collapse
...
Home / చదువు / ఆరో ప్ర‌య‌త్నంలో అరుణ‌ విజయం - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Te...

ఆరో ప్ర‌య‌త్నంలో అరుణ‌ విజయం

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

aruna
 

త‌న చ‌దువు కోసం తండ్రి అప్పులు చేసి ఉన్న‌త స్ధానంలో నిల‌పాల‌ని భావించాడు... అయితే ఊహించ‌ని విధంగా తండ్రి చేసిన అప్పులు తీర్చేమార్గం లేక‌ అర్ధంతరంగా జీవితాన్నిముగించ‌డంతో ఆమె వెన్ను మీద విన్నువిరిగి ప‌డింది. అయినా తండ్రి ఆశ‌యాన్ని నెర‌వేర్చి, సివిల్స్‌లో ర్యాంక్ సాధించి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఆమె   308 ర్యాంక్ సాధించిన అరుణ‌. ఆమె గురించి మ‌రిన్ని వివ‌రాల‌లోకి వెళితే...  

కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబంలో పుట్టిన అరుణ ఎమ్ ఐదుగురు తోబుట్టువులలో మూడవది. సివిల్ సర్వీసెస్ సాధించ‌డం అరుణ   మొదటి లక్ష్యం కాదు. కానీ    ఆమె తొలుత ఇంజినీరింగ్ డిగ్రీ సాధించి  ఏదో శాఖ‌లో ఇంజ‌నీరుగా సాధారణ ఉద్యోగం పొందాలని అనుకుంది.  

అయితే ఇంట్లో ఖ‌ర్చులు, పిల్ల‌ల చదువుకు సంబంధించి చేసిన అప్పులు తీర్చలేక తండ్రి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టం అరుణ జీవితం అగ‌మ్య‌గోచ‌ర‌మైంది. ఇదంతా 2009లో అరుణ ఇంజ‌నీరింగ్ చ‌దువుతున్న‌ప్ప‌టి మాట‌. అయితే అరుణ త‌న ఇద్దరు అక్కలు,  కుటుంబాన్ని పోషించడానికి ఏదైనా  పని చేయాల‌ను అనుకుంది. త‌న‌ తండ్రి తన కుమార్తెలు స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నట్టే ఇంజ‌నీరింగ్ పూర్తి చేసింది. స‌మాజం ఎన్నోవ్య‌య ప్ర‌య‌స‌ల‌తో త‌న‌ని ఇంజ‌నీర్ చేసింది. నేనుకూడా సమాజానికి తిరిగి ఏదైనా ఇవ్వాలని భావించింది. త‌న‌తండ్రి రైతుగా మంచి పేరు తెచ్చుకున్నా... అప్పులు పాలైపోయిన తీరు, ఆత్మ హ‌త్య చేసుకున్న విధానం ఆమెనిక‌దిలించింది. 

త‌న తండ్రి ముఖంలో  చిరునవ్వును   వెతకాలనుకుంటే...  ఈదేశంలోని రైతుల‌కు  సేవ‌చేయ‌ట‌మే మార్గంగా భావించిఇందుకు ఉన్న‌త స్ధానంలో అధికారిణిగా రావ‌ట‌మే ప్ర‌త్యామ్నాయంగా గుర్తించి యుపిఎస్‌సి ప‌రీక్ష‌ల‌కు నిరంత‌ర సాధ‌న నెరిపింది. తొలి ద‌ఫా ఆమెప్ర‌య‌త్నం విఫ‌ల‌మైనా వెనుదిర‌గ‌లేదు... అలా ఐదు ప‌ర్యాయాలు ఆమెను ఓట‌మి ప‌ల‌క‌రిస్తునే ఉంది. ఓట‌మి గెలుపుకుబాట‌లేస్తుంద‌ని తం్ర‌డి చెప్పిన మాట‌ల్ని ప‌దే ప‌దే గుర్తుచేసుకుంటూ ఐదు విఫల ప్రయత్నాల తర్వాత 2021యుపిఎస్‌సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో అరుణ విజయం అందుకుని  ఆల్ ఇండియా ర్యాంక్ 308ని పొందింది.

