collapse
...
Home / బిజినెస్ / టెక్నాలజీ / వావ్ వాట్సాప్..సూపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telu...

వావ్ వాట్సాప్..సూపర్ క్యాష్ బ్యాక్ ఆఫర్లు

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

వాట్సాప్ మెటా యాజమాన్యం ప‌రిదిలోనికి వ‌చ్చాక త‌న వినియోగ‌దారుల‌కు డిజిట‌ల్ పేమెంట్లు చేసుకునేలా వాట్సాప్ పే ఏర్పాటుచేసింది. ఈ మెసేజింగ్ యాప్  వాట్సప్  పేమెంట్ సేవల్ని ప్రారంభించి త‌న వాట్సాప్ వినియోగ‌దారులు ఎలాంటి  ఆర్ధిక‌ లావాదేవీలు చేసుకోవాల‌ని అనుకున‌నా  ఈ యూపీఐ  పేమెంట్ ఆప్షన్‌తో  వినియోగదారులను అనుమతిస్తుంది. 

వాస్తవానికి వాట్సాప్‌కు 2 బిలియన్ల యూజర్ తో మంచి మెసేజ్ యాప్‌గా దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఎందుక‌నో ఈపేమెంట్ యాప్‌కి మాత్రం త‌గిన ఆద‌ర‌ణ ల‌భించ‌డంలేద‌న్న‌ది నిజం. ఈ వాస్త‌వంగ్ర‌హించిన మెటాసంస్థ వాట్సాప్‌వినియోగ‌దారుల‌ను త‌న పేమెంట్ యాప్ వైపుకు మళ్లించే వ్యూహాలు ర‌చించిన‌ట్టు క‌నిపిస్తోంది.

దీంతో మెసేజింగ్ యాప్ ద్వారా గరిష్టంగా 3 చెల్లింపులపై రూ. 35 చొప్పున‌ క్యాష్‌బ్యాక్‌ను అందించాల‌ని నిర్ణ‌యించ‌డం విశేషం. త‌ద్వారా పేమెంట్స్, మనీ ట్రాన్స్‌ఫర్స్ సేవల్లో  వాట్సప్ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ తో పట్టు పెంచుకోవడానికి ప్ర‌య‌త్నిస్తోంది.  అందుకే ఈ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన‌ట్టు కొంద‌రు వినియోగ‌దారులు చెపుతున్నారు.

ఈ వాట్సప్ పేమెంట్స్ ఉపయోగించినవారు క్యాష్‌బ్యాక్ పొందుట‌కు అర్హులు.  అయితే కనీసం 30 రోజులుగా వాట్సప్ యూజర్ అయి ఉండి వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ యాక్టివేట్ చేసి ఉండి తీరాలి.   ఓ నెంబ‌ర్ వాట్సాప్ వాడుతున్న వారు ఒక సారి ఈ మాప్ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తే రూ.35 చొప్పున క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది.  ఇలా మూడు సార్లు రూ.35 చొప్పున మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చన్న‌ది స‌ద‌రు మెటా యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. అయితే మూడు వేర్వేరు కాంటాక్ట్‌లకు డబ్బు పంపడం ద్వారా ఈ క్యాష్‌బ్యాక్ రివార్డ్‌ను మూడు సార్లు రిడీమ్ చేసుకోవచ్చు

కానీ ఒకేకాంటాక్ట్ నెంబ‌ర్‌కి మూడు ప‌ర్యాయాలు డ‌బ్బులు పంపితే కేవ‌లం రూ.35 మాత్ర‌మే క్యాష్ బ్యాక్ పొందే ఆస్కారం ఉంటుంది.  ఈ ఆఫ‌ర్  యాక్సెస్ చేయడానికి నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాల‌ని పేర్కొంది.  వేర్వేరు వినియోగదారులకు వేర్వేరు సమయాల్లో డ‌బ్బులు పంపే వారికి  కాల‌వ్య‌వ‌ధిత‌క్కువ‌గా నే ఈ  క్యాష్‌బ్యాక్  రివార్డ్ అందుబాటులోకి వ‌స్తుంది.  కాగా వాట్సాప్ పేమెంట్స్ నుంచి తమ కాంటాక్ట్‌లకు ఎంత మొత్తాన్ని అయినా పంపవచ్చు. కనీస మొత్తం ఇంత ఉండాలి అన్న నిబంధ‌న లేక పోవ‌టం హ‌ర్షించ‌ద‌గిన‌దే...  

ఇక ఈ క్యాష్‌బ్యాక్ రివార్డు పొందాల‌నుకునేవారు క‌చ్చితంగాభారతదేశంలో వాట్సాప్‌లో చెల్లింపుల కోసం నమోదు చేసుకున్న వాట్సాప్ వినియోగదారు అయి ఉండాలి.   వాట్సాప్ ఇటీవ‌ల తీసుకువ‌చ్చిన స‌రికొత్త  వెర్షన్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది.  అలాగే మీ బ్యాంక్ వివరాలను సమర్పించడం ద్వారా  చెల్లింపుల కోసం నమోదు చేసుకోవాలి.

ఇక వాట్సాప్ ద్వారా డ‌బ్బులు పంపాల‌నుకునేవారు  వాట్సాప్‌ని తెరిచి, పైన  త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే, మరిన్ని ఎంపికలు వ‌స్తుంది. దానిలో  పేమెంట్ పై  క్లిక్ చేసి సెండ్ పేమెంట్ ఆప్ష‌న్‌ని ఎంచుకోవాలి. ఆపై  మీరు డబ్బులు ఎవ‌రికి  పంపాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్‌ని ఎంట‌ర్ చేయండి, లేదా మీ కాంటాక్ట్ లిస్టులోంచి ఎంపిక చేయండి.. స‌ద‌రు వాట్సాప్ వినియోగ‌దారులు కూడా  ఇప్పటికే వాట్సప్ పే రిజిస్టర్ చేసినట్టైతే మీకు గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది. ఒకవేళ ఎలాంటి గిఫ్ట్ ఐకాన్ మీకు  కనిపించకపోతే అవ‌త‌ల వారిని వాట్సప్ పేమెంట్స్‌లో జాయిన్ కావాల‌ని కోరుతూ  లింక్ పంపితే స‌రి.

 ఇక పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించేందుకు వీలుగా కాంటాక్ట్‌ని ఎంపిక‌చేసి, వారికి మీరు ఎంత డ‌బ్బులు పంపాలనుకుంటున్నారో ఆ మొత్తం అంకెను ఎంటర్ చేయాలి.  ఆ తర్వాత నెక్ట్స్‌ పైన క్లిక్ చేసి , సెండ్ పేమెంట్ బ‌ట‌న్ నొక్కి,  మీ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే స‌రి, ఎదుటివారికి పేమెంట్ క్ష‌ణాల‌లో అందుతుంది. మీకు రావాల్సిన గిఫ్ట్ కూడా మీకు అందించే ఏర్పాటు చేస్తుంది. ఇదికేవ‌లం మూడు ప‌ర్యాయాలు మాత్ర‌మే అని గుర్తుంచుకోండి.
 



2022-06-01  News Desk