collapse
...
Home / ఆరోగ్యం / కేన్సర్ / కాఫీ తాగడం కేన్సర్‌కి దారితీస్తుందా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu |...

కాఫీ తాగడం కేన్సర్‌కి దారితీస్తుందా?

2022-06-01  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

coffee aaa
 

ఇన్ని శతాబ్దాలుగా కాపీని ప్రపంచం ఆస్వాదిస్తూనే ఉంది. సేవిస్తూనే ఉంది. దాని అద్భుతమైన్ ప్లేవర్‌ను రుచి చూస్తూనే ఉంది. ఉదయాన్నే నిద్రలేస్తూనే కప్పు కాపీని రుచిచూడని వారెవ్వరు. బిజీబిజీగా రోజు గడిచిపోతున్న సమయంలో అలసట నుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి కప్పు కాపీని గ్రోలని వారెవ్వరు. వర్షం కురుస్తున్న రోజు శరీరాన్ని వెచ్చబర్చుకోవడానకి కాపీని స్వీకరించని వారెవ్వరు. మన ప్రపంచం వందల సంవత్సరాలుగా కాఫీని ఆస్వాదిస్తూనే ఉంది.

కానీ కాపీ వినియోగం కేన్సర్ కి దారితీస్తోందా అని ఇప్పుడు కొంతమంది సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీనిలో వాస్తవమేంటో చూద్దాం మరి.

అనేక రకాల రసాయనాల మిశ్రమమే కాఫీ. వీటిలో చాలా ముఖ్యమైనది కెఫీన్. క్లోరోజెనిక్ యాసిడ్, పుట్రెసైన్ తదితర రసాయనాలు కూడా కాఫీలో ఉంటున్నాయి. కాఫీతయారీలో అనేక రసాయనాలు, ఫెర్టిలైజర్స్, కీటకనాశినులు వంటివి ఎన్నో కలుస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక కప్పు కాఫీ అనేక కెమికల్స్‌ పవర్ హౌస్ అన్నమాట.

కాబట్టే చాలామంది కాఫీ అనేది కేన్సర్‌కి దారితీస్తుందా అని నన్ను అడుగుతుంటారు. మరీ అతిగా తాగినా, తిన్నా ప్రాణాంతకమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని సాంప్రదాయ విజ్ఞానం మనకు చెబుతుంది. అంటే ఏది అతిగా తిన్నా అది రోగాలను కొని తెస్తుంది. మరి కాఫీ విషయంలోనే ఈ ప్రచారం ఎందుకు.

అందుకే ఈ విషయాన్ని నిర్ధారించడానికి ఇటీవలే ఒక అధ్యయనం జరిగింది. కాఫీతాగితే సాధారణంగా కేన్సర్ రాదని ఈ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కాఫీ తాగితే మూత్ర నాళ కేన్సర్ వస్తుందని, లంగ్ కేన్సర్ వస్తుందని ఇతర అధ్యయనాలు కొన్ని గతంలో సూచించాయి కానీ దీన్ని నిరూపించే ఖచ్చితమైన ఆధారాలు లేవు.

అయితే కలరెక్టల్ కేన్సర్, లివర్ కేన్సర్, బ్రెస్ట్ కేన్సర్ వంటి వ్యాధుల విషయంలో కాఫీ సేవనం ఒక రక్షణాత్మకమైన ప్రభావాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ అద్యయనాలు ఏవీ పరిపూర్ణ సత్యాలు కాదని గుర్తించాలి. కాపీ తాగడం దేహాన్ని కాపాడుతుందా లేదా వ్యాధులను కొని తెస్తుందా అనేది నిరూపించాలంటే చాలా అధ్యయనాలు అవసరం. పైగా కాఫీలో ఉంటున్న పోలీఫెనోల్స్ కేన్సర్‌ని అడ్డుకోవడానికి ఉపకరిస్తుందని హైపర్ టెన్షన్, హార్ట్ డిసీజ్ వంటి వాటిని కూడా ఇది నిరోధిస్తుందని కొందరు చెబుతున్నారు. కొంతమందయితే కాఫీలో ఉన్న అక్రిలామైడ్ వల్ల లంగ్, బ్లాడర్, బ్లడ్ కేన్సర్ వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు.

అయితే పూర్వం ఈ అంశంపై జరిగిన అధ్యయనాలన్నింటినీ కలిపి 2020లో ఒక మెటా అనాలసిస్‌ని చేశారు. ప్రధానంగా కేన్సర్‌కి, కాఫీకి మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే అంశంపై పరిశీలన జరిపారు. మొత్తం 36 రీసెర్చ్ పత్రాలను అధ్యయనం చేసిన పిమ్మట, పొట్ట కేన్సర్, లంగ్ కేన్సర్, మెలనోమస్, ఓరల్ కేన్సర్, ఫారింజియల్ కేన్సర్లు వంటి వాటిపై కాఫీ ఒక రక్షణాత్మక కవచంగా ఉంటుందని తేల్చి చెప్పారు. కేన్సర్ రిస్కును కాఫీ తగ్గిస్తుందంటూనే  లివర్ కేన్సర్, ఎండో మెట్రియల్ కేన్సర్లపై కాఫీ వినియోగం ప్రభావంపై మరింతగా పరిశోధనలు చేయవలసి ఉంటుందని వీరుచెప్పారు

చివరగా కాఫీకి, కేన్సర్‌కి మధ్య జరుగుతున్న వివాదానికి పుల్ స్టాప్ పెడుతూ, నా వద్దకు వచ్చే రోగులకు నేను చెప్పేది ఒకటే. కాఫీ సేఫ్, కాపీతో ఎలాంటి ప్రమాదం లేదు. మన పూర్వీకులు ఎప్పటినుంచో కాఫీని సేవిస్తూ వచ్చారు. కాఫీని నేటి తరంవారు తాగుతూనే ఉన్నారు. భవష్యత్ తరాలు కూడా కాపీని తాగుతాయి. అయితే ఏ పదార్థాన్నయినా అతిగా ఆరగిస్తే, సేవిస్తే ప్రమాదకరమని మనందరికీ తెలిసిందే. కాబట్టి చిన్న చిన్న క్వాంటటీలతో కాపీ తాగితే ఏ హానీ జరగదని నా హామీ. పలానివి తింటే ఫలానా జబ్బులు, వ్యాధులు వస్తాయని చెబుతున్న మాటలు వట్టి హంబగ్ అని భావించండి. కాఫీ సేవనంలోని దుష్ప్రభావాలగురించి వచ్చే ఆర్టికల్స్ ని మరీ ఎక్కువగా చదవి బెంగ పెట్టుకోకండి. వాటిలో నెగటివ్ ప్రచారం తప్పితే మరేమీ లేదు.

ఇప్పుడు ఒక నైస్ కప్పు కాపీతో మీ పూట గడిపేయండి. చాలు.

 

మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 



2022-06-01  Health Desk