collapse
...
Home / ఆరోగ్యం / గుండె వ్యాధులు / ఆల్కహాల్ తాగితే గుండెకు అత్యంత ప్రమాదం.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telug...

ఆల్కహాల్ తాగితే గుండెకు అత్యంత ప్రమాదం..

2022-05-31  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

alcohol Aa
 

ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యానికి హానికరం. మన జీవితంలో ఈ మాటను కొన్ని వేలసార్లు విని ఉంటాం. కానీ ఆల్కహాల్‌ని కొద్దిగా సేవిస్తే ఆరోగ్యమే అని చాలామంది భావిస్తుంటారు. కానీ నిజం ఏమిటంటే, గతంలో భావించిన దానికంటే మన గుండెకు ఆల్కహాల్ అత్యంత ప్రమాదకారి అని తాజా అధ్యయనం తేల్చి చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, యూరోపియన్ యూనియన్‌లో ఆల్కహాల్ వినియోగం చాలాచాలా ఎక్కువ. చాలాకాలంపాటు ఆల్కహాల్ సేవిస్తే ప్రాణాంతకం అని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ దీనిగురించి యూరోపియన్ యూనియన్‌లో జాగరూకతే లేదట. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీలో ఈ అధ్యయన విశేషాలను ప్రచురించారు.

మీరు ఆల్కహాల్‌ని సేవించకుండా ఉండి ఉంటే ఇక ఎప్పుడూ దాని జోలికి పోవద్దు, మీరు ఇప్పటికే ఆల్కహాల్ సేవిస్తుంటే దాన్ని పరిమాణాన్ని ప్రతివారం తగ్గిస్తూ పోండి. అప్పుడే మీ గుండెకు తక్కుక ప్రమాదం ఉంటుందని డబ్లిన్ లోని  సెయింట్ విన్సెంట్ యూనివర్సీటీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్ బెథానీ వాంగ్ చెప్పారు.

ఈ అధ్యయనం ఎలా జరిగింది   

ఆల్కహాల్ వినియోగంలో సేఫ్ లెవల్స్ గురించి చెప్పడం చాలా కష్టమని తాజా అధ్యయనం చెబుతోంది. అంటే రోజుకు, వారానికి ఇంత పరిమాణంలో ఆల్కహాల్ సేవిస్తే ఆరోగ్యం పదిలం అని చెప్పలేమని దీనర్థం. ఈ స్టడీ కోసం 40 ఏళ్లలోపు వయసున్న 744 మందిని ఎంపిక చేసుకున్నారు. వీరిలో చాలామంది అధిక రక్తపోటు, మధుమేహం, ఒబేసిటీ వంటి వ్యాధులతో భాధపడుతున్నవారే. వీరిలో గుండె వ్యాధి ప్రమాదం చాలామందికి ఉంటోంది. వీరికి అధ్యయనంలో భాగంగా 10 గ్రాముల పరిమాణంలో ఆల్కహాల్ ఇచ్చారు. వారం వారీ, రోజువారీ, తక్కువ తాగేవారు, అసలు తాగనివారు... ఇలా పలు గ్రూపులుగా వీరిని వేరుచేసి పరిశీలించారు. అత్యధికంగా ఆల్కహాల్ సేవిస్తున్న 201మంది రోగులను హై యాంగ్జయిటీ గ్రేడ్‌లో ఉంచారు.

అదే సమయంలో, 356 మంది ఆల్కహాల్‌ని చిన్న పరిమాణాలతో తీసుకున్నారు. 187 మంది తక్కువ పరిమాణంతో ఆల్కహాల్ తీసుకున్నారు. అయితే ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఆల్కహాల్ ఆరోగ్యానికి ప్రమాదకరం అని ఈ అధ్యయనం తేల్చింది. ఇంతకు ముందుఎన్నడుూ గుండె పనిచేయడం విఫలం కానివారిలో  ఆల్కహాల్ సేవించడం మొదలెట్టాక గుండెకు ప్రమాదం 4.5 రెట్లు అధికంగా ఉందని ఈ స్టడీ చెప్పింది.

డాక్టర్ వాంగ్ చెప్పిన దాని ప్రకారం ఆల్కహాల్ సేవించడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. అతి తక్కువగా ఆల్కహల్ సేవించినా సరే దాని వల్ల మనుషులకు ఉపయోగం లేదు. వారానికి 70 గ్రాములకు మించి ఆల్కహాల్ తీసుకునే వారిలో గుండె అగిపోయే ప్రమాదం పెరుగుతోందని ఆమె చెప్పారు. ఆల్కహాల్ వినియోగాన్ని తగ్గించడంపై అన్నిదేశాలూ తీవ్ర ప్రయత్నాలు చేయాలని ఆమె చెప్పారు. ఉదాహరణకు గుండె వ్యాధి చాలా ఎక్కువగా ఉన్న ఐర్లండ్‌లో పురుషులు వారానికి 17 యూనిట్లు, స్త్రీలు 11 యూనిట్లు మాత్రమే తాగేలా ప్రభుత్వం ఫిక్స్ చేయాలని డాక్టర్ వాంగ్ సూచించారు.
 



2022-05-31  Health Desk