collapse
...
Home / బిజినెస్ / ఆటోమొబైల్ / నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చునర్‌! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News T...

నెక్స్ట్‌ జనరేషన్‌ ఫార్చునర్‌!

2022-06-01  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

fortuner
 

నెక్స్ట్‌ జనరేషన్‌ టయోటా ఫార్చునర్‌ వచ్చే ఏడాది ఇంటర్నేషనల్‌ లాంచింగ్‌ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఎస్‌యూవీ మైల్డ్‌ హై బ్రిడ్‌ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌గా ఉండవచ్చునని ఆటో రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జపాన్‌కు చెందిన కార్ల దిగ్గజం టయోటా ప్రస్తుతం నెక్స్ట్‌ జనరేషన్‌ వెర్షన్‌ పార్చునర్‌ ఎస్‌యూవీపై పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. ఈ కొత్త మోడల్‌ వచ్చే ఏడాది ఇంటర్నేషనల్‌ లాంచింగ్‌ ఉంటోందనేది టాక్‌. ముందు గా థాయిలాండ్‌లో దీన్ని లాంచ్‌ చేసి అటు తర్వాత క్రమంగా ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లో విడుదల చేయాలనేది టయోటా ప్లాన్‌. అయితే ఈ నెక్స్ట్‌ జనరేషన్‌ టయోటా భారత్‌ మార్కెట్లో కూడా ఎంట్రీ ఇస్తుంది. ముందుగా గ్లోబల్‌ మార్కెట్లో విడుదలైన తర్వాత కొన్ని నెలలకు ఈ కారు భారత్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. 

అయితే మార్కెట్లో వస్తున్న ఊహాగానాలను గనుక పరిగణనలోకి తీసుకుంటే టయోటా ముందుగా ఎలక్ర్టిక్‌ పార్చునర్‌ ఎస్‌యూవీ తయారు చేయాలనుకుంటోందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా థాయిలాండ్‌ నుంచి వినవస్తున్న టాక్‌ విషయానికి వస్తే ఈ నెక్స్ట్‌ జనరేషన్‌ టాయోటా ఫార్చునర మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ 2.8 లీటర్‌ టర్బో చార్జ్‌డ్‌ డిజిల్‌ ఇంజిన్‌ను బిగించాలనుకుంటున్నట్లు ఆటో రంగంలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే దీని పవర్‌ ఔట్‌పుట్‌ తదితర అంశాలు మాత్రం బహిరంగ పర్చలేదు. 

మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌తో టార్క్‌ ఔట్‌పుట్‌  హెవీ యాక్సిలరేషన్‌ అప్పుడు బలోపేతం అవుతుంది. అదే సమయంలో బ్రేకింగ్‌తో పాటు అన్నీ చక్కగా పనిచేస్తాయి. దీంతో స్టార్ట్‌ / స్టాప్‌ సిస్టమ్‌పై ప్రభావం చూపించి ఫ్యూయల్‌ కన్సప్షన్‌ మెరుగుపడుంది. ప్రస్తుతం ఉన్ననెక్స్ట్‌ జన్‌ మోడల్స్‌ ఓవర్‌ ఆల్‌ ఫెర్పార్మెన్స్‌తో పోల్చుకుంటే మరింత మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు.అయితే పెట్రోల్‌ పవర్‌ ట్రెయిన్‌ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కాగా పార్చునర్‌ విషయానికి వస్తే థాయిలాండ్‌లో పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌ అందుబాటులో లేదు. అందుకే దాని ప్రస్తావన లేదు.
అయితే నెక్స్ట్‌ జనరేషన్‌ టయోటా ఫార్చునర్‌ను మాత్రం ఇప్పటి వరకు స్పై చేయ్యలేదు. అంటే దీని డిజైన్‌ గురించి ఇతర అంశాల గురించి అంతా సస్పెన్స్‌. మార్కెట్‌ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ఫార్చునర్‌తో పోల్చుకుంటే మరింత మెరుగైన ఈక్విప్‌మెంట్‌ను ఈ కారుకు వినియోగిస్తారని చెబుతున్నారు. ప్రీమియం క్యాబిన్‌ డిజైన్‌ను తప్పకుండా ఉంటుందని ఆటో నిపుణుల అంచనా.

 ప్రస్తుతానికి కారు డిజైన్‌ తదితర అంశాలు స్పై కాకపోయినప్పటికి త్వరలోనే కొత్త ఫార్చునర్‌ డిజైన్‌ తదితర అంశాలు రాబోయే నెలల్లో ఆన్‌లైన్‌లో దర్శనమిస్తాయని చెబుతున్నారు. కాబట్టి దీని గురించి మరింత సమాచారం వెల్లడిచండానికి అవకాశాలుంటాయి. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌ మోడల్‌ ఫార్చునర్‌ వివిధ వెర్షన్‌లలో లభిస్తోంది. అవి స్టాండర్డ్‌ వెర్షన్‌, లీజెండర్‌, జీఆర్‌ స్పోర్ట్‌. కాగా కొత్తగా మార్కెట్లోకి రాబోతున్న నెక్స్ట్‌  జన్‌ మోడల్‌లో మల్టీపుల్‌ వెర్సన్‌లో లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు.ఇక భారతీయ మార్కెట్లో టయోటా ఫార్చునల్‌ ప్రస్తుతం రూ.31.79 లక్షల నుంచి రూ.48.43 లక్షల మధ్య (ఎక్స్‌ షో న్యూఢిల్లీ)లో లభిస్తోంది. అయితే కొత్త మోడల్‌ ఫార్చునర్‌ విషయానికి వస్తే వీటి కంటే మరింత ఖరీదైనదిగా ఉంటుంది. మార్కెట్లో ఇది ఎంజీ గ్లోస్టర్‌, మహీంద్రా అల్టురస్‌ జీ4, ఇసుజు ఎంయు -ఎక్స్‌తో పోటీ పడుతుంది.

 

 

 మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి



2022-06-01  Business Desk