collapse
...
Home / జాతీయం / గ్రాడ్యుయేట్లకు యూకే బంపరాఫర్.. ఉద్యోగం లేకున్నా వీసా.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

గ్రాడ్యుయేట్లకు యూకే బంపరాఫర్.. ఉద్యోగం లేకున్నా వీసా..

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

uk-visa
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గ్రాడ్యువేట్స్​ను ఆకర్షించేందుకు కొత్త వీసా ప్రక్రియను బ్రిటన్​ ప్రభుత్వం ప్రకటించింది. ఈ హెచ్​పీఐ(హై పొటెన్షియల్​ ఇండివిడ్జువల్​) వీసాతో అనేకమంది భారతీయులకు లబ్ధిచేకూరనుంది. ఈ వీసా మార్గం ద్వారా భారతీయ విద్యార్థులు సహా ప్రపంచంలోని టాప్ 50 యూకేయేతర విశ్వవిద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లు ఇప్పుడు బ్రిటన్‌కు వచ్చి పని చేయవచ్చు. హై పొటెన్షియల్ ఇండివిడ్యువల్‌ వీసా ప్రోగ్రామ్ మే 30 నుంచి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తుంది. కొత్త వీసాలో భాగంగా, హై-స్కిల్డ్ ఫారిన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రెండు-మూడు ఏళ్ల పాటు యూకేలో పని చేయడానికి, ఉండటానికి అనుమతిస్తారు. ఈ వీసా కోసం గ్రాడ్యుయేట్లకు ఎలాంటి జాబ్ ఆఫర్ లేదా స్పాన్సర్‌షిప్ అవసరం లేదు. గ్రాడ్యుయేట్ల డిగ్రీ స్థాయిని బట్టి వర్క్ చేసే కాలాన్ని, అలాగే అక్కడ ఉండే కాలాన్ని నిర్ణయిస్తారు. కొత్త వీసా ప్రోగ్రామ్ వల్ల యూకేలోని ఎంప్లాయర్లకు స్పాన్సర్‌షిప్ ఫీజు ఆదా అవుతుంది. ఎందుకంటే వీరు ఎలాంటి స్పాన్సర్‌షిప్ చెల్లించకుండానే హెచ్‌పీఐ వీసా హోల్డర్లను హైర్ చేసుకోగలుగుతారు.

రెండు సంవత్సరాల వర్క్ వీసా..

ఈ మేరకు యూకే ఒక సంయుక్త ప్రకటన చేసింది. భారతీయ సంతతికి చెందిన యూకే కేబినెట్ మంత్రులు రిషి సునక్, ప్రీతి పటేల్ మాట్లాడుతూ.. బ్రెగ్జిట్ అనంతర పాయింట్ల-ఆధారిత విధానంలో కొత్తగా వీసా పొందాలనుకునే వారు.. జాతీయతతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. విజయవంతమైన దరఖాస్తుదారులకు రెండు సంవత్సరాల వర్క్ వీసా ఇవ్వబడుతుంది. పీహెచ్‌డీ ఉన్నవారికి చేతిలో నిర్దిష్ట ఉద్యోగ ఆఫర్ అవసరం లేకున్నా సరే.. మూడేళ్ల వీసా అందిస్తారు. మొత్తం మీద దేశాలతో సంబంధం లేకుండా, విద్యార్థుల ప్రతిభను గుర్తించి, వారికి వీసాలు ఇచ్చి, బ్రిటన్​ అభివృద్ధికి పాటు పడేందుకే ఈ కొత్త వీసాను తీసుకొచ్చినట్టు రిషి సునక్, ప్రీతి పటేల్ వివరించారు.

టాప్​-50 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్లకు మాత్రమే..

"ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభగల విద్యార్థులను ఆకర్షించేందుకు ఈ వీసా ఉపయోగపడుతుంది. రేపటి వ్యాపార ప్రపంచాన్ని నేటి నుంచే నిర్మిద్దాం. ఈ వీసా అవకాశాన్ని మిస్​ చేసుకోకండి," అని సునక్​ పిలుపునిచ్చారు. కొత్త వీసాతో సైన్స్​, ఇంజినీరింగ్​, వైద్య పరిశోధనలకు సంబంధించిన విద్యార్థులకు ప్రోత్సాహం లభించనుంది. బ్రిటన్​ వర్సిటీలను మినహాయించి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్​-50 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్లకు మాత్రమే ఈ వీసా అందిస్తారు. అయితే.. వీసాకు అప్లై చేసుకునే వారికి చెందిన విశ్వవిద్యాలయాలు.. 'క్యూఎస్​', 'టైమ్స్​ హైయర్​ ఎడ్జ్యుకేషన్​', 'అకాడమిక్​ ర్యాంకింగ్​ ఆఫ్​ వరల్డ్​ యూనివర్సిటీ' వంటి సంస్థల టాప్​-50 జాబితాలో కనీసం 2-3 ఏళ్లు లిస్ట్​ అయ్యి ఉండాలి.

కుటుంబ సభ్యులను తీసుకురావడానికి అవకాశం..

కొత్త HPI వీసా మార్గానికి దాదాపు GBP 715 ఖర్చవుతుంది. వారిపై ఆధారపడిన వారిని లేదా సన్నిహిత కుటుంబ సభ్యులను తీసుకురావడానికి సైతం అవకాశం ఉంటుంది. UK హోమ్ ఆఫీస్ ప్రకారం.. ఈ మార్గంలో దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారు కనీసం GBP 1,270 ఫండ్స్‌ను కలిగి ఉండాలి. అర్హత పొందాలంటే, అది యూకేయేతర సంస్థ అయి ఉండాలి. కనీసం రెండు, మూడు ర్యాంకింగ్‌లలో మొదటి 50లో ఉండాలి. వ్యాపారాలు విస్తరించేందుకు వీలుగా వివిధ మార్గాలను సులభతరం చేయడానికి, మెరుగుపరచడానికి కొత్త గ్లోబల్ బిజినెస్ మొబిలిటీ రూట్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించబడింది. ఈ సంవత్సరం తరువాత, స్కేల్-అప్ వీసా మార్గం UKకి ఉద్యోగులను తీసుకురావడానికి వీలు కల్పించడం ద్వారా టాలెంట్ రిక్రూట్‌మెంట్‌లో వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.

 2022-05-31  News Desk