collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / పోయిరావలె హస్తినా పురికి.. రేపు ఢిల్లీకి వైఎస్ జగన్.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News |...

పోయిరావలె హస్తినా పురికి.. రేపు ఢిల్లీకి వైఎస్ జగన్..

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

jagan 1-1

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లేందుకు రంగం సిద్ధమైంది. గురువారం సాయంత్రం 4.30 ఆయన ప్రధానమంత్రి మోడీని కలుసుకుంటారు. అదేవిధంగా అమిత్ షా తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చిస్తారు. నిజానికి బుధవారమే ఆయన ఢిల్లీ వెళ్ళవలసి ఉండగా గురువారం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరికిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో సమస్యలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెండింగ్ లో ఉన్న వ్యవహారాలు, నిధుల కేటాయింపు, పోలవరం ప్రాజెక్టుకు క్లియరెన్స్ తదితర అంశాలపై ఆయన చర్చించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అందవలసిన ఫలాలు, తెలంగాణ నుంచి రావలసిన బకాయిలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంబంధిత శాఖల కేంద్రమంత్రులను ఆయన కలుసుకొని ఆంధ్రప్రదేశ్ కు కావలసిన శాఖాపరమైన సహకారాన్ని కోరనున్నట్లు తెలుస్తోంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ పరంగా నిధుల సహకారాన్ని కోరడం ద్వారా ఈ పథకాలను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపైనే ప్రధానంగా మోడీతో చర్చించనున్నట్లు సమాచారం.

ఇది ప్రచారం.. 

రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతుండగా, ఇతర వర్గాలు మాత్రం వేరే ప్రచారం చేస్తున్నాయి. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీకి తన మద్దతు ఇచ్చేందుకు జగన్ ఢిల్లీ వెళుతున్నారని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ సంఖ్యా బలం తక్కువగా ఉండటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాల పై ఆధార పడవలసి వస్తుంది. ఇప్పటికే ఒరిస్సా ప్రభుత్వం నుంచి మద్దతు కోరడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ ను తీసుకుంటే ఇక్కడ వైయస్ జగన్ సంఖ్యాబలం 4.1 శాతం. ఇది తమకు రాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఉపకరిస్తుందని బిజెపి భావిస్తోంది. ఈ నేపథ్యం లేని రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాలను అందుకని, మద్దతు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తన వంతు సహకారాన్ని అందించడమే ఈ ప్రయాణం వెనుక ఉద్దేశమని అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరేలా ఉంటే మద్దతు ఇవ్వడంలో తప్పు లేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఆసక్తికరం.. 

ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజెపికి వ్యతిరేకంగా పావులు కదపడమే కాకుండా, రాష్ట్రపతి అభ్యర్థిని కూడా తమ మద్దతు బీజేపీకి పోటీగా రంగంలోకి దించాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి వైయస్ జగన్ బిజెపి మద్దతు విషయంలో కీలకంగా మారే పోతున్నారని తెలుస్తుంది. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇదే జరిగితే రాష్ట్రపతి ఎన్నికల పోరులో తెలుగు రాష్ట్రాల పాత్ర అత్యంత కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల పాత్ర ఎలా ఉంటుందో వేచి చూడాలి.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 



2022-06-01  News Desk