త‌ను సాధించిన విజ‌యం కాదు ఏక బిగిన చేసిన ప్ర‌య‌త్నాల‌తో వ‌చ్చి ప‌డింది కాదు అంటుంది అరుణ . తన తండ్రి కలలను నెరవేర్చడానికి తన ప్రణాళికలను మార్చుకున్నాన‌ని చెప్పింది. “యుపిఎస్‌సి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలనే కలలు నాకు లేవు.  ఏదో 10,000 నుండి 15,000 వరకు సంపాదించగలిగే స్వతంత్ర మహిళ కావాలని నేను కోరుకున్నాను . తన కుమార్తెలను స్వతంత్రులను చేయడాన్నిమా నాన్న సవాలుగా తీసుకున్నారు. కానీ నా ఇంజనీరింగ్ కోర్సులో, మాకు చదువు అందించడానికి చేసిన అప్పుల వల్ల నేను మా నాన్నను కోల్పోయాను.   అని అరుణ  కాసింత జీర గొంతుతో వాపోయింది. 

గ‌త‌  రెగ్యులర్ వైఫల్యాల ఫలితంగా  కొంత భయపడుతున్నా,  ఉత్తీర్ణులయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న మాట వేధిస్తున్నా   సమాజానికి సేవ చేయడంఅన్న తండ్రి మాట‌ల్నే త‌ల‌చుకుంటూ చివ‌రి ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు చెప్పింది అరుణ‌. త‌న‌తో పాటు మ‌రింత మందిని సివిల్స్ రాసేందుకు ఎందుకు స‌న్న‌ద్ధం చేయ‌కూడ‌ద‌న్న ప్ర‌శ్న‌తో అరుణ   బెంగుళూరులో  సొంతయుపిఎస్‌సి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్,  స్థాపించింది, అక్కడ  సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకునేలా గ్రామీణ యువకులను ప్రోత్సహించ‌డంతో పాటు ఆ  ఔత్సాహికులకు సహాయం చేయడంపై   దృష్టి సారించింది. నిత్యం అక్క‌డ చేరిన విద్యార్దుల‌తో త‌న గ‌త అనుభ‌వాల‌ను పంచుకుంటూ, నిత్యం సివిల్స్‌కి త‌నుప్రిపేర్ అవుతూ, అంద‌రినీ ప్రేరేపించింది.  చివరకు నా ఆరో ప్రయత్నంలో  విజ‌య తీరాల‌ను అందుకుంది. 

నిజానికి ఆమె వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల‌కు చెందిన వ్య‌క్తి, ఆ రిజ‌ర్వేష‌న్ వినియోగించుకునే అవ‌కాశం ఉన్నా  ఆ కోటాను ఎప్పుడూ ఉపయోగించకూడదని అరుణ నిర్ణయించుకుంది. అన్ రిజర్వ్‌డ్ కేటగిరీ కింద సివిల్స్‌ పరీక్షకు హాజరు కావ‌టం విశేషం. ఇదే విస‌యం ఆమె ముందు ప్ర‌స్తావిస్తే.... నా కంటే వెనుకబడిన ఇతర రైతు పిల్లలు రిజర్వేషన్ల ప్రయోజనాన్ని పొందేందుకు మార్గం సుగమం చేయాలని కోరుకున్నందునే నేను అన్ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరిలో ప‌రీక్ష రాసా... అని చెప్పుకొచ్చింది అరుణ‌.

 “నేను ఏ పదవిని పొందుతాను అన్నది ముఖ్యం కాదు, కానీ ఈ రంగంలో అన్ని పదవులు సమానంగా శక్తివంతమైనవి. ప్రస్తుతం నేను ఈ క్షణాలను నా కుటుంబంతో జరుపుకుంటున్నాను . మా మ‌ధ్య  మా నాన్న లేకున్నా ఆత‌ని కష్టానికి కృతజ్ఞతలు తెలుపుతు ఆయ‌న ఆశ‌యం నెర‌వేర్చేందుకు నిత్యం కృషి చేస్తాన‌ని చెప్పింది అరుణ‌.

క‌ష్టాలెన్ని ఎదురైనా... అయిన వారినే కోల్పోయినా, వ‌రుస ప‌రాజ‌యాలు చుట్టు ముట్టినా.. వెర‌వ‌క చేసే ప్ర‌య‌త్న‌మే నిన్ను విజ‌యాల‌వైపు న‌డిపిస్తుంది అన‌టానికి అరుణ  ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అన‌టంలో సందేహం లేదు. ఆమె ప‌య‌నం అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌నం చేసే స్ఫూర్తి అన‌టం స‌హేతుకం, స‌మ‌ర్ధ‌నీయం.

 2022-06-01  News Desk