చెమట కక్కించే వేసవిలో కాస్త రిలాక్స్ కావడానికి, రిఫ్రెష్ అవడానికి మార్గాలను వెతుకుతున్నారా? అయితే మీరు మరీ ముందుకు వెళ్లవలసిన పనిలేదు. ఈ వేసవిలో మీరు హీట్‌ని అమాంతం బీట్ చేయవచ్చు. శరీరాన్ని వీలైనంత ఎక్కువ నీళ్లతో నింపేయవచ్చు. ఈ సింపుల్ డెటాక్స్ డ్రింక్స్‌తో కొన్ని కిలోల బరువు తగ్గవచ్చు కూడా.
తక్కువ కేలరీలు, గొప్ప రుచి, ఆరోగ్యకరమైన దినుసులు, బాటిల్స్‌లో నింపిన నీరు లాంటి తేలికైన పానీయాలు మీ బరువును తగ్గించడంలో సాయపడుతూనే శరీరంలో పోషక విలువల స్థాయిలను అలాగే కొనసాగిస్తాయి. అందుకే ఈ సమ్మర్లో మీరు తప్పక తీసుకోవలసిన అయిదు డిటాక్స్ పానీయాలు ఏంటో ఇక్కడ చూద్దాం మరి.
పైనాపిల్ మరియు మందార శీతల టీ
ఐస్ కలిపి చల్లార్చిన టీకి వేసవిలో చాలా ఆదరణ ఉంటుంది. ఈ రెండు పండ్లు కలిపి చేసిన టీ ఈ రెండింటి ఉత్తమ ఫలితాలను మీకు అందిస్తుంది. మీ డ్రింక్‌కు మందార కలిపితే మీకు రిఫ్రెష్ అయిన ఫీలింగ్‌తో పాటు మీ బాడీని విషవ్యర్థాలు లేకుండా క్లీన్‌గా ఉంచవచ్చు. పైనాపిల్, దాని అరగించే లక్షణాలు మరియు యాంటీ ఇన్ప్లమేటరీ ప్రభావాల కారణంగా, ఈ పానీయానికి మరింత ఫ్రూడీ ప్లేవర్ని మీరు అదనంగా జోడించవచ్చు.
పచ్చి మామిడికాయ జూస్
వేసవి ముగిసిపోయినప్పటికీ మీరు మామిడి కాయలను మర్చిపోలేక పోవచ్చు. పండ్లలో రారాజు అయిన మామిడి పండ్ల రుచిని మనలో చాలామంది ఎంతో ఇష్టపడవచ్చు. అయితే వచ్చిగా ఉండే ఆకుపచ్చ మామిడి కాయల్ని అభిమానించేవారు చాలామంది ఉంటారు.ఈ మామిడి కాయలను జూస్క్ కొంత నల్ల ఉప్పును, జీలకర్రను కలిపితే ఈ జ్యూస్‌కి కొత్త రుచి వస్తుంది.
స్ట్రాబెర్రి ఆరెంజ్ కీరా డ్రింక్
ఈ ఫ్రూటీ మిశ్రమం ప్రతి ఒక్కరికీ ఇష్టమవుతుంది. మీకు ఎంతో అవసరమైన విటమిన్ సి ని ఈ పానీయం అందిస్తుంది మరియు హానికరమైన ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ ఆరెంజ్ సున్నితత్వం మీరు తప్పక ట్రై చేయవలసిన కాంబోగా ఉండిపోతుంది.
మింట్ కుకుంబర్ డెటాక్స్ డ్రింక్
ఈ మండువేసవిలో కీర దోసకాయల కంటే మిమ్మల్ని రిఫ్రెష్ చేసేద మరొకటి ఉండదు. 95 శాతం నీటిని కలిగి ఉండే ఈ కుకుంబర్ మీ బ్లడ్ సుగర్ని క్రమబద్దీకరించడమే కాకుండా బరువు తగ్గిస్తుంది. కాస్త పుదీనాను ఈ పానీయానికి కలిపితే మీరు బాగా రిఫ్రెష్ కావచ్చు. మీరు దీన్ని ఇన్సులేటెడ్ కూలర్లో ఉంచి రోజు పొడవునా కొద్దికొద్దిగా సేవించవచ్చు.
అల్లం కలిపిన నిమ్మరసం
ఈ కాంబినేషన్ మనలో చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. ఈ జింజర్ కలిపిన నిమ్మరసం కంటే మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే పానీయాలు ప్రపంచంలో చాలా తక్కువగా ఉంటాయి. జింజర్ అద్బుతమైన ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇది వాపుతో పోరాడుతుంది. గొంతు మంటను తగ్గిస్తుంది. ఒంటినొప్పులనుంచి ఉపశమనం కలిగిస్తుంది. లిచ్చి మరోవైపున మీ ఒట్లోని అన్ని రకాల నూనె పదార్తాలను బ్యాలెన్స్ చేసే అద్భుతమైన ఫుడ్. మీ శరీరంలో ఎక్కువ పాళ్లు నీరు ఉండేలా చేస్తుంది. దీనికి కొన్ని పుదీనా ఆకులు మరియు చియా విత్తనాలు జోడించి తాగితే అధిక ప్రయోజనాలు కలిగిస్తుంది.
మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి