collapse
...
Home / బిజినెస్ / ఫైనాన్స్ / పెరిగిన ఎస్‌బీఐ హోంలోన్స్‌ వడ్డీరేట్లు... - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telu...

పెరిగిన ఎస్‌బీఐ హోంలోన్స్‌ వడ్డీరేట్లు...

2022-06-01  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

sbi-aa
 

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి దాదాపు సగం మైలురాయిని దాటిపోయాం.. ప్రస్తుతం జూన్‌ నెలలో అడుగుపెట్టాం. అయితే ఈ నెలలో  ఫైనాన్షియల్‌ అంశాల్లో ఐదు మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అవి ఏమిటంటే గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ నుంచి ఎస్‌బీఐ హోంలోన్‌ వడ్డీరేట్లు పెరగబోతున్నాయి. ఆర్థిక పరమైన కొన్ని మార్పుల ప్రభావం ఎంతో కొంత మీపై కూడా ఉంటుంది. అవి ఏమిటో ఒక లుక్కేద్దాం. 
కొత్త నెల జూన్‌లోకి అడుగు పెట్టాం. వాతావరణంలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎండకాలం పోయి వర్షాకాలంలో అడుగుపెట్టబోతున్నాం. పిల్లల సెలవులు పూర్తయి కొత్తగా స్కూళ్లు ప్రారంభమవుతాయి. మధ్య తరగతి ప్రజలకు స్కూళ్ల పిల్లల ఫీజులు, యూనిఫారం, షూస్‌ నుంచి అంతా భారమే.దీనికి తగ్గట్టు ఈ నెల నుంచి ఆర్థికపరమైన కొన్నిమార్పులు జరగబోతున్నాయి. అవి కూడా జేబుపై భారం పడబోతున్నాయి. అవి ఇలా ఉన్నాయి.

 1. ఇండియాపోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకు .. ఆధార్‌తో లింకు ఉన్న ఖాతాల ద్వారా లావాదేవీలు జరిపితే దానికి చార్జిలు విధించబోతున్నాయి:  ఇండియాపోస్ట్‌  పే మెంట్‌ బ్యాంకులు (ఐపీపీబీ) ఈ నెల 15 నుంచి ఆధార్‌లో లింకు ఉన్న పేమెంట్‌లపై చార్జీలు విధిస్తాయి. మొదటి మూడు ఆధార్‌ లింక్‌ పేమంట్‌ లావాదేవీలు వాటిలో నగదు విత్‌డ్రాయల్స్‌,  లేదా క్యాష్‌ డిపాజిట్‌, లేదా మినీస్టేట్‌మెంట్‌లకు మాత్రం  ఉచితం. అయితే మూడు లావాదేవీలు పూర్తయిన తర్వాత ప్రతి క్యాష్‌ విత్‌ డ్రాయల్స్‌, క్యాష్‌ డిపాజిట్‌పై రూ.20 ఫ్లస్‌ జీఎస్టి అదనంగా చార్జీ చేస్తారు. అదే విధంగా మినీస్టేట్‌మెంట్‌ కావాలనుకుంటే రూ.5 ఫ్లస్‌ జీఎస్టి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 

2. ధర్డ్‌పార్టీ మోటార్‌ ఇన్యూరెన్స్‌ ప్రీమియం : వార్షిక థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ రేటు ఉదాహరణకు ప్రైవేట్‌ కారును తీసుకుంటే  1000 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ కార్లకు  రూ.2,094కు సవరించారు. అది 2019-20లో రూ.2,072 ఉండేది. అదే థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ ప్రైవేట్‌ కార్ల విషయానికి వస్తే 1000 సీసీ నుంచి 1500 సీసీ ఇంజిన్‌ సామర్థ్యం కలిగిన కార్ల విషయానికి వస్తే రూ.3,416 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో అంటే 2019-20లో రూ.3,221గా ఉండేది. అలాగే ప్రీమియం ప్రైవేట్‌ కార్లు అంటే ఇంజిన్‌ సామర్థ్యం 1500 సీసీ దాని కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన కార్ల విషయానికి వస్తే వరుసగా రూ.7,897కి సవరించారు. అంతకు ముందు రూ.7,890గా ఉండేది. 

3. ఎస్‌బీఐ హోంలోన్‌ : ప్రభుత్వ రంగానికి చెందిన ఎస్‌బీఐ గృహ రుణాలపై 40 బేసిస్‌ పాయింట్లు పెంచింది. గతంలో 6.65 శాతం ఉన్న వడ్డీరేటు ప్రస్తుతం 7.05 శాతానికి సవరించింది. సవరించిన వడ్డీరేట్లు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. 

4. యాక్సిస్‌ బ్యాంకు పొదుపు ఖాతా చార్జీలు : ప్రైవేట్‌ బ్యాంకు యాక్సిస్‌ సరాసరి నెల వారి బ్యాలెన్స్‌ పొదుపు ఖాతాతో పాటు శాలరీ ప్రోగ్రాంకు సెమి అర్బన్‌..అర్బన్‌ ప్రాంతాల్లో రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది.లేదా రూ.1 లక్షల టెర్మ్‌ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.  అలాగే కనీస డిపాజిట్లు లిబర్టీ సేవింగ్స్‌ ఖాతాలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచింది.  లేదా రూ.25,000 వ్యయం చేయాల్సి ఉంటుందని యాక్సిస్‌ బ్యాంకు ఒక ప్రకటనలో పేర్కొంది. 

5. గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ : సెకండ్‌ ఫేజ్‌ కంపల్సరీ గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ నేటి నుంచి అమల్లోకి వస్తోంది. బంగారు ఆభరణాల తయారీపై తప్పనిసరిగా హాల్‌మార్కింగ్‌ అమల్లోకి వచ్చింది. దేశంగా వ్యాప్తంగా 256 జిల్లాల్లో ప్రస్తుతం తప్పనిసరిగా అమలు జరుగుతోంది. తాజాగా మరో 32 జిల్లాలు వీటికి జత అయ్యాయి.  దేశవ్యాప్తంగా మొత్తం 288 జిల్లాలో ప్రస్తుతం అమల్లోకి వచ్చాయి. అయితే ఇవి బంగారం ఆభరణాలు అవి 14,18,20,22,23 మరియు 24 కెరెట్‌ వాటికి అమల్లోకి వస్తాయి. 

అమల్లోకి వచ్చేవి : ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా హోం లోన్స్‌ వడ్డీరేట్లు,  యాక్సిస్‌ బ్యాంకు కనీస పొదుపు బ్యాలెన్స్‌, ఇండియా పోస్ట్‌ పేమేంట్‌ బ్యాంకు క్లయింట్స్‌, వాహన యజమానులకు పైన తెలిపని అంశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి.


 

మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి



2022-06-01  Business Desk