collapse
...
Home / లైఫ్ స్టైల్ / ఫ్యాషన్ / చీరకట్టుతో కళావతి కనికట్టు - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telug...

చీరకట్టుతో కళావతి కనికట్టు

2022-06-02  Lifestyle Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

keerthi-3

అంతులేని అందం ఆమె సొంతం. ఆ అందానికి ఫ్యాషన్ దుస్తులను జోడించి మరింత వన్నె తీసుకువస్తుంది ఈ సౌత్ బ్యూటీ కీర్తి సురేష్. అందులోనూ ఎత్నిక్ లుక్స్‌తో ఈ సుందరి అందరిని పిచ్చెక్కిస్తుంది. అందమైన చీరకట్టుతో అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది. ఈ నటి వేసవి సీజన్‌లో కూల్ లుక్స్‌తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ఈ చిన్నది గులాబీ రంగు చీరకట్టుతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పెంచుతోంది. ఈ శారీ ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ చీరకట్టు అందాలను చూస్తూ ఆమె ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.

 
పింక్ కలర్ చీరతో ఫిదా చేస్తున్న కీర్తి:

keerthi 2-2
 

పంజాబీ సూట్ అయినా లెహంగా సెట్ అయినా, సాంప్రదాయ చీరకట్టైనా ఆమె కట్టుకుంటే అందరి చూపు ఆమె వైపు తిరగాల్సింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్‌గా ఉంటున్న కీర్తి సురేషన్ సీజన్‌కు తగ్గ ఫ్యాషన్ ఫోటో షూట్‌లను చేస్తూ తన క్రేజ్‌ను పెంచేసుకుంటోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్రొఫైల్‌లో ఈ షోటో షూట్ స్నిప్పెట్స్‌ను షేర్ చేస్తూ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా అందమైన గులాబీ రంగు చీరను కట్టుకుని ఈ సుందరి సందడి చేసింది. నీరూస్ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకున్న ఈ గులాబీ రంగు ప్రింటెడ్ చీరలో కీర్తి అందం మరింత రెట్టింపైంది. ఈ ఫ్లోరల్ ప్రింట్స్ తో వచ్చిన చీరకు జోడీగా స్కూప్ నెక్‌లైన్ కలిగిన స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను వేసుకుంది. ఈ చీరకు తగ్గట్లుగా చెవులకు స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని మినిమల్ మేకప్‌తో తన లుక్‌ను పూర్తి చేసి ఎంతో గ్లామరస్‌గా కనిపించింది ఈ కళావతి.
 
ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్న రఫెల్డ్ చీర:

keerthi 4-2
 

ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతాకు మ్యూజ్‌గా వ్యవహరించిన కీర్తి సురేష్ ఈ మధ్యన చేసిన ఓ ఫోటో షూట్ కోసం అర్పిత వార్డ్ రోబ్ నుంచి రఫెల్ డీటైల్స్ తో సౌకర్యవంతంగా ఉన్న పాస్టెల్ ఎల్లో చీరను ఎంపిక చేసుకుంది. ఈ పసుపు రంగు చీరకు తెలుపు రంగులో మీనియేచర్ ఫ్లోరల్ ప్యాట్రన్స్‌ను ఎంతో వివరంగా అందించారు డిజైనర్. ఈ చీరకు జోడిగా వైట్ రేషమ్ త్రెడ్ డీటైల్స్, మిర్రర్ వర్క్‌ కలిగిన స్లీవ్ లెస్ కార్సెట్ బ్లౌజ్‌ను వేసుకుంది. చెవులకు షీతల్ జవేరీ నుంచి సేకరించిన పసుపు, సిల్వర్ కాంబినేషన్ లో ఉన్న జుంకాలను అలంకరించుకుని తన లుక్‌ను పూర్తి చేసింది. ఈ జుంకాలు కీర్తి ముఖానికి మరింత అందాన్ని తీసుకువచ్చాయి. ఈ భారీ జుంకాలు ఫ్యాషన్ ప్రియులకు ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ స్టైలిస్ట్ అర్చా మెహతా కీర్తి సురేషన్‌కు స్టైలిష్ హెయిర్‌ స్టైల్‌ ను అందించింది. తన కురులను సైడ్ పాపిట తీసి లూజ్ గా వదులకుని ఎంతో క్యూట్ గా కనిపించింది కీర్తి.  
 
లెహంగా సెట్‌తో అదరగొట్టింది:

keerthi 3-2
 

ఫ్యాషన్ డిజైనర్ భూమిక శర్మ డిజైన్ చేసిన అందమైన లెహంగా సెట్‌లో అదరిపోయింది కీర్తి సురేష్. ఇటీవల ఈ బ్యూటిఫుల్ ఎత్నిక్ వేర్ ధరించి చేసిన ఫోటో షూట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఎంబ్రాయిడరీతో వచ్చిన రెడ్ కలర్ బ్లౌజ్‌కు జోడీగా ఫ్లేర్డ్ లెహంగా సెట్‌ను వేసుకుని ఎత్నిక్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది ఈ క్యూటీ. తలకు అందమైన ఎరుపు రంగు ఫ్లోలర్ హెడ్ బాండ్ పెట్టుకుని తన క్యూట్‌నెస్‌తో కుర్రాళ్ల మనసు దోచేసింది.
 
 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 

 


2022-06-02  Lifestyle Desk