collapse
...
Home / ఆరోగ్యం / ఫిట్ నెస్ / గాఢ నిద్ర పోవాలంటే.. తీసుకోవలసిన చక్కటి ఆహారం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

గాఢ నిద్ర పోవాలంటే.. తీసుకోవలసిన చక్కటి ఆహారం

2022-05-30  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

healthy food-2
 

రాత్రిపూట అంతరాయం కలుగకూడా గాఢనిద్ర పడితే కొన్ని రకాల దీర్ఘకాలిక అస్వస్థత ఏర్పటే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పూట కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవడం మంచిదని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి, క్షేమానికి నిద్ర అనేది ఎంతో అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్యమైన ఆహారంతో పాటు బాగా నిద్రపోవడం కూడా మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం.

నిద్రలేమితో ఇబ్బందిపడుతున్న వారు తమ ఆహారంలో కొద్ది మార్పులు చేసుకుంటే మంచి నిద్ర పోవడానికి అవి తోడ్పడతాయి. మీ డైట్‌లో చేర్చుకోదగిన కొన్ని బెస్ట్ ఫుడ్స్‌ి ఇక్కడ చూద్దాం.

బాదం, వాల్ నట్స్  
బాదం గింజల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. శరీరాన్ని బాదం గింజలు ప్రశాంతంగా ఉంచుతాయి. కండరాలకు ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి. అమినో ఆసిడ్ ట్రిప్టోఫాన్ ని నిద్రను కలిగించే మెలటోనిన్‌గా మార్చడంలో కాల్షియం మన మెదడుకు తోడ్పడుతుంది. గాఢంగా నిద్రపోవడానికి ఇది ఎంతో సహకరిస్తుంది.

తేనె  
ఒకే ఒక్క టీ స్పూన్ అంత తేనె మీ శరీరానికి అద్భుతాలు సృష్టిస్తుంది. మెలటోనిన్ విడుదల చేయడంలో తేనె మీ మెదడుకు తోడ్పడుతుంది. ఇది నిద్రించే సమయంలో మీ శరీరాన్ని పునరుత్తేజం చెందించే హార్మోన్. మెదడులో మెలటోనిన్‌ ని విడుదల చేయడం ద్వారా ఇది ఎవరినైనా యాక్టివ్ గా ఉంచుతుంది.

ఓట్లు  
ఓట్లు అమినో ఆసిడ్లను, విటమిన్లు, మినరల్స్‌‌ని  సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి నిద్రను ప్రేరేపించే మెలటోనిన్‌ని ప్రమోట్ చేస్తాయి. ఓట్లు ట్రిప్టోఫాన్ అనే అమినో ఆసిడ్‌ని కలిగి ఉన్నందున నిద్రపోయేముందు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో మెదడుకు ఇది చక్కగా తోడ్పడుతుంది.

అరటిపళ్లు  
పండ్లలో అద్భుతం ఏదన్నా ఉందంటే అది అరటిపండు మాత్రమే. పొటాషియం, మెగ్నీషియం దీంట్లో సమృద్దిగా ఉంటాయి. అరటిపళ్లను రాత్రిపూట తినడం వల్ల మీ కండరాలు మొత్తంగా రిలాక్స్ అవుతాయి. మీరు నిద్రపోవడానికి సిద్దంగా ఉన్నట్లు శరీరం అనుభూతి చెందేలా మెలటోనిన్ స్థాయిలను ఇవి పెంచుతాయి.

యోగర్ట్ (పెరుగు)   
నిద్రలేమిని ఎదుర్కొంటున్న వారికి పెరుగు చాలా మంచి ఆహారం. పెరుగులో అమినో ఆసిడ్ ట్రిప్టోఫాన్ ఉంటుంది. పెరుగు తీసుకుంటే బెడ్ మీదికి చేరుకోకముందే ఇది మీకు మత్తును కలిగిస్తుంది.

మరిన్ని ఆరోగ్యం వార్తల కోసం క్లిక్ చేయండి   



2022-05-30  Health Desk