collapse
...
Home / ఆంధ్రప్రదేశ్ / పోలవరంపై మళ్లీ సెగలు.. అధికార, విపక్షాల వాదనలు.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

పోలవరంపై మళ్లీ సెగలు.. అధికార, విపక్షాల వాదనలు..

2022-06-01  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

polavaram project
పోలవరం ప్రాజెక్టుపై అధికార విపక్షాల నడుమ విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. పోలవరం నిర్మాణం ఆలస్యం కావడానికి గత ప్రభుత్వమే కారణమని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తుంటే.. అధికారంలోకి వచ్చి త్వరగా నిర్మాణం కంప్లీట్ చేయకుండా మీరేం చేస్తున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు గత ప్రభుత్వంపై మరోమారు నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన డయాఫ్రం వాల్‌ ఎవరి చర్య వల్ల దెబ్బతిందో చర్చ జరగాలన్నారు. దీనిపై చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమకు ఆయన సవాల్‌ విసిరారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన ఆయన..  పోలవరం డయా ఫ్రం వాల్‌పై పలు అంశాలను ప్రస్తావించారు. ఇంజినీర్లు, మేధావులు, మీడియాతో డయాఫ్రం వాల్‌పై చర్చ జరగాలని అంబటి అభిప్రాయపడ్డారు.  కాఫర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం వల్లే వరదలకు దెబ్బ తిన్నదన్నారు.  కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ కట్టడం చారిత్రక తప్పిదం అని తేల్చి చెప్పారు. డయా ఫ్రం వాల్‌కు మరమ్మతులు చేయాలా? కొత్తది నిర్మించాలా? అన్న అంశంపై దేశంలో ఉన్న మేధావులు తలలు పట్టుకుంటున్నారన్నారు. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే పూర్తవుతుందన్న అంబటి.. మొదటి దశ పూర్తి చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.  

*పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం! 
పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని మంత్రి అంబటి మరోసారి తేల్చి చెప్పారు. ముందు డయాఫ్రం వాల్‌ సమస్య తేలాలి.. దాన్ని బట్టే పోలవరం ఎప్పటికి పూర్తి చేయగలమనేది తేలుతుందని స్పష్టం చేశారు. ఈ మొత్తం సమస్యకు చంద్రబాబు మిడిమిడి జ్ఞానమే కారణమని విమర్శించారు. చంద్రబాబు చరిత్రాత్మక తప్పిదాల వల్ల, ఆయన ఒక ప్రణాళిక లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.  పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుతం డయాఫ్రం వాల్‌ దెబ్బతన్నదన్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట పెద్ద పెద్ద గుంతలు పడ్డాయన్నారు. అక్కడ నీళ్లు తోడివేయాలంటే రూ.2,100 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. డ్రెడ్జింగ్‌ చేయాలంటే రూ.800 కోట్లవుతుందని తెలిపారు. నిపుణులు వచ్చి పరిశీలిస్తున్నారని వెల్లడించారు.  వారిచ్చే నివేదిక ఆధారంగానే ముందుకెళ్లాలన్నారు. ఈలోగా చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ఈ వైఫల్యాలు  జగన్‌ ప్రభుత్వం మీద  రుద్దే ప్రయత్నం చేస్తున్నట్లు విమర్శించారు.   

*పోలవరంపై ఏం తేల్చారు?  
పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కారు తీరుపై బీజేపీ జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్ తీవ్ర విమర్శలు చేశారు.  ఏపీలో చెత్త తొలగించాలన్నా.. చిన్నచిన్న రిపేర్లు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధులే దిక్కయ్యాయని చెప్పారు.  అమరావతిలో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్‌.. వైసీపీ  ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రతి ఒక్కరూ ఏటీఎంలానే చూశారన్నారు. ప్రాజెక్టును పూర్తిచేస్తేనే కేంద్రం నిధులిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఇరిగేషన్‌ మంత్రులు పోలవరంపై ఫోకస్‌ పెట్టడం లేదు విమర్శించారు. గతంలో ఈ ప్రాజెక్టుపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చాక ఏం తేల్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.  



2022-06-01  News Desk