collapse
...
Home / క్రీడలు / క్రికెట్ / గంగూలీ ఎందుకీ గందరగోళం...ఆ యాప్ కోసమేనా ఇదంతా..! - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

గంగూలీ ఎందుకీ గందరగోళం...ఆ యాప్ కోసమేనా ఇదంతా..!

2022-06-02  Sports Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

ganguli copy
 

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) అధ్యక్ష పదవికి  త‌ను రాజీనామా చేసిన‌ట్టు వ‌స్తున్న మీడియా క‌థ‌నాల‌ను , భారత మాజీ కెప్టెన్   సౌరవ్‌ గంగూలీ  కొట్టి పారేసారు. ఈ విష‌యాన్ని ధృవీక‌రిస్తూ..  అధ్యక్ష పదవి నుంచి  గంగూలి తప్పుకుంటున్నట్లు వ‌చ్చిన వార్త‌ల‌న్నీ ఊహాగానాలే అని తేల్చి చెప్పారు  బీసీసీఐ కార్యదర్శి జయ్ షా.
వాస్త‌వానికి ఈ గంద‌ర‌గోళ ప‌రిస్థితి ఏర్ప‌డ‌టానికి గంగూలీ చేసిన ఓపోస్టే కార‌ణం అంటున్నారు క్రీడావిశ్లేష‌కులు.  తాను క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్భంగా గంగూలి త‌న  అధికారిక ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు. “క్రికెట్​లోకి 1992లో  అడుగుపెట్టిన త‌న‌ని అభిమానులుఎంత‌గానో ఆద‌రించార‌ని, 2022తో తాను అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉంద‌ని... త‌నకు  క్రికెట్​  ఎంతో ఇచ్చింది ట్వీట్‌లో చెపుతునే త్వ‌రలోనే   . తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్నాన‌ని, ఆ పని ఎంతోమందికి సాయం చేస్తుందని భావిస్తున్నా,  దీనికి వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని దాదా ట్వీట్ చేశారు. 

ఆ ట్వీట్‌ కాస్తా ఎన్నో రకాల గందరగోళాలకు కారణమైంది. అన్ని స‌మాజిక మాద్య‌మాల‌లో వైరల్‌గా మారి, ఎవ‌రికి వారేవారికి న‌చ్చిన తీరుగా ఊహించేసుకుని కామెంట్లు పెట్ట‌డం ఆరంభించారు.   పైగా  2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన దాదా పదవీ కాలం మరో నాలుగు నెలలు ఉంది. దీంతో ఆయన బోర్డు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్న పుకార్లకు కారణమైంది. 

మరో కొత్త మార్గంలో నడవాలని గంగూలీ అనుకుంటున్నాడంటే  అది రాజకీయాల్లోకి దిగనున్నారంటూ  కొందరంటే.... దాదా.. బీజేపీలో చేరి, వెనువెంట‌నే రాజ్య‌స‌భ సీటు అందుకోబోతున్నాడ‌ని మ‌రికొంద‌రు కామెంట్లు చేయ‌టం పుకార్ల‌కు మ‌రింత ప‌దును పెట్టిన‌ట్టు అయ్యింది.  గత నెలలో తన ఇంట్లో హోంమంత్రి అమిత్‌ షాకు ఆతిథ్యమివ్వడం,  బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతను పొగడటం, బిసిసిఐలో బాధ్యతలు స్వీకరించడానికి ముందు, గంగూలి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉండ‌టం వెర‌సి ఆయ‌న ఇక రాజకీయ అరంగేట్రం చేయ‌ట‌మే త‌రువాయి అన్న‌ట్టు పుకార్లకు తావిచ్చాయి. 

ఈ నేపథ్యంలో తన ట్వీట్‌ వెనుక అర్థమేంటో త‌ను ఏం చేయనున్నారనేది గంగూలీనే  స్పష్టత ఇచ్చేందుకు మీడియాముందుకు రావాల్సి వ‌చ్చింది. 30 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న‌కు మద్దతు నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతుత‌ను ట్వీట్‌చేసాన‌ని, త‌ను కొత్తగా ఓ ఎడ్యుకేష‌న్ యాప్‌ని అందుబాటులోకి తీసుకురావాల‌నిఅనుకున్నాన‌ని, ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ జ‌రుగుతోంద‌ని వివ‌రించారు.  ఇది ఎందరికో ఉపయోగపడే ఓ పని అన‌టంలో సందేహంలేద‌ని చెప్పుకొచ్చాడు.త‌ను బీసీసీఐ అధ్యక్ష పదవికి   రాజీనామా చేశాన‌ని వ‌చ్చిన క‌థ‌నాల‌పై స్పందిస్తూ  అలాంటిదేం లేదని తేల్చి చెప్ప‌డంతో  పుకార్ల‌కు తెర‌దించిన‌ట్టు అయ్యింది.

బీసీసీఐ కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌లు కూడా గంగూలీ రాజీనామా వార్తలను ఖండిస్తూ... మేం అందరం దీనిపై దృష్టి సారించాం. ఇండియన్‌ క్రికెట్‌ ప్రయోజనాలను కాపడటానికి ప్రయత్నిస్తున్నాం" అని ఇచ్చారు.  బీసీసీఐకి గంగూలీ రాజీనామా చేశారని, రాజకీయాల్లో చేరుతున్నారని.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం.

 2022-06-02  Sports Desk