collapse
...
Home / తెలంగాణ / ఆసరా పింఛన్లు ఆలస్యం..తెలంగాణలో నిధుల్లేవా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Te...

ఆసరా పింఛన్లు ఆలస్యం..తెలంగాణలో నిధుల్లేవా?

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

pensions
Courtesy:Twitter/@iAnjaliz 

 

తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో అత్యధిక వేగంతో ప్రగతి పథంలో సాగిపోతున్న రాష్ట్రంగా పేరు సంపాదించుకుంది. కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. అంతా బాగానే ఉంది. కానీ ఆసరా పింఛన్లకు మాత్రం నిధులు లేవు. ఇది రాష్ట్రంలోని 39 లక్షల మంది ఆసరా లబ్దిదారులకు జీవన్మరణ సమస్యగా తయారైంది. ఇప్పటి వరకు వారికి మే నెలకు సంబంధించిన  పింఛన్ అందలేదు. జూన్ నెల పింఛన్ విషయంలో కూడా జాప్యం తప్పదనే మాట వినిపిస్తోంది. నిజానికి ఈ పథకాన్ని ఆవిష్కరించిన ఘనత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వానికే చెందుతుంది. కానీ, ప్రతి నెలా ఈ పథకం కింద రూ. 800 కోట్లు అవసరమవుతాయి. ఈ పథకం కింద అన్ని వర్గాలకు, అన్ని కులాలకు చెందిన నిరు పేదలకు నెలనెలా పింఛన్ లభిస్తుంది. కానీ ఇప్పుడు వారికి ఆ కొద్ది పాటి ఆసరా కూడా అందనంత దూరంలోనే ఉండిపోయింది. ముఖ్యంగా 65 సంవత్సరాల వయసు దాటిన వారికి, ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు, వితంతువులకు, హెచ్ఐవి-పాజిటివ్ రోగులకు, బీడీ వర్కర్లకు, పైలేరియాతో బాధ పడుతున్న వారికి, గీతపనివారికి, వీవర్లకు పెన్షన్ రూపంలో రూ. 2016 లను మంజూరు చేస్తారు. ప్రత్యేక అవసరాలున్న వికలాంగులకు కూడా ఈ పథకం కింద నెలకు రూ. 3,016 ల పింఛన్ అంటే వెయ్యి రూపాయలు అధికంగా మంజూరు చేస్తారు. అయితే ఈ పథకానికి అవసరమైన నిధులను ఏకకాలంలో బడ్జెట్ కేటాయింపుల్లో విడుదల చేయడం లేదు. ఇదివరకు అలా బడ్జెట్ కేటాయించినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈ పద్ధతిని మార్చి వారానికోసారి లేదా పదిరోజులకోసారి నిధులను విడతలవారీగా విడుదల చేస్తున్న కారణంగా లబ్ధిదారులకు పింఛన్ అందడంలో జాప్యానికి కారణం అయింది.  

ఈ విషయాన్ని గ్రామీణ పేదరికం నిర్మూలన సొసైటీ (సెర్ప్) డైరెక్టర్ జి. వెంకట్ కూడా అంగీకరించారు. బడ్జెట్ విడుదల తరువాత చెల్లింపులు సాధ్యం అవుతోంది. మే 31 వరకు కూడా పింఛన్ అందని వారికి జూన్ 2 నాటికి అందించాలని గడువు నిర్దేశించుకున్నారు. ప్రతి ఒక్కరికి అందించేందుకే ప్రయత్నిస్తున్నాం అని ఆయన తెలిపారు. అయితే చాలా మంది తమకు ఆసరా పింఛన్ ఇంకా అందలేదని ఫిర్యాదు చేస్తున్నారు. వారి జీవితాలు సాఫీగా సాగాలంటే ఈ పింఛన్ మొత్తమే ఏకైక ఆధారం. అందువల్ల ఈ జాప్యం వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నది. సాధారణంగా ప్రతి నెలా మొదటి వారమే స్థానిక పోస్టాఫీసు ద్వారా పింఛన్ వచ్చేది. అంటున్నారు నల్గొండ జిల్లాకు చెందిన నాగమణి చిట్టలూరి. ఇతరుల అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేస్తే, గత మూడు నెలలుగా అంటే మార్చి నుంచి సకాలంలో పెన్షన్ అందడం లేదన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మార్చిలో వారం ఆలస్యంగానూ, ఏప్రిల్ లో మూడు వారాలు ఆలస్యమైంది. ఇక మే విషయానికి వస్తే ఇప్పటివరకు అందనే లేదని కొందరు చెబుతున్నారు. ఆసరా పెన్షన్ అందుకుంటున్న వారిలో సగం మందికి పోస్టాఫీసుల ద్వారా బయో మెట్రిక్ విధానం ద్వారా చేతికి అందేది. మిగిలిన వారికి వారి బ్యాంకు ఖాతాలలోకి జమ అవుతుండేది. ఇప్పుడు మంజురు అయిన వారికే సకాలంలో ఆసరా పింఛన్ అందడం లేదు. కానీ మరో లక్ష దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఇదికాక ఆసరా మంజూరుకు వయో పరిమితిని 57 – 65 సంవత్సరాల మధ్యకు కుదిస్తామని 2018 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు విషయం అంతుబట్టని రహస్యంలా మిగిలిపోయింది.   

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 


 



2022-06-01  News Desk