collapse
...
Home / అంతర్జాతీయం / టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కి కళ్ళు తిరిగే నెలవారీ వేతనం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | N...

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కి కళ్ళు తిరిగే నెలవారీ వేతనం

2022-05-30  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

elon musk

స్పేస్ ఎక్స్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కుబేరుడంటే ఆశ్చర్యం లేదు.. ప్రపంచంలోనే రిచెస్ట్ మ్యాన్ గా ఫార్చ్యూన్ జాబితాకెక్కిన ఈయన గత ఏడాదికి గాను టాప్ ధనికుడిగా పేరుపొందాడని 'ఫార్చ్యూన్-500' పేర్కొంది. ఈయన దాదాపు 23.5 బిలియన్ డాలర్ల (సుమారు 1,82,576 కోట్లు) వేతనం అందుకుంటున్నాడని.. ముఖ్యంగా 2018 లో ఓ సంస్థకు టెస్లా స్టాక్ షేర్లను అమ్మిన తరువాత ఆయనకు డాలర్లకు డాలర్లే వెల్లువెత్తాయని వెల్లడించింది. మరే ఇతర సీఈఓలు ఇంత భారీ వేతనం అందుకోలేదట.. ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఇంకా నలుగుతోంది. ఈయన ఇటీవలే ఈ సంస్థతో డీల్ కుదుర్చుకున్నాడు గానీ.. కొత్తగా కొన్ని సందేహాలు లేవనెత్తడంతో అది అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇక కుబేరుల్లో రెండో స్థానాన్ని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ వహిస్తున్నాడు. ఈయనకు సుమారు 770.5 మిలియన్ల వేతనం.. లభిస్తుండగా .. ఏడో స్థానంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉన్నారు. 2021 సంవత్సరంలోనే కుక్ కి 770.5 మిలియన్ డాలర్ల వేతనం కాగా 1.7 బిలియన్ డాలర్ల విలువైన షేర్లు కూడా ఈయన పేరిట ఉన్నాయట. ఆయన హయాంలో యాపిల్ మార్కెట్ వ్యాల్యూ 2.2 ట్రిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇక నువిడియా అధిపతి జెన్సెన్ హువాంగ్ 561 మిలియన్ డాలర్ల పే చెక్ అందుకుంటున్నాడని, నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్ గత ఏడాది 453.5 మిలియన్ డాలర్ల వేతనం తీసుకున్నాడని ఫార్చ్యూన్-500 పేర్కొంది. కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్న తమ కంపెనికి లాభాలు తెఛ్చిపెట్టేందుకు ఆయన కొత్తగా పలు చర్యలు ప్రకటించాడు. తమ ఇతర ప్రత్యర్థి సంస్థలతో పోలిస్తే .. అకౌంట్ షేరింగ్ వంటివాటి విషయంలో రీడ్.. కొన్ని మార్పులు చేశాడని తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి కొన్ని పత్రికల్లో వఛ్చిన వార్తలను ఈ సంస్థ అధికార ప్రతినిధి ఖండించారు. తమ స్టేట్ మెంట్ ప్రకారం గత ఏడాది రీడ్ .. 40.8 మిలియన్ డాలర్లని, ఇందులో ఆరున్నర లక్షల డాలర్ల నగదు, 39.7 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఉన్నాయని ఆయన వివరించాడు. 

సత్య నాదెళ్ల వేతనం ఎంత అంటే ..? 

ఇక ఫార్చ్యూన్ లిస్టులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఏడో స్థానంలో ఉన్నారు. గత ఏడాది ఆయన 309.4 మిలియన్ డాలర్ల వేతనం అందుకున్నారని.. సీఈఓ గా ఆయనకు ఎదురులేదని వెల్లడైంది. వరుసగా ఆరేళ్ళ పాటు ఆయన అప్రతిహతంగా ముందుకు సాగుతున్నారు. 2017 నుంచి ఆయన తన సంస్థ బాస్ గా దేశ, విదేశాల్లో అత్యంత ప్రముఖ స్థానం సంపాదించుకున్నారు.  2019 లో ఆయన ఆదాయం 42.9 మిలియన్ డాలర్లని తెలియవచ్చింది. టెక్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఈఓ ఎవరంటే ఆయన పేరే చెబుతారు. 2014 లో తమ సంస్థకు అధిపతి అయినప్పటినుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.. ఈ ఏడాది మార్చి నాటికి మైక్రోసాఫ్ట్ సంస్థకు 2.26 ట్రిలియన్ డాలర్ల ఆదాయం ఉందట. ఇక  ఎకనామిక్ పాలసీ ఇన్స్ టి ట్యూట్ నివేదిక అంచనా ప్రకారం 2020 నాటితో పోలిస్తే ఓ సగటు వర్కర్ వేతనం కన్నా ఓ సగటు బడా కంపెనీ సీఈఓ శాలరీ 351 రెట్లు ఎక్కువగా ఉంటుందట.. సుమారు 280 మంది సీఈఓల వేతనాలను ఫార్చ్యూన్-500 మదింపు చేసింది. 2020తో పోలిస్తే 2021లో వీరు దాదాపు  15.9 మిలియన్ డాలర్ల వేతనం (అటు..ఇటుగా) ఎక్కువగా అందుకున్నట్టు వెల్లడవుతోంది. ఇది సుమారు 30 శాతం ఎక్కువట.. ఇలా తమ తమ నైపుణ్యం, చాతుర్యంతో వీరంతా తమ సంస్థల ఆదాయాన్ని .... తమ వేతనాలను  పెంచుకుంటున్నారని ఫార్చ్యూన్ వివరించింది. ప్రపంచ కుబేరుల్లో ఎవరికివారు తమ సామర్త్యాన్ని నిరూపించుకుంటున్నారని పేర్కొంది. 

 

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 2022-05-30  News Desk