Courtesy:@Thefield_in
మార్చి, 2022లో నిర్వహించిన ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలో తన సమ్మతి లేకుండా వీడియో తీశారంటూ జిమ్నాస్ట్ అరుణారెడ్డి బుద్దా కోచ్ రోహిత్ జైస్వాల్ పై ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలను విచారించేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శుక్రవారం ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (టీమ్స్) రాధిక శ్రీమన్ నేతృత్వం వహిస్తారు. కోచ్ కమలేష్ తివానా, డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) కైలాష్ మీనా కూడా కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
గతంలో జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జిఎఫ్ఐ)కోచ్ రోహిత్ జైస్వాల్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. అతనిపైనే అరుణ రెడ్డి తన ఆరోపణలు చేయడం గమనార్హం. కోచ్ దారుణాలపై తాను న్యాయపోరాటం చేస్తానని కోర్టుకు వెలతానని అరుణారెడ్డి చెప్పారు. కాగా సాయ్ ఏర్పాటు చేసిన కమిటీ ఇరు పక్షాల వాంగ్మూలాలను నమోదు చేసి, వచ్చే వారంలోగా తన నివేదికను దాఖలు చేస్తుంది.
అరుణ ఏమంటున్నారంటే..
మార్చి 31 నుండి ఏప్రిల్ 4 వరకు జరిగే బాకు ప్రపంచ కప్ పోటీలకు ముందు ఫిట్నెస్ పరీక్ష కోసం తాను న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగిందని అరుణ ఆరోపించారు. 2018లో మెల్బోర్న్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో మహిళల వాల్ట్ ఈవెంట్లో ఆమె కాంస్య పతక విజేత.
ఈపరిక్ష మార్చి 24న జరిగింది. జైస్వాల్ తన శిష్యుడితో వీడియో తీయించారు. అప్పట్ఓ తన మోకాలికి గాయమైందివ. అందువల్ల తనను ఆ పోటీలకు సెలక్ట్ చేయలేదు. జిఎఫ్ ఐ అనుమతితోనే వీడియో తీస్తున్నారేమోననని అనుకున్నాను. కానీ అటువంటిదేమీ లేదని తర్వాత తెలిసిందని చెప్పింది.
పరిక్ష అనంతరం తన మోకాలి గాయం తీవ్రమవడంతో ఆ వీడియోను, మెడికల్ రిపోర్టును పంపించాలని జివెఫ్ ఐ అధ్యక్షుడు సుధీర్ మిట్టల్ ను చాలా సార్లు అడిగాను. కానీ అటువంటిదేమీ లేదని ఆయన సమాధానమిచ్చారు. దాంతో అనుమతి లేకుండానే జైస్వాల్ వీడియో తీశారని
అర్ధమైందన్నారు అరుణ. అయితే వీడియో తీసినట్లు తన వద్ద సాకర్ష్యాధారాలు ఉన్నాయని అలందుకే ఫిర్యాదు చేశానని అరుణ చెబుతున్నారు.
కాగా, అటువంటి సంఘటనలను తాము ఏమాత్రం సహించేది లేదని సాయ్ (SAI) అధికారి ఒకరు తెలిపారు. "ఒక సంస్థగా, అటువంటి సంఘటనలు మాకు ఎటువంటి ఆమోదం కాదు. నిందితుడు దోషిగా రుజువైతే అతని పై తగిన చర్యలు తీసుకుంటాము" అని ఆయన తెలిపారు. అయితే, జిఎఫ్ ఐ ఏర్పాటు చేసిన కమిటీ సమక్షంలోనే ఈ పరీక్ష నిర్వహించినట్లు సాయ్ చెబుతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి