collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / అంతర్జాతీయ ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న హీనా ఖాన్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

అంతర్జాతీయ ఫ్యాషన్స్‌తో అదరగొడుతున్న హీనా ఖాన్

2022-05-28  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

hina khan-9
 

ఈ ఏడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అద్భుతమైన అవుట్‌ఫిట్స్‌తో అదరగొడుతోంది బాలీవుడ్ బ్యూటీ హీనా ఖాన్. ఈ నటి తన రెడ్ కార్పెట్ లుక్స్‌కు సంబంధించిన స్నిప్పెట్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రొఫైల్ లో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా హీనా ఫ్రెంచ్ రివేరా లో రీసెంట్ గా చేసిన ఫోటో షూట్ పిక్చర్స్‌ను తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో షేర్ చేసి అందరి మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి లుక్స్‌ చూసి ఫ్యాషన్ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. 
 
బాస్ లేడీ గెటప్‌లో బోల్డ్ లుక్ :  
 
హీనా ఖాన్ ఫ్రెంచ్ రివేరాలో బాస్ లేడీ గెటప్ లో బోల్డ్ లుక్‌లో కనిపించి అందరి మైండ్ బ్లాక్ చేసింది. ఫ్యాషన్ లవర్స్ కి స్టైలిష్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. 
హీనా ఐవొరీ వైట్ షార్ట్ పెన్సిల్ స్కర్ట్‌ను దానికి జోడీగా వైట్ బ్లేజర్ వేసుకుని సాగర తీరంలో తన సొగసుల విందును పరిచింది. ఈ డ్రెస్ వెనుక భాగంలో వచ్చిన టుల్లే ట్రెయిన్ అవుట్‌ఫిట్‌కు మరింత ఆకర్షణను తీసుకువచ్చింది. వజ్రాలతో పొదికిన నెక్ చైన్‌ను మెడలో అలంకరించుకుని తన రూపాన్ని మరింత పెర్‌ఫెక్ట్ గా మార్చుకుంది. ట్రాన్స్‌పరెంట్ హీల్స్ వేసుకుని స్టైలిష్‌ లుక్స్‌తో అదరగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌లో బ్లేజర్ డిజైన్ హైలెట్‌గా నిలుస్తోంది. బ్లేజర్ వెనుక భాగంలో వైట్, ఆఫ్ వైట్‌ డీటైల్స్ కొత్తగా ఉండటంతో అందరి చూపు ఆ బ్లేజర్ పైనే పడింది.  

hina khan-8
 

మినిమల్ మేకప్ తో మైండ్ బ్లాక్ :  
 
ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా హీనా మినిమల్ మేకప్ లుక్ ను ఎంచుకుంది. ముందుగా తన హెయిర్‌ను మధ్యపాపిట తీసి సింపుల్ పోనీటెయిల్ వేసుకుంది. 
కనురెప్పలకు న్యూడ్ ఐ ష్యాడో, మస్కరా పెట్టుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని తన లుక్ ను పూర్తి చేసి అందరిని ఫిదా చేసేసింది. 

hina khan-7
 

ప్రాన్స్ వీధుల్లో ఫ్యాషన్ మంత్ర:  
 
ఇటీవలె మరో అద్భుతమైన స్టైలిష్ అవుట్‌ఫిట్ తో ఫోటో షూట్ చేసి అందరిని ఫిదా చేసింది ఈ బాలీవుడ్ బొమ్మ. బ్లూషేడ్స్‌ లో వచ్చిన అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్‌కు చెందిన ప్యాంట్ సూట్, బ్లేజర్ అవుట్‌ఫిట్‌ను వేసుకుని తన స్టైలిష్ లుక్స్‌తో కేక పుట్టించింది ఈ చిన్నది. ఈ పవర్ సూట్ తో ఫ్రాన్స్ వీధులకు కొత్త రంగులను అద్దింది. టాప్ టు బాటమ్ ఒకే రంగులో ఒకే ప్యాట్రన్‌లో ఉన్న ఈ అవుట్‌ఫిట్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంది. ఈ లుక్ కు తగ్గట్లుగా హీనా తన హెయిర్‌ను మధ్యపాపిట తీసి కొప్పుగా చుట్టుకుంది. ముఖానికి స్టైలిష్ గాగుల్స్‌ను పెట్టుకుంది. ఇక పాదాలకు వేసుకున్న పాయింటెడ్ బ్లాక్ షూస్ హీనా అందాలను రెట్టింపు చేశాయి. 

hina khan-6
 

హీట్ పెంచిన హీనా లుక్స్ :  
 
ఈ మధ్యనే హీనా కేన్స్ ఫెస్టివల్ లో భాగంగా మరో అద్భుతమైన పవర్ సూట్ వేసుకుని బాస్‌ లేడీ గెటప్‌తో అలరించింది. సాటిన్ బ్లాక్ ట్రౌజర్స్ కు జోడీగా సాటిన్ కాలర్స్ కలిగిన బ్లాక్ బేజర్‌ను ధరించిన ఫ్రాన్స్ వీధుల్లో అద్భుతమైన ఫోటో షూట్ చేసింది హీనా. ఈ అవుట్‌ఫిట్‌లో బ్లేజర్ కాలర్ పైన వచ్చిన సిల్వర్ , స్టోన్స్ తో తీర్చిదిద్దిన డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా చెవులను వెండి ఇయర్ రింగ్స్‌ను పెట్టుకుంది . తన కురులను డిగా చుట్టుకుని కనులకు న్యూడ్ ఐ ష్యాడో, మస్కరాలను దిద్దుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్ పెట్టకుని అదరగొట్టింది.  

hina khan-5
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి

 



2022-05-28  Lifestyle Desk