collapse
...
Home / జాతీయం / సోషల్ మీడియాకు దూరమైతేనే మానసికారోగ్యం మెరుగు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

సోషల్ మీడియాకు దూరమైతేనే మానసికారోగ్యం మెరుగు

2022-05-28  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

social media-1

 

సోషల్ మీడియాకు కనీసం వారం రోజులపాటు దూరంగా ఉన్నా సరే వ్యక్తుల సమగ్ర ఆరోగ్యంతో పాటు మానసికారోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రస్తుత తరంలో సాధారణం అయిపోయిన కుంగుబాటు, ఆందోళనలను కూడా ఇది తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. తాజా పరిశోధనా ఫలితాలను సైబర్ సోషియాలజీ బిహేవియర్ అండ్ సోషల్ నెట్‌వర్కింగ్ అనే జర్నల్‌లో ప్రచురించారు.

యూనివర్సిటీ ఆఫ్ బాత్ పరిశోధకుల బృందం సోషల్ మీడియాకు వారం రోజులపాటు బ్రేక్ ఇచ్చిన, దూరంగా ఉన్న వ్యక్తుల మానసికారోగ్య ప్రభావాలను అధ్యయనం చేసింది. వారం రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఒక వారంలో తొమ్మిది గంటల సమయం ఆదా అయిందని ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు కొందరు చెప్పారు.  సోషల్ మీడియాకు దూరంగా లేకపోయి ఉంటే వారంలో ఈ తొమ్మిది గంటలూ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్, టిక్ టాక్ వంటి వాటిని తిరగేస్తూ, స్ర్రోల్ చేస్తూ ఉండేవారమని వీరు చెప్పారు.

ఈ అధ్యయనం ప్రారంభంలో ఆందోళన, కుంగుబాటు, స్వస్థత వంటి వాటిని బేస్ లైన్ స్కోర్లుగా తీసుకున్నారు. సోషల్ మీడియాలో వారానికి సగటున 8 గంటలు గడిపేవారిని పరిశీలనకు తీసుకున్నారు. వీరిని సోషల్ మీడియాకు పూర్తి దూరంగా ఉంచారు. వారం తర్వాత వీరిని ఎలా ఉందని ఫ్రశ్నిస్తే వారం విరామంతోనే తమకు ఆందోళన, ఆత్రుత వంటివి గణనీయంగా తగ్గిపోయాయని, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఆ వారం రోజులు సోషల్ మీడియాను వదలని వారితో పోల్చి చూస్తే పూర్తిగా బ్రేక్ తీసుకున్నవారి మానసికారోగ్యం గణనీయంగా మెరుగుపడందని ఈ అధ్యయనం తెలిపింది.

బాత్ యూనివర్సిటీ ఆరోగ్య విభాగానికి చెందిన లీడ్ రీసెర్చర్ డాక్టర్ జెఫ్ లాంబెర్ట్ ఈ విషయమై మాట్లాడుతూ సోషల్ మీడియాను ఊరికే స్క్రోలింగ్ చేస్తూ పోవడం యావత్ ప్రపంచాన్ని అంటేసిందని, మనం నిద్ర లేచినప్పటి నుంచి, తిరిగి నిద్రపోయేంతవరకు ఎలాంటి ఆలోచనా లేకుండానే సోషల్ మీడియాను కలబెడుతుంటామని చెప్పారు.

సోషల్ మీడియా వాడకం చాలా చాలా ఎక్కువని మనకు తెలుసు. దాని మానసిక ప్రభావాలు కూడా ఏ స్థాయిలో మనిషిని కుంగదీస్తాయో కూడా తెలుసు. అందుకే ఈ అధ్యయనంలో సోషల్ మీడియాకు వారంరోజులు విరామం ప్రకటించమని అడిగాం. దానిద్వారా మన మానసికారోగ్య ప్రయోజనాలు ఏంటో కూడా పరిశీలంచాం. ఈ స్టడీలో పాల్గొన్న చాలామంది సోషల్ మీడియాకు దూరం కావడం ద్వారా తమ మానసిక స్థితి ఎంతగానో మెరుగుపడిందని, మొత్త మీద చూస్తే ఆత్రుత, ఆందోళన చాలావరకు తగ్గిందని చెప్రడం గమనార్హం. అంటే సోషల్ మీడియానుంచి ఒక చిన్న బ్రేక్  లేదా విరామం తీసుకున్నా సరే అది ఎంతో ప్రభావం వేస్తుందని బోధపడిందని డాక్టర్ లాంబెర్ట్ చెప్పారు.

అయితే నేటికాలంలో సోషల్ మీడియా మన జీవితాల్లో ఒక విడదీయరాని భాగమైపోయింది. తామెవరమో, తామెవరితో ఇంటరాక్ట్ అవుతున్నామో అందరికీ తెలుసు. కానీ ప్రతివారం సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ గంటలపాటు గడిపేస్తే అది కచ్చితంగా మీపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తోంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించే సమాయాన్ని అయినా కాస్త తగ్గించుకుంటే మంచిదని లీడ్ రీసెర్చర్ లాంబెర్ట్ చెప్పారు.

గత 15 సంవత్సరాలుగా సోషల్ మీడియా మనం కమ్యూనికేట్ చేసే విధానాన్ని విప్లవీకరించింది. ఒక్క బ్రిటన్‌లో 2011లో 45 శాతం మంది వయోజనులు సోషల్ మీడియాను ఉపయోగించగా, 2021 నాటికి వారు 71 శాతానికి పెరిగారు. 16 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్నవారు 97 శాతం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. పైగా మనం చాలా తరచుగా నిర్వహించే ఆన్ లైన్ కార్యక్రమం ఏదంటే స్రోలింగే,

 

మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి 2022-05-28  News Desk