collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / చిత్తూరు / చిత్తూరులో సైకో సాఫ్ట్ వేర్.. భార్య‌ను చంపి చెరువులో ప‌డేసిన భర్త - 6TV News : Telugu in News | Telugu News | Latest Tel...

చిత్తూరులో సైకో సాఫ్ట్ వేర్.. భార్య‌ను చంపి చెరువులో ప‌డేసిన భర్త

2022-05-31  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

Husband Kills Wife
చిత్తూరు జిల్లా తిరుపతిలో శాడిస్ట్ భర్త అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  భార్యను దారుణంగా కొట్టి చంపి సూట్‌కేసు‌లో కుక్కి చెరువులో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటన 5 నెలల తర్వాత బయటకు తెలిసింది. పోలీసు విచారణలో భర్తే హంతకుడని తేలింది. హత్యకు గురైన వివాహిత మృతదేహన్ని పోలీసులు వెలికి తీశారు.  

*ఘనంగా పద్మ, వేణుగోపాల్ వివాహం
తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మకు, అదే ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వేణు గోపాల్ కు 2019లో పెళ్లి అయ్యింది. పద్మకు కుటుంబ సభ్యులు ఉన్నంతలో ఘనంగా పెళ్లి చేశారు.    క‌ట్నం కింద రూ. 20 ల‌క్ష‌ల న‌గ‌దు, 45 సవ‌ర్ల బంగారం ఇచ్చినట్లు ఆమె తండ్రి చెప్పాడు. బంగారం మొత్తం అమ్మేసినట్లు వెల్లడించాడు. అంతేకాదు.. పెళ్లైన నాలుగు  నెలల నుంచే వేణు గోపాల్ భార్యను వేధించడం మొదలు పెట్టాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పద్మను మానసికంగా, శారీరకంగా హింసించి చిత్రహింసలు పెట్టేవాడన్నారు. పెళ్లయిన నాలుగో రోజే పద్మ శరీరంపై వాత పెట్టాడని చెప్పారు. వేణుగోపాల్ బయటకు వెళ్లే సమయంలో పద్మను ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేసేవాడన్నారు.

*ఇంటికి తీసుకెళ్లిన వెంటనే హత్య
వేణుగోపాల్ వేధింపులు తట్టుకోలేక భర్త నుంచి విడాకులు తీసుకోవాలని పద్మ భావించింది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చాలా సార్లు చెప్పింది.  అయితే రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఇరువురిని కలిసి ఉండాలని  సర్ధి చెప్పారు. ఆ తర్వాత అమ్మాయిని ఇంటికి పంపించారు.  ఇంటికి వెళ్లిన వెంటనే పద్మను దారుణంగా కొట్టి చంపాడు వేణు గోపాల్. అంతేకాదు.. పద్మ డెడ్ బాడీని ఓ సూట్ కేసులో కుక్కాడు.  దాన్ని రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ చేపల చెరువులో పడేశాడు. తర్వాత, ఏమీ తెలియనట్లు  వ్యవహరించాడు వేణుగోపాల్. తన భార్య తప్పిపోయిందంటూ జనవరిలో  పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. చివరకు తమదైన శైలిలో విచారణ చేశారు. పోలీసు లాఠీల రుచితో అసలు విషయం బయటకు కక్కాడు వేణు గోపాల్. తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.  ఐదు నెలల తర్వాత పద్మ మిస్సింగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు.  

*వేణు గోపాల్ పై గతంలోనూ కేసులు
తన భార్య టార్చర్ తట్టుకోలేకనే హత్య చేసినట్లు వేణుగోపాల్ చెప్పాడు.  పద్మ తనను రోజు రోజుకు దారుణంగా టార్చర్ చేసేదని ఆరోపించాడు. విడాకులు ఇవ్వాలని కోరానని..  డబ్బులు కూడా ఇస్తానని చెప్పినట్లు వెల్లడించాడు. అయితే, ఎక్కువ డబ్బులకు ఆశ పడి తనపై చిత్తూరు, మంగళగిరిలో కేసులు పెట్టిందని చెప్పాడు.  తనను ఉద్యోగం చేసుకోనివ్వకుండా హింసించిందని ఆరోపించాడు. భార్య టార్చర్ తట్టుకోలేకనే  ఈ హత్య చేసినట్లు వెల్లడించారు.  సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వేణుగోపాల్‌పై గ‌తంలోనూ  కేసులు ఉన్నాయి. హైద‌రాబాద్‌లో ఇద్ద‌ర‌మ్మాయిల‌ను లైంగికంగా వేధించిన‌ట్లు కేసులు న‌మోదయ్యాయి. ఇతడిపై చెన్నైలోనూ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  



2022-05-31  News Desk