collapse
...
Home / ఆధ్యాత్మికం / ప్రత్యేక పూజలు / మరపురాని అనుభూతినిచ్చే ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

మరపురాని అనుభూతినిచ్చే ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’

2022-05-30  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Inter-caste-marriage-india
 

పెళ్లి గురించి ప్రతి ఒక్కరూ ఎన్నో కలలు కంటారు. కాబోయే వరుడు, లేదా వధువు తనకు నచ్చినట్టు ఉండాలని, తనను ఇష్టపడి ప్రేమగా చూసుకోవాలనీ కోరుకుంటారు. అది సహజం. అలాగే పెళ్లి గ్రాండ్ గా జరగాలని కొందరనుకుంటే, సింపుల్ గా జరిగితే చాలని మరికొందరనుకుంటారు. ఇదివరకు చాలా వివాహాలు సంప్రదాయం ప్రకారం జరిగేవి. కానీ ఇప్పుడు  మ్యారేజ్ ఒక లగ్జరీగా మారింది. అందుకు తగ్గట్టే ‘డెస్టినేషన్ వెడ్డింగ్స్’ వచ్చేశాయి. అసలవేంటో చూద్దాం పదండి.

పెళ్లి…జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మనోజ్ఞమైన దృశ్యం. తీపి తలపు. ఎన్నో ఆశలు, కలలు నిజమయ్యే వేళ. ఇప్పటిదాకా గడిచింది ఒక జీవితం. ఒక దశ. ఇక నుంచీ మరో జీవితం. మరో దశ. మరో మలుపు. మరో మెరుపు. పెళ్లి అనేది మూసిన తలుపు వంటిది. తలుపు తీసుకొని మరో ప్రపంచంలోకి అడుగుపెట్టాలని తహతహ, ఆశ, ఆత్రుత. 
ఇక పెళ్లి సందడి… హడావుడి చేసేవాళ్లు బంధువులు. ఫ్రెండ్స్. సిగ్గుపడేవాళ్లు పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు. ఇప్పటి పెళ్లి కూతుళ్లు సిగ్గుపడుతున్నారో లేదో మనం చెప్పలేం. పెళ్లికొడుకు మాత్రం తప్పకుండా సిగ్గుపడుతున్నాడు. అదిమాత్రం చెప్పొచ్చు.
మ్యారేజ్ హాల్ బుకింగ్  
పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత మనం చేసే మొదటి పని మ్యారేజ్ హాల్ బుక్ చేసుకోవడం. అవును కదా. బట్ … ఇప్పుడు ట్రెండ్ మారింది. గ్రాండ్ గా చేయడం ఒక స్టేటస్ సింబల్ అయింది.  ఏదోక రిసార్ట్ లోనో, సముద్ర తీరంలోనో పెళ్లి జరుపుకోవడం ఇప్పటి ట్రెండ్. అందుకు తగ్గట్టుగానే వెడ్డింగ్స్ కోసం డెస్టినేషన్స్ వెలిశాయి. మన రేంజ్ ను బట్టి డెస్టినేషన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. దేశంలో అలాంటి డెస్టినేషన్స్ రెడీగా ఉన్నాయి. వాటినే డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటున్నారు.  అక్కడ పెళ్లి చేస్తే కోటి కావచ్చు, ఐదు కోట్లు కావచ్చు. పది కోట్లు కావచ్చు. రాజభవనాల్లో వివాహం చేసుకుంటే కలిగే అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి లగ్జరీ రిసార్టులు. రకరకాల డెకరేషన్స్ తో ఆఫర్లు ఇస్తున్నాయి. అలాంటి కొన్ని హైక్లాస్ వెన్యూలను చూద్దాం. 
హైక్లాస్ వెడ్డింగ్ కల్చర్    
భయంకరమైన కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్నే ధ్వంసం చేసింది. ఎన్నో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. నలుగురు ఒకచోట గుమికూడకూడదు, సెలెబ్రేషన్స్ చేసుకోకూడదు అని ఆంక్షలు విధించడంతో ఫంక్షన్లు లేవు. ఈవెంట్లు లేవు. ప్రొఫెషనల్ సెటప్స్ లేవు. కరోనాను నిర్మూలించేందుకు వ్యాక్సిన్ కనిపెట్టడం, దాదాపు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడంతో మళ్లీ మామూలు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రయాణాల మీద ఆంక్షల్ని కూడా సడలించారు. దాంతో మళ్లీ పెళ్లిళ్లు మొదలయ్యాయి. పెళ్లి తంతు, పెళ్లి సందడి అందరికీ తెలిసిందే. పెళ్లంటే సంతోషం, సంబరం. అయితే … భారతీయ వివాహం అంటే ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలి అనే ధోరణి మారుతోంది. పెళ్లి కలకాలం సుందర స్వప్నంలా నిలిచిపోయేలా జరపాలని ఆలోచిస్తున్నారు. అందుకు తగ్గట్టు బడ్జెట్ వేసుకుంటున్నారు. ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లి రోజును స్పెషల్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అందుకోసం వచ్చినవే డెస్టినేషన్ వెడ్డింగ్స్. అంటే ఒక ప్రత్యేక ప్రదేశంలో జరిగేవి. అలాంటి కొన్ని ప్రత్యేక ప్రదేశాలపై ఓ లుక్కేద్దామా?
తామర కొడై  
ఇది తమిళనాడు కొడైకెనాల్ లో ఎత్తైన ప్రదేశంలో ఉంది. ఇక్కడ వివాహం చాలా లగ్జరీగా, కలకాలం గుర్తుండే అనుభవంగా మిగిలిపోతుంది. ఆరోగ్యానికి ఇక్కడి స్వచ్ఛమైన గాలి, అందమైన లోయలు మధురానుభూతిని కలిగిస్తాయి. అంతేకాదు, ఒక విలువైన పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని రూపొందించారు.
రమడా రిసార్ట్, ఉదయపూర్  
రమడా రిసోర్ట్ – స్పా అనేది రాజస్థాన్ లో అత్యంత రొమాంటిక్ రిసార్ట్ లలో ఒకటి. పెళ్లి అంటే ఇలా జరగాలి అని కలలు కనేవారు తమ స్వప్నాన్ని నిజం చేసుకునేందుకు అనువైన లొకేషన్ రమడా. చుట్టూ ఉన్న అద్భుతమైన గార్డెన్స్, మేవాడ్ నగరంలా రూపొందించిన ఆర్కిటెక్చర్, సర్వాంగ సుందరంగా అలంకరించబడిన ఇంటీరియర్, ఆధుకత, రాజసం ఉట్టిపడేలా ఉంటుంది రమడా రిసార్ట్.  
ఐటీసీ గ్రాండ్ భారత్, గుర్ గావ్  
అయిదు వేల ఏళ్ల మన నాగరికతకు సజీవ దర్పణంగా నిలుస్తుంది ఐటిసి గ్రాండ్ భారత్. చరిత్రాత్మకమైన ఆరావళి పర్వత సానువుల్లో దీన్ని నిర్మించారు. ఈ రిసార్ట్ చాలా పెద్దది. రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. మనకెంతో సన్నిహితంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక అలంకరణ మనోహరంగా, తీర్చిదిద్దినట్టు, ప్రజల్ని ఆకట్టుకునేలా ఉంటుంది. ఐటిసి ఆతిథ్యాన్ని చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది.
ది డెల్టిన్ దమన్, దమన్  
ది డెల్టిన్ దమన్ అనే రిసార్ట్ దమన్ లో ఉంది. 176 రూములున్న ఈ రిసార్ట్ దమన్ లో అతి పెద్దది. పది ఎకరాల విస్తీర్ణంలో దీన్ని కట్టారు. ఇది సాటిలేని వెడ్డింగ్ వెన్యూ. ఏ స్థాయి వాళ్లకు తగ్గట్టు ఆ స్థాయిలో ఏర్పాట్లు ఉంటాయి. వివాహ వేడుకలకు ఇక్కడ అద్భుతమైన సౌకర్యాలున్నాయి. రెండువేల మంది అతిథులకు సరిపోయేలా నిర్మించారు.
గోవాలో బెలేజా  
19,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఒక వివాహ ప్రదేశం ఎంత మనోహరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. గోవా బీచ్ లో ఉన్న బెలేజా ను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బాల్కనీలో నిలబడి అలా చూస్తే అరేబియా సముద్రం ఆహ్లాదకరంగా కనబడుతుంది. ఈ రిసార్ట్ లో సిబ్బంది చేసే వంటకాలు మహా రుచిగా ఉంటాయి. వాటిని చూస్తే నోరూరడమే కాదు…గోవా కల్చర్ కూడా కనబడుతుంది. ఇక్కడ జరిగే పెళ్లికి విచ్చేయడం అతిథులకు మరచిపోలేని అనుభూతి నిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మికo కోసం క్లిక్ చేయండి2022-05-30  News Desk