collapse
...
Home / చదువు / సివిల్స్‌లో మ‌హిళ‌లు అద‌ర‌గొట్టారు..ఎవ‌రీ శృతి శ‌ర్మ‌? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

సివిల్స్‌లో మ‌హిళ‌లు అద‌ర‌గొట్టారు..ఎవ‌రీ శృతి శ‌ర్మ‌?

2022-05-30  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

topper
 

సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రతి సంవత్సరం లక్షల మంది అభ్యర్థులు ఐపిఎస్‌- ఐఏఎస్‌ అధికారి కావాలని ఆశపడుతుంటారు.  దేశంలోని అత్యంత సవాలుతో కూడిన పోటీ పరీక్షలలో ఒకటిగా పరిగణించే  సివిల్స్ 2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోవారం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్‌కు యూపీఎస్‌సీ ఎంపిక చేసిన మొత్తం 685 మందిలో   తొలి నాలుగు స్థానాల్లో అమ్మాయిలే నిలవ‌టం విశేషం. ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌కి  చెందిన‌. శృతి శర్మ ఆల్‌ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకోగా వ‌రుస‌గా అంకిత అగర్వాల్.. రెండో ర్యాంక్, గామిని సింగ్మా.. మూడో ర్యాంక్, ఐశ్వర్య వర్మ.. నాలుగో ర్యాంక్ సాధించారు.  

సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష, 2021 ఫలితాలు మార్చి 17న ప్రకటించబడ‌గా ...  మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూ రౌండ్ (వ్యక్తిత్వ పరీక్ష)  ఏప్రిల్ 5 నుండి మే 26, 2022 వరకు జరిగింది.  . దాదాపు 1,800 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ రౌండ్‌కు హాజ‌రు కాగా   యుపిఎస్‌సి   తుది ఫలితంప్రిలిమ్స్, మెయిన్ ఇంటర్వ్యూ రౌండ్ల తర్వాత  ప్రచురించింది.   యుపిఎస్‌సి  సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2021 రిక్రూట్‌మెంట్ ద్వారా 712 సివిల్ సర్వెంట్ల పోస్టులు భర్తీ  చేయడానికి ఉద్దేశించ‌గా 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీటిలో 22 బెంచ్‌మార్క్  విక‌లాంగుల‌ కోసం రిజర్వ్ చేయబడ్డాయి. అలాగే నియామకానికి సిఫార్సు చేయబడిన 685 మంది అభ్యర్థులలో 244 మంది జనరల్ కేటగిరీ, 73 మంది ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు, 203 మంది ఇతర వెనుకబడిన తరగతులకు చెందినవారు, 105 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు కాగా 60 మంది షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు ఉన్నారు. 
వీరిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్  , ఇండియన్ పోలీస్ సర్వీసెస్  , ఇండియన్ ఫారిన్ సర్వీసెస్  , రైల్వే గ్రూప్ A (ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్), ఇండియన్ పోస్టల్ సర్వీసెస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ ట్రేడ్ సర్వీసెస్,  ఇతర సేవలు కోసం వినియోగిస్తారు.   పోస్టుల వారీగా చూస్తే.. ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు.

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ముందు వరుసలో నిలిచారు. ఇందులో యశ్వంత్‌ కుమార్‌ రెడ్డికి 15వ ర్యాంకు దక్కింది. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌ కుమార్‌ రెడ్డి (69), ఆకునూరి నరేశ్‌ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్‌.కమలేశ్వర రావు (297), విద్యామరి శ్రీధర్‌ (336), దిబ్బడ ఎస్వీ అశోక్‌ (350), గుగులావత్‌ శరత్‌ నాయక్‌ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్‌ (564), బిడ్డి అఖిల్‌ (566), రంజిత్‌ కుమార్‌ (574), పాండు విల్సన్‌ (602), బాణావత్‌ అరవింద్‌ (623), బచ్చు స్మరణ్‌రాజ్‌ (676) ర్యాంకులు దక్కించుకున్నారు.

ఎవ‌రీ శృతి శ‌ర్మ‌
  ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన శృతి శర్మ  ఢిల్లీ యూనివర్సిటీ సార‌ధ్యంలో న‌డుస్తున్నసెయింట్  స్టీఫెన్స్ కాలేజ్ నుంచి పట్టభద్రులయ్యారు. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ లో పోస్టు గ్రాడ్యుయేషన్ (పిజీ) పూర్తి చేశారు.   జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA)లో సివిల్ సర్వీసెస్ పరీక్షకుచాలా కాలంగా  త‌ర్ఫీదు తీసుకున్నారు.. 

సివిల్స్‌ టాపర్‌ నిలిచిన శృతి శర్మ మీడియాలో మాట్లాడుతూ.. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్  లో చేరి దేశానికి సేవ చేయాలని న‌మ్మ‌క‌మే ఇంత‌వ‌ర‌కు న‌డిపించింద‌న్నారు. యూపీఎస్‌సీ పరీక్షలో అర్హత సాధిస్తానని తనకు నమ్మకం ఉందని..  ఏకంగా అగ్రస్థానంలో నిల‌వ‌ట‌మే త‌న‌ని  ఆశ్చర్యానికి గురి చేసింద‌ని ఆమె  చెప్పారు. 

 2022-05-30  News Desk