collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / తెల్లచీర కట్టుతో చంపేస్తోన్న దీపికా సోయగాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Te...

తెల్లచీర కట్టుతో చంపేస్తోన్న దీపికా సోయగాలు

2022-05-30  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

deepika 1-5
 

 
ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ వెస్టివల్ విజయవంతంగా ముగిసింది. బాలీవుడ్ , హాలీవుడ్ సెలబ్రిటీల సందడితో ఈ ఏడు రెడ్ కార్పెట్‌కు మరింత వన్నె వచ్చి చేరింది. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం బాలీవుడ్ నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు కేన్స్‌ రెడ్ కార్పెట్ పైన తమ అందాలను ఒలకబోశారు. ఫ్రెంచ్ రివేరా నగర వీధులకు రంగులను అద్దారు. రెడ్ కార్పెట్ లుక్స్‌తో ఫోటో గ్రామఫర్లకు ఫోజులు ఇచ్చి ఫ్యాషన్ ప్రియులను మెస్మరైజ్ చేశారు.దీపికా పదుకొణె, ఐశ్వర్యా రాయ్, తమన్నా భాటియా, పూజా హెగ్దె, హీనా ఖాన్, ఊర్వశి రౌతెల్లా, హెల్లీ షాహ్, హీనా ఖాన్, నవాజుద్దీన్ సిద్దికి, మాధవన్, రెహమాన్‌లతో పాటి మరింత మంది ఓ మెరుపు మెరిశారు. ఓ వైపు దేశీయ దుస్తులను ధరించి భారతీయ సాంప్రదాయ విశిష్టతను విదేశీయులకు చూపిస్తూనే మరో వైపు ఇంటర్నేషనల్ బ్రాండ్ దుస్తులను ధరించి అందరినీ ఫిదా చేశారు బాలీవుడ్ బ్యూటీలు. 
 
చివరి రోజు చీరకట్టుతో చంపేసింది: 

deepika 3-3
 

 
తాజాగా 75 వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపు రోజు బాలీవుడ్ బ్యూటీ, ఫ్యాషన్ దివా, ఫిల్మ్ ఫెస్టివల్ జ్యూరీ సభ్యురాలు దీపికా పదుకొణె అదరిపోయే చీరకట్టుతో ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించింది. అబు జానీ సందీప్ ఖోస్లా రూపొందించిన అత్యద్భుతమైన ఐవొరీ చీరను కట్టుకుని తన అందాలను రెట్టింపు చేసుకుంది. 
పెర్ల్ కాలర్, బస్టియర్ బ్లౌజ్‌కు జోడీగా ఐవొరీ ఫ్యూజన్ చీరను అందంగా కట్టుకుని బోల్డ్ మేకప్ తో మినిమల్ ఆక్సెసరీస్‌తో అందరిని ఫిదా చేసింది దీపికా. 
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఈ ఏడు జ్యూరీ సభ్యురాలిగా ఉన్న ఈ బ్యూటీ తన చీరకట్టు అందాలతో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. చివరి రోజు దీపిక ఫ్యాషన్ లుక్‌ను చూసినవారంతా ఆమెకు వందకు వంద మార్కులు వేశారు. ఈ ఐవొరీ చీరకట్టుతో చేసిన ఫోటో షూట్ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది దిపికా. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె లుక్ ను చూసిన సెలబ్రిటీలు క్రేజీ కామెంట్లు చేశారు. 
 
పెర్ల్స్, క్రిస్టల్స్‌తో డిజైన్ చేసిన బస్టియర్ బ్లౌజ్‌: 


deepika 4-3
 

 
అత్యద్భుతమైన డిజైన్ డీటైల్స్‌తో ఈ ఐవొరీ చీరను డిజైన్ చేశారు డిజైనర్. అబు జానీ సందీప్ ఖోస్లా ఈ చీరకు ఫ్లోర్ స్వీపింక్ ట్రయల్, డ్రమాటిక్ ప్లీటెడ్ రఫల్స్‌ ను బార్డర్లకు జోడించారు. ఈ ఆరు గజాల చీరను అందంగా ఫిగర్ హగ్గింగ్ స్టైల్‌లో కట్టుకుని స్వెల్ట్ ఫ్రేమ్‌కు ప్రాధాన్యతను ఇచ్చింది దీపికా పదుకొణె. 
ఈ శిల్క్ శారీకి జోడీగా పెర్ల్ కాలర్, స్టేట్‌మెంట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీతో పెర్ల్స్, క్రిస్టల్స్‌తో డిజైన్ చేసిన బస్టియర్ బ్లౌజ్‌ను వేసుకుంది. 
 
ఆకర్షణగా బంగారు జుంకీలు: 

deepika 2-2
 

 
ఐవొరీ శారీ ప్రత్యేకంగా కనిపించేందుకు దీపికా కేవలం కుందన్‌లతో అలంకరించిన బంగారు జుంకీలను తన చెవులకు పెట్టుకుంది. గ్లామరస్ లుక్స్ కోసం ఈ తార తన కను రెప్పలకు సబ్టిల్ స్మోకీ ఐ ష్యాడో, వింగెడ్ ఐ లైనర్, హెవీ మస్కరా దిద్దుకుంది, పెదాలకు గ్లాసీ మావీ లిప్ షేడ్ పెట్టుకుని మెరిసేటి ఛర్మంతో తన కురులను లూజుగా వదులుకుని అదరగొట్టింది. 
 
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 2022-05-30  Lifestyle Desk