collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / పొట్టి గౌనులో మెరిసిపోతున్న పొడవుకాళ్ల సుందరి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for...

పొట్టి గౌనులో మెరిసిపోతున్న పొడవుకాళ్ల సుందరి

2022-05-31  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

pooja 1-1
మెరుపుల అవుట్‌ఫిట్స్ అంటే బాలీవుడ్ మగువలకు మహా ఇష్టం. కారణం దొరకాలే కానీ తమ వార్డ్‌రోడ్‌లో కొలువుదీరిని అందమైన మెరుపుల గౌన్లను ధరించి తమ గ్లామరస్ లుక్స్‌తో తళుక్కుమని ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తుంటారు. డిన్నర్, డేట్‌ నైట్స్, పార్టీస్, ఫ్యాషన్ షోలతో పాటు వెడ్డింగ్స్‌లోనూ అద్భుతమైన మెరిసేటి అవుట్‌ఫిట్స్‌ను ధరించి బాలీవుడ్ ముద్దుగుమ్మలు తమ ఫ్యాన్స్‌ను అలరిస్తుంటారు. అందుకు నటి పూజా హెగ్దె కూడా మినహాయింపు కాదు. తాజాగా అలాంటి ఓ అద్భుతమైన అవుట్‌ఫిట్‌ను ధరించి బుట్టబొమ్మ పూజా హెగ్దె నెట్టింట్లో సందడి చేస్తోంది. మెరుపుల మినీ డ్రెస్ వేసుకుని తన అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేస్తోంది. 

 
మెరుపుల డ్రెస్ తో మతులుపోగొడుతున్న పూజా: 

opooja 4
 

బంగారపు వర్ణంలో ఉన్న మినీ డ్రెస్ లో పూజా అందాలు మిరుమిట్లు గొలిపాయి. డిజైనర్ కౌచర్ లేబుల్ మోనిషా జైసింగ్ నుంచి ఈ అందమైన అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుంది పూజా. ప్లంగింగ్ నెక్‌లైన్, అసమాన్ హెమ్‌లైన్ కలిగిన ఈ స్ట్రాపీ స్పగెట్టీ మిని డ్రెస్ లో పూజా చాలా అందంగా కనిపించింది. ఈ అవుట్‌పిట్‌కు తగ్గట్లుగా ఆక్సెసరీస్‌ను ఎన్నుకుంది ఈ బ్యూటీ. చేతికి మెటాలిక్ బ్రేస్‌లెట్ పెట్టుకుని పాదాలకు గోల్డెన్ స్ట్రాపీ హీల్స్ వేసుకుంది. తన కురులు అలలాగా తేలే విధంగా స్టైల్ చేసుకుని లూజ్ గా విడిచింది. డివీ మేకప్‌తో కనులకు మెరుపుల ఐ లిడ్స్ పెట్టుకుని పెదాలకు గ్లాసీ న్యూడ్ లిప్ టింట్ అద్దుకుని అదరగొట్టింది పూజా హెగ్దె. బాలీవుడ్ బ్యూటీస్ పరిణీతి చోప్రా, కియారా అద్వానీ, అనన్య పాండే లతో పాటుగా మరికొంత మంది ఇటాంటి మిరుమిట్లు గొలిపే దుస్తులను ధరించి అందరిని మైమరిచేలా చేశారు.  
 
పూజా ఎత్నిక్ లుక్స్ అదుర్స్ : 

pooja 2-2
 

పూజా హెగ్దె ఈ మధ‌యనే దేశీ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఐవొరీ లెహంగా సెట్‌లో తన అందాలను పరిచి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ఈ అద్భుతమైన లెహంగా సెట్‌ను అర్పితా మెహతా డిజైనర్ బ్రాండ్ నుంచి ఎంపిక చేసుకుంది పూజా హెగ్దె. లేత గోధుమ రంగు పూల ఎంబ్రాయిడరీ, సున్నితమైన మిర్రర్ వర్క్‌తో వచ్చిన ఆఫ్‌ వైట్ ఐవొరీ త్రీ పీస్ లెహంగా సెట్‌లో దేవకన్యలా మెరిసింది అందరిని మైమరిచేలా చేసింది. లెహంగాకు జోడీగా పూజా న ప్లంగింగ్ నెక్‌లైన్ షార్ట్ స్లీవ్స్ కలిగిన అదే రంగు ప్యాట్రన్స్‌తో ఉన్న బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ లెహంగా , బ్లౌజ్ మీదుగా అదే రంగులో, అవే ఎంబ్రాయిడరీ కలిగిన బార్డర్లు ఉన్న షిఫాన్ దుపట్టాను వేసుకుంది. ఈ లెహంగా సెట్‌కు తగ్గట్లుగా మెస్సీ పోనీటెయిల్ వేసుకుని డివీ మేకప్‌, కొహెల్ లాడెన్ ఐస్‌, న్యూడ్ గ్లాసీ లిప్ టింట్‌ వేసుకుని తన గ్లామరస్ లుక్‌తో అదరగొట్టింది. 
 
కేన్స్ రెడ్ కార్పెట్‌పై వైట్ గౌనుతో ఫిదా: 

pooja 5-1
 

ఈ ఏడు పూజా హెగ్దే కేన్స్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మొదటిసారిగా రెడ్ కార్పెట్‌పైన సందడి చేసింది. డిజైనర్ మైసన్ గేయన్నా యూనెస్ రూపొందించిన అద్భుతమైన సున్నితమైన స్వీట్‌హార్ట్ నెక్‌లైన్, ఫెదర్ డీటైల్స్ కలిగిన స్ట్రాప్ లెస్ ట్యూబ్ గౌన్‌ను వేసుకుని ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. డ్రమాటిక్ ట్రెయిల్, అద్భుతమైన ఫ్లోర్స్ గలిగిన ఈ ఫ్లోర్ లెన్త్ గౌనులో తన గ్లామరస్ లుక్స్‌తో అందరి చూపును తనవైపు తిప్పుకుంది. తన కురులతో పోనీటెయిల్ వేసుకుని, మినిమల్ జ్యువెల్లరీ, చెవులకు డాంగ్లింగ్ ఇయర్‌ రింగ్స్ పెట్టుకుంది. డివీ మేకప్ లుక్ లో పెదాలకు గ్లాసీ లిప్ టింట్, కనులకు మెరుపు ఐ ష్యాడో వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది ఈ చిన్నది. 
 
 
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 



2022-05-31  Lifestyle Desk