collapse
...
Home / చదువు / క్లోక్‌రూం స్టార్టప్‌.. స్టూడెంట్స్‌ బ్యాగేజీ క అడ్డా! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

క్లోక్‌రూం స్టార్టప్‌.. స్టూడెంట్స్‌ బ్యాగేజీ క అడ్డా!

2022-05-31  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

exam-1

ప్రతి ఏడాది లక్షలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాసేందుకు ఒక  నగరం నుంచి మరో నగరానికి వెళుతుంటారు. అలాంటి సమయంతో తమ వెంట తెచ్చుకునే బ్యాగ్‌ను సురక్షిత ప్రాంతాల్లో ఉంచేందుకు ఎలాంటి వ్యవస్థ ఉండదు. దీంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారు. ఆర్‌ఈఎస్‌ పరీక్ష రాయడానికి సుమారు 18 లక్షల మంది విద్యార్థులు పోటీ పరీక్ష రాశారు. కోవిడ్‌ సమయంలో కాస్తా రద్దీ తగ్గినా ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా పరీక్షలు రాయడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున వస్తారు. అయితే దూర ప్రాంతాలకు చిన్న బ్యాగ్‌తో ప్రయాణించి .. నేరుగా ఎగ్జామినేషన్‌ హాల్‌ వద్ద బ్యాగ్‌ పెడుతామంటే యాజమాన్యం ఒప్పుకోదు. ఒక వేళ పెట్టినా తమ బ్యాగ్‌కు గ్యారంటీ ఉండదు.   

ఇలాంటి  ఇబ్బందుల నుంచి బయటపడేందుకు న్యూఢిల్లీకి చెందిన స్టార్టప్‌ కంపెనీ దీనికి పరిష్కారం చూపిస్తోంది.  లగ్‌స్టో పేరుతో న్యూఢిల్లీకి చెందిన క్లోక్‌రూపం స్టార్టప్‌ను ప్రారంభించింది. ప్రారంభించిన స్వల్పకాలంలోనే మార్కెట్‌ లీడర్‌ అయ్యింది. కాగా ఈ కంపెనీ ఏప్రిల్‌ 2018లో ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది.ఇలా దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ బ్యాగేజీని స్వల్పకాలానికి క్లోక్‌రూంలుగా వినియోగించుకోడానికి పరిష్కారం చూపింది.  లగ్‌స్టోను మనీష్‌ అగర్వాల్‌ సహ వ్యవస్థాపకుడగా సీఈవోగా, విద్యానంద త్రిపాటి సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్‌ ఆపరేషన్‌, అలోక్‌ గోయల్‌ సహ వ్యవస్థాపకుడు ..సీటీఓ, ముఖేష్‌ గోయల్‌ సహ వ్యవస్థాపకుడు సీఎఫ్‌ఓగా వ్యవహరిస్తు తమ వ్యాపారాన్ని అభివృద్ది పథంలో నడుపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే లగ్‌స్టో.. ఇండియా కా క్టోక్‌ రూం పేరుతో మీకు అన్నీ రకాల సేవలందిస్తుంది. దేశంలోని 48 లోకేషన్లలో 200 స్టోర్‌లను ఏర్పాటు చేసింది. ఎగ్జామినేషన్‌ సెంటర్‌ల సమీపంలో క్లోక్‌ రూం సదుపాయాలను అందుబాటులో ఉంచుతోంది. విద్యార్థులు నేరుగా ఎలాంటి చీకూ చింత లేకుండా నిర్భయంగా తమ లగేజీని ఇక్కడ భద్రపరచి పరీక్ష రాయడానికి వెళ్లవచ్చు.   

లగ్‌స్టో విద్యార్థుల ఇబ్బందులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అతి తక్కువ రుసుముతో వారి బ్యాగేజీని భద్రత పరిచే వ్యవస్థను తీసుకు వచ్చింది. ప్రస్తుతం 200 లోకేషన్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంచింది. తమ విద్యార్థులకు అత్యాధునిక క్లోక్‌రూంలను అందుబాటులో ఉంచామని స్వల్పకాలానికి తమ బ్యాగేజీ ఎక్కడ పెట్టాలనే ఇబ్బంది లేకుండా తాము సేవలందిస్తున్నామని లగ్‌స్టో సీఈవో మనీష్‌ అగర్వాల్‌ తెలియజేశారు.   

దీనికి విద్యార్థులు చేయాల్సిందల్లా  లగ్‌స్టో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో తాము తమ బ్యాగేజ్‌ను ఏ లోకేషన్‌లో స్టోర్‌ చేయాలనుకుంటున్నారనే అంశాలు వాటిలో ఫిల్‌ చేయాల్సి ఉంటుంది.  ఏ ఎగ్జామినేషన్‌ సెంటర్‌ లాంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో లగేజ్‌ బుకింగ్‌ అయిన తర్వాత ఈ - మెయిల్‌ ద్వారా కన్ఫర్మ్‌ కూడా పంపిస్తారు.    

పరీక్ష పూర్తయిన తర్వాత మీ బ్యాగేజ్‌ తీసుకోవడానికి ఓటీపీ వెరిఫికేషన్‌ ద్వారా మీ బ్యాగేజీని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. దీంతో పాటు మీ బ్యాగేజీ మొత్తానికి రూ.5,000 వరకు బీమా సౌకర్యం కూడా ఉంటుంది. దీంతో పాటు 24 గంటల పాటు కస్టమర్‌ సర్వీసు అందుబాటులో ఉంటుంది. అర్ధరాత్రి కూడా మీ బ్యాగేజీని తీసుకొనే వెసులు బాటు కల్పించింది. పరీక్షా కేంద్రాలే కాకుండా దేశంలోని అతి పెద్ద విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, బస్సు స్టేషన్లు, మార్కెట్‌ హబ్‌లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అగర్వాల్‌ తెలియజేశారు.    


 

మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 

 2022-05-31  Education Desk