collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

పరమాత్ముని సేవలో ప్రపంచ సుందరి

2022-05-31  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

 

aaaaa-1
 

ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ బాలీవుడ్‌లో తొలిసారిగా సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో తెరంగేట్రం చేయబోతోంది. అక్షయ్ కుమార్ సరసన నటించిన ఈ సినిమా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో హీరో అక్షయ్‌కుమార్ తన సహ నటి మానుషీ చిల్లర్‌తో సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. తాజాగా ఈ సినిమా జోడి వారణాసిలోని గంగా ఘాట్‌కు చేరుకుని శివుని ఆశిస్సులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ సుందరి బ్లష్ పింక్ చికన్‌కారీ సూట్ వేసుకుని ట్రెడిషనల్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. నటి మానుషీ చిల్లర్ వారణాసిలో అక్షయ్‌తో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో చేర్ చేసింది. ఈ ఫోటోల కింద హర హర మహాదేవ్ అని క్యాప్షన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోల్లో మానుషీ చిల్లర్ ఎత్నిక్ లుక్ చూసి ఆమెను ఫ్యాన్స్ పొగడకుండా ఉండలేకపోతున్నారు. 
 
ఎత్నిక్ లుక్‌లో అదరగొట్టిన మానుషీ చిల్లర్ : 

aaaa1-1
 

తెలుపు రంగులో సీక్వి్న్స్ అలంకరణలతో , ఫ్లోరల్ ప్యాట్రన్స కలిగిన చికెన్‌కారీ ఎంబ్రాయిడరీతో వచ్చిన బ్లష్ పింక్ ఎంబ్రాయిడరీ సూట్ సెట్ లో మానుషీ అందరిని మెస్మరైజ్ చేసింది. పొడవాటి స్లీవ్స్ తో , రౌండ్ నెక్ , ఫ్రంట్ స్లిట్ తో వచ్చిన లూజ్ కుర్తాను వేసుకుంది మానుషీ. దీనికి జోడీగా మ్యాచింగ్ పింక్ షేడ్ లో వచ్చిన ప్యాంట్ ను ధరించింది. దీనితో పాటే పింక్ షేడ్ లో సింపుల్ చికన్‌కారీ వర్క్, ప్రింటెడ్ పట్టీ బార్డర్లు కలిగిన ఆర్గాంజా దుపట్టాను వేుకుంది. ఈ ట్రెడిషనల్ లుక్‌ను మానుషీ సింపుల్ జ్యువెల్లరీని, మినిమల్ మేకప్ ను ఎన్నుకుంది. తన కురులను మధ్యపాపిట తీసి స్లీక్ బన్ వేసుకుంది. చెవులకు గోల్డ్ టోన్డ్ పెర్ల్ ఇయర్‌రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ బంగారపు ఉంగరాలు, మెడలో బీడెడ్ నెక్‌లెస్, నుదుటున బొట్టు పెట్టుకుంది. పెదాలకు గ్లాసీ మావీ లిప్ షేడ్, కనులకు మస్కరా, ఐలైనర్ వేసుకుని మెరిసేటి ఛర్మంతో ఎత్నిక్‌ లుక్‌లో అదరగొట్టింది ఈ ప్రపంచ సుందరి
 
దేశీయ లుక్‌లో అందరి మైండ్ బ్లాక్:  

aaaa4
 

మానుషీ చిల్లర్ ఈ మధ్యనే డిజైనర్ రిధి మెహ్రా డిజైనర్ లేబుల్ నుంచి అద్భుతమైన చీరను ఎన్నుకుని ఫోటో షూట్ చేసిన తన ఫ్యాన్స్‌ను ఫిదా చేసేసింది. 
మోడ్రన్ ట్విస్ట్‌తో వచ్చిన ఆల్ వైట్ రఫెల్డ్ చీరను కట్టుకుని దేశీయ లుక్‌లో అందంగా కనిపించింది ఈ సుందరి. ఈ రఫెల్డ్ చీరకు మరింత ఆధునికతను జోడించేందుకు మానుషీ ప్లంగింగ్ నెక్‌లైన్ తో వివిధ అలంకరణలతో వచ్చిన బ్లౌజ్ ను వేసుకుంది. ఈ తెల్ల చీరకు వచ్చిన బెల్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తన సాఫ్ట్ కురులను కర్ల్స్ వచ్చేలా లూజ్ గా వదులుకుని , మెరిసేటి మేకప్‌ వేసుకుని, స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని ఎంతో గ్లామరస్‌గా కనిపించింది ఈ చిన్నది. తన అభిమానులను అలరించింది. 
 
షరారా సూట్‌లో స్టన్నింగ్ లుక్స్ : 

aaaaa2
 

ఈ మధ్యనే మానుషీ చిల్లర్ అదరిపోయే ఐవొరీ షరారా సెట్‌లో ఫోటో షూట్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. రితికా మిర్చందానీ డిజైనర్ లేబుల్ నుంచి ఎన్నుకున్న ఈ షరారా సెట్‌లో ఎంతో క్యూట్‌గా కనిపించింది ఈ ప్రపంచ సుందరి. సున్నితమైన బీడ్ వర్క్, ఎంబ్రాయిడరీతో వచ్చిన ఈ షరారా సెట్‌ ఈ సుందరికి పెర్‌ఫెక్ట్ గా సెట్ అయ్యింది. ప్లంగింగ్ నెక్‌లైన్ , సేమ్ ప్యాట్రన్ కలిగిన స్ట్రాపీ క్రాప్ టాప్ వేసుకుని అందరిని ఫిదా చేసింది. అదనంగా ఈ అవుట్‌ఫిట్‌కు ఫుల్ స్లీవ్స్ తో వచ్చిన పొడవాటి జాకెట్ వేసుకుని ఎత్నిక్‌ లుక్‌లో ఎంతో క్యూట్‌గా కనిపించింది. తన కురులను ముడి వేసుకుని , డివీ మేకప్‌లో సింపుల్ ఆక్సెసరీస్‌ను ధరించి స్టన్నింగ్ లుక్స్‌తో తన అభిమానులను ఆకట్టుకుంది.
 
వింటేజ్ బాడీకాన్ డ్రెస్ లో వెరీ హాట్ : 

AAaaa 4
 

ఈ మధ్యనే బీ టౌన్ లో అత్యంత గ్రాండ్ గా జరిగిన బిగ్ ఫ్యాట్ బాలీవుడ్ పార్టీకి హాజరయ్యేందుకు ఈ చిన్నది అదిరిపోయే బ్లాక్ అవుట్‌ఫిట్‌ను ధరించింది. 
వింటేజ్ స్ట్రాప్‌లెస్ బాడీకాన్ బ్లాక్ డ్రెస్‌ను ఈ పార్టీకోసం మానుషీ వేసుకుంది. బ్లాక్ గ్లోవ్స్, మెడలో మెరిసేటి నెక్‌లేస్, పాదాలకు పాయింటెడ్ హీల్స్ వేసుకుని ఎంతో స్టైలిష్‌గా ఈ డ్రమాటిక్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. న్యూడ్ మేకప్, పెదాలకు గ్లాసీ లిప్ షేడ్ వేసుకుని అదరగొట్టింది. 
 
 
 
 
 


2022-05-31  Lifestyle Desk