collapse
...
Home / అంతర్జాతీయం / ఆ లెసిబియ‌న్స్ క‌ల‌సి ఉండొచ్చు... కేర‌ళ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telug...

ఆ లెసిబియ‌న్స్ క‌ల‌సి ఉండొచ్చు... కేర‌ళ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

nasrit
 

స్వ‌లింగ సంప‌ర్కులైన ఇద్ద‌రు యువ‌తుల‌ను వారి త‌ల్లి దండ్రులు వేరు చేసినా క‌ల‌సి జీవించాల‌న్న వారి నిర్ణ‌యాన్ని ఎవ‌రూ కాల‌రాయ‌లేరంటూ కేర‌ళ హైకోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ఈ కేసు పూర్వా ప‌రాల‌ను ఓసారి ప‌రికిస్తే...

   సౌదీ అరేబియాలో పాఠ‌శాల‌లో 1వ త‌ర‌గ‌తి చ‌దువుకుంటున్న స‌మ‌యంలో అలువాకు చెందిన   అధీలా, కోజికోడ్‌కు చెందిన  ఫాతిమాలు   ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఏర్ప‌డింది. వ‌య‌సుతో పాటు పెరుగుతూ వ‌చ్చింది.  న‌స్రీన్‌, ఫాతిమా.. ఇద్ద‌రూ సౌదీ అరేబియాలోనే గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేశారు.  అత్యంత సన్నిహితంగా ఉన్న వీరికి యుక్త వ‌య‌సు నజ్రీన్, 22, మరియు ఫాతిమా నూర్, 23 వ‌చ్చినా వారి మ‌ధ్య అనుబంధంలో ఏ మాత్రం కించ‌త్ కూడా మార్పు రాలేదు. ఈ క్ర‌మంలో ఇరువురి మ‌ధ్య ప్రేమ చిగురించింది. 

సౌదీ నుంచి చెన్నై వ‌చ్చి ఇరువురూ వేర్వేరు ఉద్యోగాల‌లో స్థిర ప‌డి క‌ల‌సి స‌హ‌జీవ‌నం చేయ‌టం ఆరంభించారు. ఇరువురూ చిన్న నాటి మిత్రులే కావ‌టంతో వారి కుటుంబ స‌భ్యులు కూడా అభ్యంత‌ర పెట్ట‌లేదు. కాల క్ర‌మంలో ఆ ఇద్ద‌రూ ద‌గ్గ‌ర‌య్యారు. లెస్బియ‌న్లుగా మారారు. జీవితాంతం క‌లిసి ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు.  వివాహం చేసుకోవాల‌ని అనుకున్నారు . త‌మ త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. 

యువ‌తులు చెప్పిన మాట‌లు విన్న ఆ ఇరువురి   తల్లిదండ్రులు వారి ప్రేమ‌నే కాదు క‌నీసం కలిసి జీవించడానికి కూడా నిరాకరించడంతో షాక్‌కు గురయ్యారు.  వీరిద్దరూ ఇంట్లోంచి పారిపోయి లెసిబియ‌న్స్ హ‌క్కుల కోసం,  ఇతర అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్న కోజికోడ్‌లోని  వనజా కలెక్టివ్ అనే సంస్థ వద్ద ఆశ్రయం పొందారు.

అయితే ఇరువురి త‌ల్లి దండ్రుడు బంధువులు ఇద్ద‌రు అస‌లు ఆ ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని అన్నివిధాలా ఒత్త‌డి చేశారు. మాన‌సికంగా, శారీర‌కంగా హింసించారు. వారిని ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లనివ్వ‌లేదు. ఆపై ఇరువురునీ దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించ‌డంతో  నూర్‌ను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా తీసుకెళ్లి పోయారు.

కుటుంబ స‌భ్యుల నుంచి వ్య‌తిరేక‌త‌కి తోడు నూర్‌ని త‌న నుంచి దూరం చేసార‌న్న ఆవేద‌న‌తో ఫాతిమాను ఆమె తల్లిదండ్రులు అపహరించారని, కన్వర్షన్ థెరపీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ అదిలా  పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా   ఇది  వ్యక్తిగత వ్యవహారమంటూ కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో నజ్రీన్ కేర‌ళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఈ పిటీష‌న్‌ని స్వీక‌రించిన  కేర‌ళ హైకోర్టు దానిని న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, సి.జయచంద్రన్‌లతో కూడిన డివిజన్ బెంచ్‌కు విచార‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఎక్క‌డా  ఒక్కసారి కూడా వెనక్కి తగ్గకుండా న‌జ్రిన్ ప్ర‌తి వాయిదాకు హాజ‌ర‌వుతూ  ఫాతీమా ఆచూకీ తెలుసుకుని, త‌న‌కు అప్ప‌గించేలా పోలీసుల‌ను ఆదేశించాల‌ని కోర్టును కోరింది.

త‌మ అనుబంధాన్ని వ్య‌తిరేకించిన త‌మ కుటుంబాలు త‌మ‌ను మాన‌సికంగా, శారీర‌కంగా హింసించాయ‌ని కోర్టుకు త‌న వాద‌న‌ల‌ను వినిపించింది.  ఈ క్ర‌మంలో ఫాతిమాను కోర్టు ముందు హాజ‌రుప‌ర్చాలని పోలీసుల‌ను ఆదేశించింది. 

. ఇరు వ‌ర్గాల వాద‌న‌లూ విన్న హైకోర్టు డివిజ‌న్‌బెంచ్ ధ‌ర్మాస‌నం ఫాతిమా నూర్ - న‌జ్రీత్ ల‌కు  ఊర‌ట ఇస్తూ ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉండొచ్చ‌ని  మంగ‌ళ‌వారం తీర్పునిచ్చింది. వ‌యోజ‌నులైన , ఇద్దరూ కలిసి జీవించాలనుకుంటున్నారని ఇది సుప్రీం ఆదేశాల‌కు కూడావ్య‌తిరేకం కాద‌ని  నిషేధం  అంత‌కంటే కాద‌ని ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి జ‌స్టిస్ వినోద్ చంద్ర‌న్ స్ప‌ష్టం చేశారు.  

దీంతో  తల్లిదండ్రుల ద్వారా విడిపోయిన లెస్బియన్ జంటను కేరళ హైకోర్టు తిరిగి కలిపేసిందని హ‌ర్షాతిరేకాలువ్య‌క్త మ‌వుతున్నాయి. సామాజిక మాద్య‌మంలోనూ ఈ ఇరువురు యువ‌తుల‌కు అభినంద‌న‌లు వెల్లువెత్తుతుండ‌టం విశేషం. 

 2022-06-01  News Desk