collapse
...
Home / ఆరోగ్యం / మంకీపాక్స్ ను ఎలా తెలుసుకోవాలి? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News...

మంకీపాక్స్ ను ఎలా తెలుసుకోవాలి?

2022-05-31  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

mo

 

మంకీపాక్స్ లో రెండు రకాలున్నాయి. నాలుగు దశలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఈ మంకీపాక్స్ జ్వరం, వొళ్లు నొప్పులు, కాస్త అస్వస్థత, కండరాల నొప్పులతో మొదలవుతుంది. ఈ ప్రారంభ లక్షణాలు ఇన్ ఫ్లుయెంజాను పోలి ఉంటాయి. 
వేగంగా వ్యాప్తి ప్రస్తుతం మంకీపాక్స్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. యూరప్ లోనూ, ఇతర దేశాల్లోనూ ఇప్పటికే 300 మందికి పైగా ఇది సోకినట్టు అనుమానిస్తున్నారు. పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఉష్ణ మండల పరిధిలోకి రాని ప్రాంతాల్లోని 20 దేశాలకు కూడా ఈ వైరల్ ఇన్ ఫెక్షన్ వ్యాపించింది. ఇలా వ్యాప్తి చెందడం ఇదే మొదటిసారి. అక్కడ ఇది తీవ్రంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం… అర్జెంటీనా తర్వాత, ఐర్లాండ్, మెక్సికోలలో మొదటి కేసులు నమోదైనట్టు  తెలిసింది. మనుషుల్లో ఈ మంకీపాక్స్ 1970లో మొదటి కేసులు కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ లో నమోదయ్యాయి. ఇప్పుడు ఇది మధ్య, పశ్చిమ ఆఫ్రికాల్లో వ్యాపిస్తోంది.

ఇన్ ఫ్లుయెంజాతో పోలిక  

మంకీపాక్స్ లక్షణాలు ఇన్ ఫ్లుయెంజాను పోలి ఉంటాయి. ముందు ఎర్రటి దద్దుర్లు కనబడతాయి. అయితే ఇన్ ఫెక్షన్ నుంచి లక్షణాల దశకు మారడానికి మంకీపాక్స్ కు ఏడు నుంచి 14 రోజులు పట్టవచ్చని, ఒక్కోసారి 5 నుంచి 21 రోజులు కూడా పట్టవచ్చని డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిపి) తెలిపింది. గాయాలున్నవారికి, శరీరం నుంచి ద్రవాలు ఊరుతున్న వారికి, దగ్గు--తుమ్ములతో బాధ పడుతున్నవారికి దగ్గరగా ఉన్నా, అలాంటి వారి దుస్తులు వాడినా మంకీపాక్స్ తగలవచ్చు. మంకీపాక్స్ దశల గురించి తెలుసుకుంటే దానిపట్ల జాగ్రత్తగా ఉండవచ్చు. అలా తెలుసుకున్నప్పుడు అనుమానం వస్తే వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవచ్చు.
మంకీపాక్స్ లక్షణాల దశలు ఇలా ఉంటాయి.

ప్రథమ దశ:  

ఒకవేళ ఇన్ ఫెక్ఝన్ వస్తే పైన చెప్పినట్టు మరో దశకు మారడానికి 7--14 రోజులు పట్టవచ్చు. జ్వరం, తలనొప్పి, నీరసం, కాస్త అస్వస్థతగా ఉంటే ప్రథమ దశ అని చెప్పవచ్చు. ఇవి శ్వాస వ్యవస్థతో ముడిపడి ఉంటాయి. ఫ్లూ జ్వరాన్ని పోలి ఉంటాయి.
లింఫ్ గ్రంథుల వాపులు మంకీపాక్స్ ఇన్ ఫెక్ఝన్ కు, స్మాల్ పాక్స్ కు తేడా ఉంది. మంకీపాక్స్ లో  వివిధ పరిణామాలలో లింఫ్ గ్రంథులు ఉబ్బుతాయి… అంటే వాపు కనిపిస్తుంది. వైద్య పరిభాషలో దీన్ని ‘లెంఫా డెనోపతి’ అంటారు. లింఫ్ గ్రంథుల వాపు శరీరంలో చాలా చోట్ల ఉండవచ్చు. లేదా కొన్ని ప్రదేశాల్లో అంటే మెడ, బాహుమూాలాల్లో ఉండవచ్చు.

దద్దుర్లు  

మంకీపాక్స్ రావడానికి మొదటి రెండు దశలు పూర్తయ్యాక అంటే జ్వరం, వంటి నొప్పులు, అలాగే లింఫ్ గ్రంథుల వాపు (లెంఫా డెనోపతి) తర్వాత దద్దుర్లు వస్తాయి. చేతులు, కాళ్లు, ముఖం, నోరు, చివరికి జననాంగాలపై కూడా దద్దుర్లు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గడ్డలు లేదా నొప్పి పుట్టే ఎర్రటి బొబ్బలు ఇక మంకీపాక్స్ చివరి దశ. దద్దుర్లు క్రమంగా గడ్డలుగా లేదా చీముపట్టిన ఎర్రటి బొబ్బలుగా మారుతాయి. ఒక్కోసారి ఇవి ఎత్తుగా ఉంటాయి. దీని తీవ్రత అంటే అస్వస్థత… ఆ మనిషి ఆరోగ్యాన్ని బట్టి, ఇన్ ఫెక్షన్ వైరస్ కేటగిరీని బట్టి (పశ్చిమ ఆఫ్రికా వర్సెస్ మధ్య ఆఫ్రికా వైరస్ జెనెటిక్ గ్రూపులు), బహిర్గతమయ్యే తీరును బట్టి ఉంటుంది.

మంకీపాక్స్ లో రకాలు  

మంకీపాక్స్  లో ప్రధానమైన వైరస్ రకాలు రెండు. అవి – పశ్చిమ ఆఫ్రికా వర్సెస్ మధ్య ఆఫ్రికా వైరస్ జెనెటిక్ గ్రూపులు లేదా క్లాడ్ లు. పశ్చిమ ఆఫ్రికా మంకీపాక్స్ అంత తీవ్రంగా ఉండదు. తక్కువ స్థాయిలో ఉంటుంది. మరణాలు తక్కువ. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం కూడా పరిమితంగానే ఉంటుంది. పశ్చిమ ఆఫ్రికన్ మంకీ పాక్స్ తో పోలిస్తే సెంట్రల్ ఆఫ్రికన్ మంకీపాక్స్ వైరస్ వల్ల వచ్చే ఇన్ ఫెక్షన్లు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇది సోకితే మరణాలు కూడా అధికంగానే ఉంటాయి. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
 

 

మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి   
 2022-05-31  Health Desk