collapse
...
Home / ఆరోగ్యం / మహిళల ఆరోగ్యం / మ‌హిళ‌ల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిందే... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Tel...

మ‌హిళ‌ల ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిందే...

2022-05-29  International Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

womenhealthweekphoto
 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక్క మ‌హిళా దినోత్స‌వ‌మే కాదు వారి ఆరోగ్యం కోసం అంతర్జాతీయ మ‌హిళ‌ల ఆరోగ్య దినోత్సవం కూడా ఉంద‌ని కొంద‌రికే తెలుసు.  ఈ  అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం ప్ర‌తి ఏటా    మే 28న జ‌రుపుకుంటారు. ఈ రోజున మ‌హిళ‌ల‌ లైంగిక.  పునరుత్పత్తి ఆరోగ్యంతోపాటు వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌పైనా, అలాగే మహిళలు అందుకోవాల్సిన‌ హక్కుల పైనా  దృష్టిని ప్ర‌భుత్వాలు కేంద్రీక‌రించేలా కార్యాచ‌ర‌ణ రూపొందుతుంది. 
 1987లో  కోస్టా రికాలో ఉమెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్ ఫర్ రిప్రొడక్టివ్ రైట్స్ సంస్ధ సభ్యుల క‌లుసుకున్న సంద‌ర్భంగా ఈ రోజు ను ప్ర‌పంచ మ‌హిళా ఆరోగ్య దినోత్స‌వంగా జ‌రుపుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌కు ఏక‌గ్రీవ ఆమోదం ల‌భించింది. దీంతో మొదటిసారిగా ఈ దినోత్స‌వం జ‌రుపుకుంటూ వ‌స్తున్నారు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళామ‌ణులు.  ఏటా జరుపుకుంటాటున్న ఈ అంత‌ర్జాతీయ మ‌హిళాఆరోగ్య దినోత్స‌వాన్ని  దక్షిణాఫ్రికా ప్రభుత్వం కూడా   గుర్తించి, అధికారికంగా జ‌రుపుతుండ‌టం గ‌మ‌నార్హం.   
ప్రతి సంవత్సరం, మే 28ని మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవంగా గుర్తించడం జరుగుతుంది. మహిళల ఆరోగ్యం మరియు మొత్తం శ్రేయస్సుకు సంబంధించిన సమస్యలపై దృష్టిని ఆకర్షించడం ఈ రోజు లక్ష్యం. మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం అని కూడా పిలుస్తారు మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు ఆరోగ్య సమూహాలచే జరుపుకుంటారు. 
ఈ రోజున  మహిళలకు వారికి ఉన్న‌ హక్కుల గురించి అవగాహన కల్పించడంతో పాటు మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వివ‌రాల‌ను కూడామ‌హిళా సంఘాలు నిర్వ‌హిస్తాయి. ఇందుకోసం ప్ర‌పంచ వ్యప్తంగా ఉన్న మ‌హిళ‌ల‌ను ఉత్తేజ ప‌రిచే లక్ష్యం గా  లాటిన్ అమెరికన్ & కరీబియన్ ఉమెన్స్ హెల్త్ నెట్‌వర్క్ (LACWHN) లో పాటు ఉమెన్స్ గ్లోబల్ నెట్‌వర్క్ ఫర్ రిప్రొడక్టివ్ రైట్స్ (WGNRR) అవిశ్రాంతంగా ప్ర‌చారాల‌ను నిర్వ‌హిస్తున్నాయి.  వివిధ దేశాల‌లోని ప‌లు మ‌హిళా సంఘాల‌ను ఇవి సమన్వయం చేసుకుని పని చేస్తాయి. 
ఇక అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవాన్ని పాటించడం యొక్క ప్రధాన లక్ష్యాలలో మహిళల ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా పార్లమెంటేరియన్లు,  ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేయడం. మ‌హిళల హక్కులతో పాటు వారి లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహన పెంచడం ద్వారా శిశు హ‌త్య‌లు నివారించ‌డంతో పాటు మ‌హిళ‌ల ఆరోగ్యం కాపాడే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌ద‌రు సంస్ధ‌ల ప్ర‌తినిధులు ఈ సంద‌ర్భంగా మీడియాకు చెప్పారు. 
కోవిడ్‌-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి  మహిళలు ఆరోగ్య సంరక్షణ,  హక్కులను తగ్గించడం   మొదలైన వాటికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొన్నారని, అలాగే గ‌త రెండు ఏళ్లుగా ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హిళ‌ల‌పై గృహ హింస పెరిగింద‌న్నారు. అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా వీటిని త‌గ్గించేలా ప్ర‌భుత్వాలు దృష్టి సారించేలా చేస్తామ‌న్నారు. 


 ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోఅనేక‌ సంక్షోభాలు , అనిశ్చితిలు నెల‌కొన్న నేప‌థ్యంలొ   ఈ సంవత్సరం థీమ్  గా  'రెసిస్ట్ అండ్ పెర్సిస్ట్ ని తీసుకున్న‌ట్టు వివ‌రించారు. ప్ర‌భుత్వాల‌లో మ‌హిళా స‌మ‌స్య‌ల‌ప‌ట్ల జ‌వాబుదారి త‌నం పెంచేందుకు  కాల్ టు యాక్షన్ ప్ర‌క్రియ ఆరంభించాల‌ని ఈ అంత‌ర్జాతీయ మ‌హిళా సంస్ధ‌లు సూచిస్తున్నాయి.  స్త్రీల సంపూర్ణ శ్రేయస్సు కోరుకోవ‌టం ద్వారానే మాన‌వాళి మ‌నుగ‌డ ఉంటుంద‌ని, మ‌హిళ‌ల ఆరోగ్యం కాపాడ‌టం ద్వారానే అది సాధ్య‌మ‌ని ఈ సంస్ధ‌ల ప్ర‌తినిధులు చెప్పారు.  . 

ఒక  మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసేలా వారు తమ ఆహారంలో అన్ని రకాల పోషకాలను ఉంచుకోవాల‌ని  ప్రతి స్త్రీ తప్పనిసరిగా తీసుకోవలసిన 5 ముఖ్యమైన విటమిన్లపై పూర్తి అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా వైద్యులు చెపుతున్నారు.   

విట‌మిన్ బి &డి 
అమ్మాయిలు యుక్తవయస్సు ఆరంభ‌మైన నాటి నుంచి 50 సంవత్సరాల వయస్సు వ‌చ్చే వ‌ర‌కు వారి ఆహార నియ‌మాల‌లో  అనేక పోషకాలలేమి ఉంద‌ని , ఆహార నిర్వ‌హ‌ణ‌ లోపభూయిష్టంగా ఉండ‌మే కార‌ణ‌మ‌ని అనేక వైద్య నివేదిక‌లు చెపుతున్నాయి. ప్ర‌ధానంగామ‌హిళ‌లో విటమిన్ బి6 మరియు విటమిన్ డి  లోపం అనేక స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంద‌ని, ముఖ్యంగా  గర్భిణీ స్త్రీలలో , తల్లిపాలు  లేమి కనిపిస్తుందని ఇది భ‌విష్య త‌రంపై ప‌డుతుంద‌ని, అనారోగ్యానికి దారి తీస్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.. ఈ రెండు రకాల విటమిన్లను ఆహారంలో చేర్చుకోవడం చాలా ముఖ్యమ‌ని, సంబంధిత ఆహార‌ప‌దార్ధాల‌ను తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. 


అయోడిన్   
 సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన 2012 సర్వేలో, 20 నుండి 39 సంవత్సరాల వయస్సు గల చాలా మంది స్త్రీలలో అయోడిన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా గ‌ర్భిణీల‌లో  పిండం అభివృద్ధికి అయోడిన్ చాలా ముఖ్యం. ఉప్పులో అయోడిన్ ఆ లోపాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేయాలి లేకుంటే .ఇది అనేక వ్యాధులకు కూడా కారణం అవుతుంది. 

ఫోలేట్ 
విటమిన్ B9ని ఫోలేట్ అని పిలుస్తారు.  ఆకుకూరలు  సహజ ఫోలేట్ యొక్క అద్భుతాల‌కు మూలంగా పరిగణించబడతాయి. గర్భధారణ సమయంలో పిండం మెదడు అభివృద్ధికి ఈ విటమిన్ అవసరం, అలాగే శరీరంలో ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది,  జీర్ణక్రియలో  ప్రోటీన్ల త‌యారీకి కూడా స‌హ‌క‌రిస్తుంది.   

ఐరన్ 
 రోగనిరోధక పనితీరుకు శరీరంలో సరైన మొత్తంలో ఇనుము అవసరం. ఐరన్ బచ్చలికూర మరియు డ్రై ఫ్రూట్స్‌లో సమృద్ధిగా లభిస్తుంది. 


విటమిన్ సి 
 విటమిన్ సి, నెక్టరైన్ విటమిన్‌గా పరిగణించబడుతుంది, ఇది ఇన్‌ఫెక్షన్ నుండి దూరంగా ఉండటమే కాకుండా జుట్టు, చర్మం మరియు కళ్ళని ఆరోగ్యంగా ఉంచుతుంది. నారింజ, నిమ్మ  పండ్లు ల‌లో చాలా సులభంగా లభిస్తుంది. 

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి 



2022-05-29  International Desk