నల్ కమ్యూనికేషన్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, ఫుడ్, ఫార్మసీ, యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్, యూనివర్శిటీ కాలేజ్ లండన్ హాస్పిటల్ పరిశోధకులు అంతర్లీన యంత్రాంగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.

కరోనా తర్వాత 5065% కేసులు అనోస్మియాకు దారి తీస్తాయి..

ఈ లక్షణానికి సంబంధించి 15 వేర్వేరు పరమాణు ట్రిగ్గర్‌లను అధ్యయన బృందం కనుగొంది. పరిస్థితిని ప్రేరేపించే అత్యంత శక్తివంతమైన కాఫీలో కనిపించే వాసన అణువును  2-ఫ్యూరాన్‌మెథనేథియోల్ అంటారు. సాధారణ వాసన కలిగిన వ్యక్తులు కాఫీ లేదా పాప్‌కార్న్‌ స్మెల్‌ను గుర్తించగా, పరోస్మియా ఉన్నవారు దీనిని అసహ్యంగా, దుర్గంధం వెదజల్లుతున్నట్టుగా పేర్కొన్నారు. "మేము ఇన్‌స్టంట్ కాఫీ వాసనను కలిగించే రసాయనాలను వేరు చేసే సాంకేతికతను ఉపయోగించాము. ఇన్‌ఫెక్షన్ తర్వాత పరోస్మియాతో బాధపడుతున్న అనేక మంది వ్యక్తులు ఒక సమయంలో వాటిని వాసన చూడటానికే చాలా ఇబ్బంది పడ్డారు. వీరిలో చాలా మంది వ్యక్తులు అసహ్యకరమైన వాసన వస్తున్నట్టు పేర్కొన్నారు" అని పరిశోధకులు వెల్లడించారు. SARS-CoV-2 వ్యాప్తి చెందిన తరువాత 5065% కేసులు అనోస్మియా (వాసనను కోల్పోవడం)కి దారితీస్తాయని గుర్తించామని తెలిపారు. కాఫీ, చాక్లెట్, మాంసం, ఉల్లిపాయలు, వెల్లుల్లి, గుడ్డు, పుదీనా, టూత్‌పేస్ట్‌లు పరోస్మియాకు సాధారణ ట్రిగ్గర్లుగా పరిశోధకులు గుర్తించారు.

వాసన కోల్పోయిన వ్యక్తులు ఏం చేయాలి..

కరోనా సోకడం వల్ల వాసన కోల్పోయిన వ్యక్తులు 'స్మెల్ థెరపీ' తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోగులు, వివిధ రకాల వాసనలు గుర్తించేందుకు 'స్మెల్ థెరపీ' సహకరిస్తుంది. కొన్ని నెలల పాటు ఈ థెరపీని అనుసరించాలి. దీనివల్ల వాసనలు గుర్తించే సామర్థ్యాన్ని మెదడు తిరిగి పొందుతుంది. రోజులో మూడుసార్లు వివిధ రకాల వాసనలు చూడాల్సిందిగా రోగులకు చెబుతారు. దీనివల్ల ముక్కులో బ్లాక్ అయిన భాగాలను పూర్వ స్థితికి తీసుకురావడంతో పాటు, వాసన గ్రహించే శక్తిని తిరిగిపొందవచ్చని వైద్యులు చెబుతారు. ఈ థెరపీ ఖరీదైనదేం కాదని నిపుణులు చెబుతున్నారు. వాసన గ్రహించే శక్తిని తిరిగి పొందడంలో ఇది రోగులకు సహాయపడుతుంది. స్మెల్ థెరపీలో నారింజ, పుదీనా, కాఫీ, అల్లం వంటి పదార్థాల వాసనలు చూపిస్తుంటారు. ఇలా కొన్ని నెలల పాటు చేయాలని నిపుణులు పేర్కొన్నారు.
 



2022-05-28  News Desk