collapse
...
Home / ఆరోగ్యం / ఆస్ట్రేలియాలో జన్మించిన 'పర్మనెంట్ స్మైల్' బేబీ.. అరుదైన జననం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu...

ఆస్ట్రేలియాలో జన్మించిన 'పర్మనెంట్ స్మైల్' బేబీ.. అరుదైన జననం

2022-05-30  International Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

smilebaby
 

ఆస్ట్రేలియా దంపతులకు జన్మించిన అయ్లా సమ్మర్ ముచా తన అందమైన క్యూట్ స్మైల్‌తో నెటిజన్లను వెర్రెక్కించేస్తోంది. ఈ పాప బిలేటరల్ మాక్రోస్టోమియా (చంటిబిడ్డకు వింత పరిస్థితి) అనే అత్యంత అరుదైన కండిషన్‌తో జన్మించింది. గర్భధారణ సమయంలో ఆ పాప నోటి చివరలు కలుసుకోక పోవడం వల్ల ఆ పాప జీవితాంతం నవ్వుముఖంతోనే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వికీపీడియా ప్రకారం మాక్రోస్టోమియా అనేది అత్యంత అరుదైన కండిషన్. లక్షా 50 వేల మంది నుంచి 3 లక్షల మందిలో ఒకరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుస్తోంది.

క్రిస్టినా వెర్చర్ (21), బ్లెయిజ్ ముచా (20) దంపతులకు 2021 డిసెంబర్‌లో ఆయ్లా సమ్మర్ ముచా అనే పాప జన్మించింది. పుట్టినప్పటినుంచి అరుదైన నవ్వుతో పుట్టిన పాపను చూసి తల్లిదండ్రుల ఆశ్చర్యపోయారు. కానీ తల్లి గర్భంలోనే ఈ కండిషన్ ఆ పాపకు ఏర్పడిందని వైద్యులు వివరించారు. ఆ పాప గురించిన సమాచారం ఆన్‌లైన్‌లో చేరిన క్షణం నుంచి ఆ బేబీ క్యూట్ స్మైల్ పోటో వైరల్ అవుతుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే క్రిస్టినా వెర్చర్ డెలివరీకి ముందు తీసిన ఆల్ట్రా సౌండ్ స్కాన్లలో ఆ చిన్నారి అరుదైన కండిషన్ ఏ రకంగానూ బయటపడలేదు. యువదంపతులు సర్జరీ ద్వారా కనాలని కోరుకున్నప్పుడు చేసిన పరీక్షల్లో ఆ చిన్నారి నవ్వుముఖాన్ని డాక్టర్లు పసికట్టారు. అయితే పర్మనెంట్ స్మైల్ లుక్స్ చిత్రాలలో క్యూట్‌గా కనిపిస్తున్నప్పటికీ అది ఆ పాపకు చాలా సమస్యలు తీసుకొస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా ఆ పాప తల్లిపాలు తాగలేదట.

ఇంతవరకు ఇలాంటి కేసులు ప్రపంచవ్యాప్తంగా 14 కేసులు మాత్రమే నమోదయ్యాయని 2007లో క్లెఫ్ట్ పలేట్-క్రేనిఫేసియల్ జర్నల్ తెలిపిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఆయ్లా బేబీ జన్మించిన ఆసుపత్రిలో ఇదే తొలికేసు అట. ఇది ఎంత అరుదైన కేసు అంటే పాప తల్లిదండ్రులు చికిత్సా సమయంలో అనేక సమస్యలు ఎదుర్కోవలిసి వచ్చింది. వారు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వైద్య నిపుణులకే గంటల సమయం పట్టింది.

ఆసుపత్రి వారికి ఈ అరుదైన కండిషన్ గురించి ఏమీ తెలీకపోవడంతో వారు తనకు ఎలాంటి సహాయం చేయలేకపోయారని తల్లి క్రిస్టీనా వెర్చర్ తెలిపింది. గర్భదారణ సమయం మొత్తంలో తాను మందకొడిగా ఉండిపోవడంతో ఒక తల్లిగా తాను ఎక్కడ తప్పు చేశాను అని ఆలోచించానని ఆమె చెప్పింది.

బిలేటరల్ మాక్రోస్టోమియా (చంటిబిడ్డకు వింత పరిస్థితి) అంటే ఏమిటి? 
చిన్నారి ఆయ్లా ఎదుర్కొంటున్న అరుదైన స్థితిని మాక్రోస్టోమియా అని పిలుస్తున్నారు. ఇది శారీరకపరమైన అసాధారణ లక్షణం. ఈ లక్షణానికి గురైన వారి ముఖం చీలిపోయి ఉంటుంది. ఈ చీలికలు సాధారణంగా రోగి కుడి చెంప వైపు కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి మగవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వికీపీడియా ప్రకారం మాక్రోస్టోమియా అనేది అత్యంత అరుదైన కండిషన్. లక్షా 50 వేల మంది నుంచి 3 లక్షల మందిలో ఒకరికి ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. 

 

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి2022-05-30  International Desk