collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / లేత గోధుమ రంగు చీరలో రకుల్ లేలేత అందాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

లేత గోధుమ రంగు చీరలో రకుల్ లేలేత అందాలు

2022-05-31  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

rakul 1-1
 

 
రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యాషన్ గేమ్‌ను ఎప్పుడూ అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తుంటుంది. మూవీ ప్రమోషన్స్ అయినా, బాలీవుడ్ పార్టీలైనా, హాలిడేస్ అయినా, క్యాజువల్ అయినా, తన అవుట్‌ఫిట్స్‌తో అందరి దృష్టిని తనవైపు ఏ విధంగా తిప్పుకోవాలో ఈ నటికి బాగా తెలుసు. తాజాగా ఈ సుందరి తన ఫ్రెండ్ చెల్లెలి రిసెప్షన్ కోసం ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా క్లాతింగ్ లేబుల్ నుంచి మిరుమిట్లు గొలిపే చీరను ఎన్నుకుని తన గ్లామరస్ లుక్స్‌తో అందరిని మంత్రముగ్ధులను చేసింది. ప్రస్తుతం ఈ శారీ పిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి చీరకట్టుకుని చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. 
 
చీరకట్టుతో చంపేస్తున్న రకులు :  

rakul 2-2
 

మోడ్రన్ దుస్తులనే కాదు అవసరాన్ని బట్టి ఎత్నిక్ వేర్స్ ధరించి తన ఫ్యాషన్ స్టైల్స్ ను సామాజిక మాధ్యమాల ద్వారా తన ఫ్యాన్స్‌కు పరిచయం చేస్తుంటుంది రకుల్ ప్రీత్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియాలోనూ చాలా మంది తారల లాగే యాక్టివ్‌గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను, మూవీ ప్రమోషన్స్‌ను , ఫోటో షూట్ ఫోటోలను ఈ బ్యూటీ ఇన్‌స్టా వేధికగా తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. అదే విధంగా ఓ ఫంక్షన్ కోసం ధరించిన చీరతోనూ అదరిపోయే ఫోటోలను దిగి ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. బీడ్ వర్క్, బార్డర్లలో వెండి మెరుపుల అలంకరణలతో ఉన్న సొగసైన లేత గోధుమ రంగు చీరలో తన సోయగాలను పరిచింది రకుల్. ఈ బీగీ చీరకు జోడీగా ప్లంగింగ్ నెక్‌లైన్ బ్యాక్‌లెస్ స్ట్రాపీ సాటిన బ్లౌజ్ ను వేసుకుంది. ఈ చీరకు కాంట్రాస్ట్‌గా చెవులను ఆకుపచ్చని సాంప్రదాయ జుంకాలను అలంకరించకుంది. కనులకు మెరిసేటి ఐ లిడ్స్, సబ్టిల్ కోహెల్డ్ ఐస్, పెదాలకు న్యూడ్ లిప్ టింట్ పెట్టుకుని డివీ మేకప్‌తో ఎంతో గ్లామరస్‌గా కనిపించింది రకుల్. 
 
రాయల్ బ్లూ కలర్ కుర్తా సెట్‌ అదుర్స్ :   

rakul 4
 

రకుల్ ప్రీత్ ఎత్నిక్ వార్డ్‌రోబ్‌ ఎప్పుడూ ప్రశంసలను అందుకుంటుంది. ఈ నటి ఎప్పుడూ అధునాతన దుస్తులను ధరించి నిజమైన ఫ్యాషన్‌వాధిగా కనిపిస్తుంటుంది. బీ టౌన్‌లో జిగిరిన ఈద్ సెలబ్రేషన్స్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ లూజ్ స్లీవ్స్ తో వచ్చిన రాయల్ బ్లూ కలర్ కుర్తాను వేసుకుంది. ఈ కుర్తాకు జోడీగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న ఫ్లేర్డ్ ప్యాంట్స్ ధరించింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా రకుల్ చెవులకు ట్రెడిషనల్ స్టేట్‌మెంట్ ఇయర్‌రింగ్స్‌ను పెట్టుకుంది. తన సిల్కీ కురులను లూజ్‌గా వదిలి, న్యూడ్ మేకప్‌తో పెదాలకు గ్లాసీ లిప్ కలర్ వేసుకుని తన అందంతో అభిమానులను అలరించింది.  
 
వైట్ అనార్కలీ సూట్‌లో వావ్‌ :  

rakul 3
 

మరోసారి రకుల్ తన అభిమానులకు సోషల్ మీడియాలో ఎత్నిక్ వేర్‌ను ధరించి ఈద్ శుభాకాంక్షలు తెలిపి మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన వైట్ అనార్కలీ అవుట్‌ఫిట్‌ను డిజైనర్ బ్రాండ్ నాజ్ ఫాతిమా చరనియా నుంచి సేకరించింది. సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీ, లేస్‌వర్క్‌తో విశాలమైన పట్టీ అంచుతో వచ్చిన ఈ అనార్కలీని రకుల్ ధరించి దానికి జోడీగా మోటిఫ్స్ ఎంబ్రాయిడరీతో ఉన్న వైట్ షిఫాన్ దుపట్టాను వేసుకుంది. చెవులకు డాంగ్లర్ ఇయర్‌రింగ్స్ పెట్టుకుని డివీ మేకప్‌తో పెదాలకు గ్లాసీ బ్రౌన్ కలర్ లిప్ షేడ్ పెట్టుకుని అదరగొట్టింది. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది. 
 
ఎరుపు రంగు మిని డ్రెస్ అదుర్స్ :  

rakul 5
 

సాంప్రదాయ దుస్తుల్లోనే కాదు వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్‌లోనూ తన అందాలను ఆరబోస్తుంటుంది ఈ చిన్నది. ఇటీవల బీ టౌన్ లో జరిగిన బిగ్ ఫ్యాట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసం రకుల్ యూత్ గుండెల్లో మంట పుట్టించే వెల్వెట్ మిని డ్రెస్‌ను వేసుకుని అందరి చూపును తనవైపు దతిప్పుకుంది. ప్లంగింగ్ నెక్‌లైన్, నడుము వద్ద వ్రాప్ డీటైల్స్ తో డ్రమాటిక్ హెమ్‌లైన్ కలిగిన ఫుల్ స్లీవ్డ్ బాడీకాన్ డ్రెస్‌లో మిర్చీలా హాట్ గా కనిపించి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. ఈ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను క్లాతింగ్ బ్రాండ్ అలెగ్జాండర్ వౌతియర్ నుంచి ఎంపిక చేసుకుంది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా స్టడ్ ఇయర్‌రింగ్స్, పాదాలకు సిల్వర్ హీల్స్ వేసుకుని, న్యూడ్ మేకప్‌తో సాఫ్ట్ ఐ మేకప్‌తో కేకపుట్టించింది. 
 
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 

 
 
 
 


2022-05-31  Lifestyle Desk