collapse
...
Home / బిజినెస్ / టెక్నాలజీ / వాట్సాప్ లో మరోసరికొత్త ఫీచర్...త్వరలో కవర్ ఫొటో సౌకర్యం..!! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu N...

వాట్సాప్ లో మరోసరికొత్త ఫీచర్...త్వరలో కవర్ ఫొటో సౌకర్యం..!!

2022-06-02  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

whatsapp-1

ప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను అందిస్తోంది. కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతు యూజర్లను ఆకట్టుకుంటోంది. కొత్తగా మరోఫీచర్ను అందుబాటులోకి తీసుకోస్తోంది వాట్సాప్ .

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అనగానే ఎవరికైనా ముందుగా ఫేస్ బుక్, వాట్సాప్ మాత్రమే గుర్తుకు వస్తాయి. ఇందులో వాట్సాప్ కు  ప్రముఖ మెస్సేజింగ్ యాప్ గా పేరుంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇప్పుడు మరో ఫీచర్ ను అందించేందుకు రెడీ అయ్యింది. ఆ కొత్త ఫీచర్ ఏంటో తెలుసుకుందాం.

ఫేస్ బుక్ లో కవర్ ఫోటో పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. కానీ వాట్సాప్ కు అలాంటి పరిస్థితి లేదు. అందుకే యూజర్లు వాట్సాప్ ప్రొఫైల్ కోసం కవర్ ఫోటోలను సెట్ చేసుకునేందుకు అనుమతించే కొత్త ఫీచర్ పై వాట్సాప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇది విజయవంతమైతే...ఇక నుంచి ప్రొఫైల్ ఫోటోలను కూడా పెట్టుకోవచ్చు. ఫేస్ బుక్ వలే కవర్ ఫోటోను పెట్టుకోవచ్చు. అయితే ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ బిజినెస్ వినియోగదారులకు మాత్రమే పరిమితం కానుంది. వాట్సాప్ WABetaInfoరిపోర్టు ప్రకారం...వాట్సాప్ కేటలాగ్ నిర్వహించేందుకు కొత్త ఫీచర్ పనిచేయనుంది. బిజినెస్ కార్యకలాపాల కోసం కవర్ ఫొటో సెట్ చేసే సామర్ధ్యం భవిష్యత్తులో అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా డెవలప్ దశలోనే ఉంది. బిజినెస్ సెట్టింగ్స్ కింద యూజర్లు అదనపు కెమెరా బటన్ ఆఫ్షన్ ఉంటుంది. ఈ బటన్ ఆధారంగా ప్రొఫైల్ కవర్ ఫోటోలను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే మొబైల్ వెర్షన్ కు పరిమితమైన వీడియో, వాయిస్ కాల్ ఫీచర్లను డెస్క్ టాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.

అలాగే వాట్సాప్ డెస్క్ టాప్ వినియోగదారులక ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చు. కాబట్టి యూజర్లు తమ కవర్ ఫోటోను సెటప్ చేయడానికి డెస్క్ టాప్ లో వాట్సాప్ బిజినెస్ అకౌంట్ వెర్షన్ను ఉపయోగించాల్సి ఉంటుంది. వాట్సాప్ బిజినెస్ యాప్iOSయూజర్లు తమ కవర్ ఫొటోలను సెటప్ చేసుకోవడానికి వాట్సాప్ ఇప్పటికే అనుమతిచ్చింది. వాట్సాప్ బిజినెస్ యాప్ బీటా యూజర్లు ఈ ఫీచర్ను ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సాప్ బిజినెస్ యాప్ డెస్క్ టాప్, ఆండ్రాయిడ్ వెర్షన్ లలో ఇది ఇంకా అందుబాటులోకి రాలేదు. వాట్సాప్ డెస్క్ టాప్ వినియోగదారుల కోసం ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని రిపోర్టులో పేర్కొంది. 

 

మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి



2022-06-02  Business Desk