collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / అనార్కలి గౌనులో బాలీవుడ్ భామ అందాలు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | N...

అనార్కలి గౌనులో బాలీవుడ్ భామ అందాలు

2022-05-31  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

AAADDDDD
 

సాంప్రదాయ ఫ్యాషన్ దుస్తుల ఎంపికల విషయంలో బాలీవుడ్ నటి , మోడల్ హుమా ఖురేషీని చాలా మంది ఫ్యాషన్ ప్రియులు ఫాలో అవుతుంటారు. 
మ్యాక్సీ డ్రెస్సులు, రెడ్ కార్పెట్ గౌన్స్, ప్యాంట్ సూట్స్ ఇలా ఏ అవుట్‌పిట్స్‌ ధరించినినా అవి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఎత్నిక్ అవుట్‌పిట్స్ ఎంపికలో ఈ నటి కంఫర్ట్‌కు ప్రధ్యానతను ఇస్తుంది. తాజాగా అలాంటి ఓ అవుట్‌ఫిట్‌నే ధరించి అందరిని అట్రాక్ట్ చేసింది హుమా ఖురేషీ. భారీ అలంకరణలతో వచ్చిన అనార్కలి గౌన్‌తో హుమా తాగా అద్భుతమైన ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్‌కు సంబంధించిన పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేసింది హుమా. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అవుట్‌ఫిట్‌ను చూసి ఫ్యాషన్ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. 
 
ఆధునిక మహిళ మెచ్చే అవుట్‌ఫిట్‌ : 

AAAwww
 

ఆధునిక భారతీయ మహిళ సౌకర్యాన్ని మిళితం చేసిన అద్భుతమైన హెవీ అలంకరణలతో వచ్చిన అనార్కలి గౌన్‌ను ధరించి హుమా ఖురేష్ స్టైలిష్ వెడ్డింగ్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తోంది. ఈ సెమీ ట్రెడిషనల్ లుక్ అవుట్‌ఫిట్‌ను హుమా జేడ్ బై మౌనికా అండ్ కరీష్మా క్లాతింగ్ లేబుల్ షెల్ఫ్‌ నుంచి సేకరించింది.  హుమా ధరించిన అనార్కలీ వెండి, బంగారు ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన బూడిద రంగు టోన్‌లో ఐవరీ షేడ్ లో వచ్చింది. ప్లంగింగ్ వి నెక్‌లైన్, స్కాలోప్డ్ బార్డర్స్, పొడవాటి స్లీవ్స్, షీర్ పానెల్స్, ఆంకిల్ గ్రేజింగ్ హెమ్ లెన్త్ , థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఈ అవుట్‌ఫిట్‌ను డిజైన్ చేశారు డిజైనర్లు. సెలబ్రిటి స్టైలిస్ట్ సనమ్ రతన్సీ హుమాకు స్టైలిష్ లుక్స్‌ను అందించారు. 
 
మినిమల్ ఆక్సెసరీస్ వేసుకున్న హుమా: 

AAwwe
 

ఈ హెవీ ఎంబ్రాయిడరీతో వచ్చిన అనార్కలీ గౌన్‌కు మినిమల్ ఆక్సెసరీస్‌ను ఎన్నుకుంది హుమా. రూబీలు, వజ్రాలతో అలంకరించబడిన హ్యాండ్ క్రాఫ్టెడ్ ఇయర్‌నింగ్స్‌ను తన చెవులకు అలంకరించుకుంది. తన కురులను లూజ్‌ గా వదులుకుని , కనులకు మెరుపుల ఐ ష్యాడో, వింగెడ్ ఐ లైనర్, మస్కరా వేసుకుంది. పెదాలకు గ్లాసీ కోరల్ పింక్ లిప్ షేడ్ దిద్దుకుని మెరిసేటి ఛర్మంతో తన లుక్‌ను పూర్తి చేసి ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసింది. 
 
మ్యాక్సీ డ్రెస్‌తో మైండ్ బ్లాక్ చేసింది.  

AAww2

అంతకు ముందుకు ఈ చిన్నది మరో అద్భుతమైన అవుట్‌ఫిట్‌ ధరించి అదరిపోయే ఫోటో షూడ్ చేసి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. సాటిన్ సిల్క్ వైట్ మ్యాక్సీ డ్రెస్‌తో మైండ్ బ్లాక్ చేసింది హుమా. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రెట్రో ఫ్యాషన్ ఎలిమెంట్స్‌ను జోడించి తన లుక్‌తో అందరిని ఫిదా చేసేసింది. ప్లంగింగ్ వి నెక్‌లైన్ , బిల్లోవీ లాంగ్ స్లీవ్స్, స్కర్ట్ మీ వచ్చిన టాస్సెల్స్‌, బాడీ హగ్గింగ్ డీటైల్స్ అవుట్‌ఫిట్‌ను హైలెట్ చేశాయి. ఈ అవుట్‌పిట్‌కు తగ్గట్లుగా స్టైలిష్ లుక్స్‌ను ఎన్నుకుంది హుమా. తన పాదాలకు ఐవరి షేడ్ పంప్స్ వేసుకుంది. చెవులకు అలంకరణలతో వచ్చిన ఇయర్‌రింగ్స్, చేతి వేళ్లకు స్టేట్‌మెంట్ ఉంగరాలను పెట్టుకుంది. తన కురులను లూజ్ గా వదులుకుంది. కనులకు వింగెడ్ ఐ లైనర్, సబ్టిల్ ఐ ష్యాడో వేసుకుంది. పెదాలకు పింక్ లిప్ షేడ్ దిద్దుకుని తన గ్లామరస్ లుక్స్‌తో అదరగొట్టింది. 

 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 

 


2022-05-31  Lifestyle Desk