collapse
...
Home / చదువు / జెట్‌ ఎయిర్‌వేస్‌లో కొలువులు! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Te...

జెట్‌ ఎయిర్‌వేస్‌లో కొలువులు!

2022-06-01  Education Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

jet airways
 

ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. వాటిలో మీకు అర్హత కలిగిన జాబ్‌ ఉందో లేదో పరిశీలించుకోండి.

ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థికంగా ఇబ్బందులు పడి మూతపడింది. కోవిడ్‌ తర్వాత పౌర విమానయాన రంగం పూర్తిగా కుదేలైంది. ఇప్పుడిప్పుడు ఈ రంగం కోలుకుంటోంది. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు తొలగించడంతో ఎయిర్‌లైన్స్‌ వ్యాపారం తిరిగి కళకళలాడ్డం మొదలైంది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి తమ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించబోతోంది జెట్‌ ఎయిర్‌వేస్‌. కొన్ని పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గతంలో జెట్‌లో పనిచేసి మానేసిన వారు కూడా ఉద్యోగాల్లో చేరాలని ప్రోత్సహిస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ జనరల్‌ మేనేజర్‌ (రిటైల్‌, కార్పొరేట్‌ సేల్స్‌) , హెడ్‌ గ్రౌండ్‌ ఆపరేషన్‌ ట్రెయినింగ్‌, డీజీఆర్‌ ఇన్‌స్ర్టక్టర్‌, ప్యాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌ (ఐపీఎస్‌ఎస్‌) ట్రైనర్‌తో పాటు వివిధ హోదాల్లో రిక్రూట్‌మెంట్‌ జరుపుతోంది. 

జనరల్‌ మేనేజర్‌ రిటైల్‌, కార్పొరేట్‌ సేల్స్‌ విషయానికి వస్తే పది నుంచి 15 సంవత్సరాల అనుభవం ట్రావెల్‌ ఇండస్ర్టీలో ఉండాలని పేర్కొంది. ఎంపిక చేసిన అభ్యర్థులు క్లయింట్లను గుర్తించిన తమ వాణిజ్య భాగస్వాములుగా చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. వాణిజ్య పరమైన సంబంధాలు నిర్వహించడంలో బాగా అనుభవం కలిగి ఉండాల్సి వస్తుంది. దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టు గ్రాడ్యుయేట్స్‌ అయ్యి ఉండాలి. మార్కెటింగ్‌, లేదా సేల్స్‌లో ఎంబీఏ అభ్యర్థికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. హెడ్‌ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌ ట్రెయినింగ్‌ అభ్యర్థి విషయానికి వస్తే అభ్యర్థికి కనీసం డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. ఈ రంగంలో పది సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

ఇక డీజీఆర్‌ ఇన్‌స్ర్టక్టర్‌ అభ్యర్థి విషయానికి వస్తే అభ్యర్థి తప్పకుండా డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) నుంచి సర్టిఫై పొందిన డేంజరస్‌ గ్రౌండ్‌ ఇన్స్‌స్ర్టక్టర్‌గా అనుమతి పొంది ఉండాలి. అయితే ఆ అభ్యర్థికి ఈ రంగంలో కనీసం ఐదు సంవత్సరాల అనుభవం ఉండాల్సి ఉంటుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ తన ప్రకటనలో పేర్కొంది. 

ఇక ప్యాసింజర్‌ సర్వీసెస్‌ సిస్టమ్‌ (పీఎస్‌ఎస్‌) ట్రైనర్‌ విషయానికి వస్తే అర్హత కలిగిన అభ్యర్థి విషయానికి వస్తే ఈ రంగంలో కనీసం నాలుగు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. పీఎస్‌ఎస్‌ సిస్టమ్‌ వినియోగించడంలో ఆ అభ్యర్థికి నాలుగు  సంవత్సరాల అనుభం కలిగి ఉండాలి. ఆ అభ్యర్థి కనీసం బ్యాచిలర్‌ డిగ్రీ కలిగి ఉండాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ పేర్కొంది. వీరితో పాటు పాటు జెట్‌ ఎయిర్‌వేస్‌ హై ఫెర్పార్మింగ్‌ సేల్స్‌ ప్రొఫెషనల్స్‌ను కూడా రిక్రూట్‌ చేసుకుంటోంది. ఈ అభ్యర్థులు జెట్‌ ఎయిర్‌వేస్‌ అమ్మకాలు మరింత పెరిగేలా కృషి చేయాల్సి ఉంటుంది. 

పైన తెలిపిన అంశాలకు మీరు అర్హత కలిగి ఉంటే వెంటనే మీకు అర్హత కలిగిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆహ్వానిస్తోంది.

 

మరిన్ని చదువు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 



2022-06-01  Education Desk