collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / కత్తిలాంటి డ్రెస్‌తో అదరగొడుతున్న అనన్య - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

కత్తిలాంటి డ్రెస్‌తో అదరగొడుతున్న అనన్య

2022-06-02  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ananya 1
 

బాలీవుడ్ ముద్దుగుమ్మ లైగర్ భామ అనన్య పాండే అద్భుతమైన ఫ్యాషన్ వాధి. తన ఫ్యాషన్ ఫోటో షూట్స్‌లోని స్నిప్పెట్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో షేర్ చేస్తూ అదిరిపోయే స్టైలిష్‌ స్టేట్‌మెంట్స్‌ ఇచ్చేస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ చిన్నది మిడ్ వీక్‌లో మైండ్ బ్లాక్ అయ్యే అవుట్‌ఫిట్‌ను ధరించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది . బ్రైట్ కలర్ నియాన్ డ్రెస్‌తో ఓ అదిరిపోయే ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
 
నియాన్ గ్రీన్ అవుట్‌ఫిట్‌తో అందాల ఆరబోత:

ananya 3-1
 

తన తాజా ఫోటో షూట్ కోసం అనన్య పాండే నియాన్ గ్రీన్ మిని డ్రెస్‌ను ఎన్నుకుంది. ఆఫ్ షోల్డర్, కార్సెట్‌ డీటైల్స్ తో పార్టీ లుక్ కలిగిన ఈ బాడీకాన్ నియాన్ గ్రీన్ డ్రెస్‌లో తన అందాలను ఆరబోసింది అనన్య. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా పాదాలకు మెరిసేటి బ్లాక్ ఫుట్‌వేర్‌ను వేసుకుని మరింత పార్టీ వైబ్స్‌ను తీసుకువచ్చింది. తన మృదువైన్ చేతి వేళ్లకు వెండి ఉంగరాల, గోర్లకు వైట్ నెయిల్ పెయింట్, చెవులకు స్లీక్ ఎల్లో ఇయర్ స్టడ్స్‌ను పెట్టుకుని అదరగొట్టింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ లక్ష్మీ లెహెర్ అనన్యకు స్టైలిష్ లుక్స్‌ అందించింది. తన కురులను వేవీ కర్ల్స్ వచ్చే విధంగా సైడ్ పాపిట తీసి లూజ్‌గా వదులుకుంది ఈ బ్యూటీ. మేకప్ ఆర్టిస్ట్ స్టెసీ గోమ్స్ సహకారంతో కనురెప్పలకు న్యూడ్ ఐ ష్యాడో, బ్లాక్ ఐ లైనర్, మస్కరాను దిద్దుకుంది. పెదాలకు న్యూడ్ లిప్ షేడ్స్ పెట్టుకుని గ్లామరస్ లుక్స్‌తో సోషల్ మీడియాను జామ్ చేసింది.
 
గ్రీన్ కో-ఆర్డ్ సెట్ తో సమ్మర్ వైబ్స్ :

ananya 2-1
 

ఎవరైనా సరే మారుతున్న ఫ్యాషన్‌కు అనుగుణంగా తన స్టైల్స్‌ను మారుస్తుండాలి. ఈ విషయంలో సెలబ్రిటీలు ముందు వరుసలో ఉంటారు. ఇక నటి అనన్య పాండే లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాషన్ ప్రియులను అలరిస్తుంటింది. ఈ మధ్యనే అనన్య పాండే గ్రీన్ కో-ఆర్డ్ సెట్‌ను ధరించి అందరిని ఫిదా చేసింది. ఈ గ్రీన్ కలర్ అవుట్‌ఫిట్‌తో సమ్మర్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్‌ను ఇచ్చింది. కార్సెట్ స్ట్రాపీ టాప్ వేసుకుని దానికి జోడీగా స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్‌ను ధరించి అదరగొట్టింది. పాదాలకు ట్రాన్స్‌పరెంట్ ఫుట్‌వేర్, మినిమల్ మేకప్‌తో ఎంతో కూల్ గా కనిపించి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేసింది.
 
మోనోక్రోమ్ లుక్‌లో అదరగొడుతోంది:

ananya 4
 

అనన్యపాండే ఫ్యాషన్ దుస్తుల ఎంపికలను బట్టి ఈ నటిని మోనోక్రోమ్ క్వీన్ అని పిలవాల్సిందే. చాక్లెట్ కలర్ బ్రాలెట్ టాప్ కు జోడీగా స్ట్రెయిట్ ఫిట్ ప్యాంట్స్‌ను వేసుకుని దానికి జోడీగా బ్లేజర్‌ను ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. పాదాలకు అవుట్‌ఫిట్ కలర్ హీల్స్ వేసుకుని మెడలో సింపుల్ డైమెట్ నెక్‌పీస్‌ను ధరించి తన క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది.
 
పింక్ అవుట్‌ఫిట్‌లో సో క్యూట్ :

ananya 5
 

ఆ మధ‌్యన అనన్య అందమైన పింక్ అవుట్‌ఫిట్ వేసుకుని అందరిని ఫిదా చేసింది. అందరి వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన అందమైన అవుట్‌ఫిట్‌ ఇది. స్వీట్‌హార్ట్ నెక్‌లైన్ తో వచ్చిన బ్రాలెట్ టాప్ వేసుకుని దానికి జోడీగా వైడ్ లెగ్ బాటమ్స్ ధరించి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది.
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 



2022-06-02  Lifestyle Desk