collapse
...
Home / చదువు / నాలుగు సార్లు ఫెయిల్..ఐదోసారి 28వ ర్యాంక్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telu...

నాలుగు సార్లు ఫెయిల్..ఐదోసారి 28వ ర్యాంక్

2022-05-31  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

upsc zz
 

యూపీఎస్‌సీ సివిల్ సర్వీస్ పరీక్షలో గెలుపు సాధించాలంటే ఓర్పు, పట్టుదల చాలా ముఖ్యమంని మంత్రి మౌర్య భరద్వాజ్ చెబుతున్నారు. 28 ఏళ్ల ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన మౌర్య విశాఖపట్నం నివాసి. వరంగల్ ఎన్ఐటీ స్టూడెంట్. 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫైనల్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 28వ ర్యాంకు సాధించిన మోర్య తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. నాలుగుసార్లు విఫలమైన అయిదోసారి విజయం సాధించిన ఘనత తనది. సోమవారం 2021 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఫలితాలు ప్రకటించారు.చిన్నప్పటి నుంచి ఐఏఎస్ కావాలని కల కన్న మౌర్య బాల్యం నుంచే ఆ పెద్ద బాధ్యతను భుజం మీద వేసుకున్నారు. తన కుటుంబం గర్వించేలా చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఆరోగ్యం, విద్యారంగంలో పనిచేయడం ద్వారా దేశం మొత్తం గర్వించేలా చేస్తానన్నారు.

తాను సాధించిన ఫలితాన్ని చూసి కుటుంబం పొంగిపోయిందని మౌర్య చెప్పారు. తన తండ్రి ప్రభుత్వ స్కూల్ టీచర్. తల్లి ప్రభుత్వ వైద్య శాఖలో పనిచేస్తున్నారు. సోదరుడు ఎయిమ్స్‌లో సర్జన్‌గా పనిచేస్తున్నారు. తమ పిల్లలిద్దరికీ మంచి చదువు చెప్పించాలని అమ్మనాన్న తపన పడ్డారని చెప్పారు.సివిల్ సర్వీస్ పరీక్షలో మౌర్య అయిదో ప్రయత్నంలో నెగ్గారు. ఇంటర్వ్యూ రౌండ్‌కి చాలా సార్లు చేరుకున్నాను. కానీ తుది ఎంపికలో చాన్స్ మిస్ అయేది. కానీ కొన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ ఎట్టకేలకు లక్ష్యాన్ని చేరుకున్నానని, నా సప్నం సాకారమైనందుకు కుటుంబం గర్విస్తోందని మౌర్య చెప్పారు. ఇంకా మంచి ర్యాంకు వస్తుందనుకున్నాను కానీ ఆలిండియా స్థాయిలో 28వ ర్యాంకు రావడం ఏమంత చెడ్డ విషయం కాదన్నారు.

2014లో వరంగల్ ఎన్ఐటీలో ఎలెక్ట్రికల్, కమ్యూనికేషన్ ఇంజనీరంగ్ పూర్తి చేసిన మౌర్య హైదరాబాద్‌లో ఒక ఎమ్ఎన్‌సీలో పనిచేశారు. ఎలక్ట్రికల్ ఇంజనీరుగా పని చేసినప్పటికీ, సంతృప్తి లేకుండా పోయింది. చిన్నప్పటినుంచి ఐఏఎస్ ఆఫీసర్‌ అవ్వాలని కోరుకునేవాడిని, దాంతో ఉద్యోగంవదలి పరీక్షలకు సిద్ధమయ్యాను. కానీ ప్రారంభ ప్రయత్నాల్లో పరీక్ష పాస్ కాలేదు. దీంతో పరీక్షలకు ప్రయత్నిస్తూనే నా ఉద్యోగంలో తిరిగి చేరాలనుకున్నాను అని మౌర్య చెప్పారు.పరీక్షల సన్నాహకం కోసం మౌర్య సివిల్స్  డైలీ అనే ఆన్ లైన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్‌లో చేరారు. ఉద్యోగం చేస్తూనే పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. అయితే పరీక్షలకు ప్రిపేర్ కావడానికి యూట్యూబ్, టెలిగ్రామ్ న్యూ లెటర్ పేజెస్‌తో సహా పలు ఇతర ప్లాట్ ఫామ్‌ల సహాయం కూడా తీసుకున్నానని చెప్పారు.

ఆత్మవిశ్వాసమే కీలకం   

ఇంటర్వ్యూ నాకు పెద్దగా భయం కలిగించలేదన్ని మౌర్య పేర్కొన్నారు. అంతకు ముందు చాలా ప్రయత్నాలు చేశాను కాబట్టి  పైగా నా వర్కింగ్ నేపథ్యం కూడా కమ్యూనికేషన్ అంటే  నాకు పెద్ద సవాలు కాలేదన్నారు. చాలా తక్కువ సీట్లు ఉండటం వాస్తవం. కనీ సెలెక్షన్ లో అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి విఫలమైన పక్షంలో మనసు కష్టపెట్టుకోకుండా మరింత కృత నిశ్చయంతో, కఠిన శ్రమ చేస్తే విజయం మీ చెంత చేరుతుందని చెప్పారు.

నా అనుభవం నుంచి యూపీఎస్‌సీ పరీక్షల్లో నెగ్గాలనుకునే వారు నేర్చుకోవాలనుంటే, ఒకే ఒక్క విషయం. మీ పట్టుదలను ఎన్నటకీ వదిలిపెట్టవద్దు. అలాగే మీకంటూ ఒక బ్యాకప్‌ను సిద్ధం చేసి ఉంచుకోండి. అప్పుడే ప్రశాంతంగా సిద్దం కాగలరు. మరంత ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ కావడానికి అది మీకు దోహదం చేస్తుందని మౌర్య చెప్పారు. చివరి నిమిషం ఎగ్జామ్ టిప్స్ గురించి చెబుతా ఎక్జామినేషన్ హాల్‍‌కి విశ్వాసంతో వెళ్లండి. భీతి చెందవద్దు. ప్రిలిమినరీ ఎక్జామ్స్‌లో ఆత్మవిశ్వాసమే అతిపెద్ద ఆయుధంగా పనిచేస్తుందని చెప్పారు.

ప్రజల కష్టాలు తెలుసు.. వారికోసమే పనిచేస్తా   

ఐఏఎస్ ఆఫీసర్‌గా ప్రయాణంలో తన లక్ష్యాల గురించి మౌర్య చాలాస్పష్టతతో ఉన్నారు. దేశంలో గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను. అనేక ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న కష్టాలు నాకు తెలుసు. కాబట్టి వెనుకబడిన ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్నాను. అలా పనిచేయగలిగితే ఈ ప్రాంతాల ప్రజలు తమ అభివృద్దికోసం మెరుగైన అవకాశాలు పొందగలరు అని మౌర్య అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ తర్వాత విద్య ఆరోగ్య రంగాల్లో విధ్వసం జరిగింది. నా తల్లిదండ్రులు కూడా ఆరోగ్య విద్యా రంగాల్లోనే పనిచేశారు కాబట్టి ఈ రంగాలపైనే నా దృష్టి ఉంది. నేను పని చేయడానికి వీటినే ప్రాధాన్య రంగాలుగా ఎంచుకుంటాను అని మౌర్య భరద్వాజ్ చెప్పారు.2022-05-31  Education Desk