collapse
...
Home / తెలంగాణ / ఐటీ పరిశ్రమ అభివృద్ధి అద్భుతం: కేటీఆర్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

ఐటీ పరిశ్రమ అభివృద్ధి అద్భుతం: కేటీఆర్

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ktr-6
 


తెలంగాణలో ఐటీ రంగం అంచనాలకు మించిన అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కరోనా పరిస్థితులను సైతం ఎదిరించి ఈ రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించగలిగామని వెల్లడించారు. హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా కార్యాలయంలో 2021-22 సంవత్సరానికి గాను వార్షిక నివేదికను విడుదల చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా గత ఎనిమిదేళ్ల కాలంలో ఊహించని అభివృద్ధి ఈ రంగంలో జరిగిందన్నారు. దీని వల్ల ఉద్యోగాల సంఖ్య విపరీతంగా పెరిగిందని, గత ఏడాదిలో దేశవ్యాప్తంగా 4.5 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగం ద్వారా లభిస్తే దీనిలో ఒక్క హైదరాబాద్ నుంచే లక్ష ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. రాజధాని నుంచి ఐటీ ఎగుమతులు కూడా విపరీతంగా పెరిగాయి అన్నారు. 2021-22 సంవత్సరానికి గాను అయితే ఎగుమతుల విలువ 1.83 లక్షల కోట్లు అని వెల్లడించారు. 2035 నాటికి ఈ సంఖ్యను 2.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఐటి అనుబంధ పరిశ్రమల ఎగుమతుల్లో గత ఏడాది 26.14 శాతం వృద్ధిరేటును సాధించామని ఆయన వివరించారు. జాతీయ సగటు కంటే తొమ్మిది శాతం అదనంగా అభివృద్ధి సాధించినట్లు తెలిపారు.

మరింత విస్తరణ.. 

ఐటీ రంగాన్ని కేవలం రాజధాని కే పరిమితం చేయకుండా ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇప్పటికే వరంగల్ ఖమ్మం జిల్లాల్లో టెక్ మహేంద్ర, జెన్ ప్యాక్, టెక్వెల్ లాంటి కంపెనీలు అడుగు పెట్టాయని, త్వరలో కరీంనగర్,  మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ లాంటి జిల్లాలలో కూడా పరిశ్రమలు విస్తరించనున్నట్లు వెల్లడించారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాలలో 50000 ఐటీ ఉద్యోగాలను సృష్టించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. మరోవైపు రాజధానిలో కూడా అన్ని వైపులా ఈ పరిశ్రమలు విస్తరిస్తామని, ఇప్పటికే కొంపల్లిలో గేట్వే, ఉప్పల్లో జెన్ పాక్ పరిశ్రమలు విస్తరించాయని గుర్తు చేశారు. పెరుగుతున్న సాంకేతిక విజ్ఞానం సామాన్యుడికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఐటీ రంగం అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చేసుకోవడం జరిగిందన్నారు. 2014 కు ముందు మూడు లక్షల పైచిలుకు ఉద్యోగాలు మాత్రమే ఐటీ రంగంలో ఉండేవని, గత ఎనిమిదేళ్ల కాలంలో ఇది 23 లక్షలు దాటిందని వెల్లడించారు. ఐటీ రంగం ప్రగతిలో దేశ సగటు 17 శాతం కాగా, తెలంగాణ సగటు 26.14 శాతం  ఉందని, ఇది అందరం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా కృషి చేసిన ఐటి బృందాలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 



2022-06-01  News Desk