collapse
...
Home / తెలంగాణ / హైదరాబాద్ / ఢిల్లీలో బీజేపీ.. గల్లీలో టిఆర్ఎస్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. - 6TV News : Telugu in News | Telugu News | Latest Telu...

ఢిల్లీలో బీజేపీ.. గల్లీలో టిఆర్ఎస్.. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..

2022-06-02  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

trs
Courtesy:Twitter/@kyabataye  


గత ఎనిమిదేళ్ల కాలంగా ప్రతియేటా జరుపుకుంటూ వస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఈ ఏడాది ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతియేటా ఈ వేడుకలను జరపడం సర్వసాధారణం కాగా, ఈసారి ఢిల్లీలో బీజేపీ సర్కార్ అధికారికంగా ఈ వేడుకలను నిర్వహించడం విశేషం. ఢిల్లీలో సాయంత్రం అత్యంత వైభవంగా ఈ వేడుకలను డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో నిర్వహించనున్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్వహణ బాధ్యతలను తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టారు. సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తెలంగాణ వైభవం, కీర్తి, ఉద్యమం తదితర అంశాలపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ గాయకులు హేమచంద్ర, మంగ్లీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

టిఆర్ఎస్ జోరు..  

టిఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఈ వేడుకలను వైభవంగా నిర్వహించారు. వివిధ చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల పోరాటం, త్యాగాల వల్లనే తెలంగాణ కల సాకారమైందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో గత ఎనిమిది ఏళ్ళ కాలంగా ప్రగతి నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు. అన్ని రంగాలలోనూ ఆశించిన దానికన్నా అధికంగా విజయం సాధించగలగడం ప్రతి పౌరుడు గర్వించదగ్గ ఘట్టం అన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్, విద్య, ఆరోగ్య రంగాలలో గుణాత్మక అభివృద్ధిని సాధించగలిగామన్నారు. వివిధ పథకాల ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిరుపేదల కోసం ముందుకు తీసుకు వచ్చామన్నారు. రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి గర్వకారణంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆవిర్భావం ఇలా..   

స్వాతంత్రానికి ముందు నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని స్వతంత్రం వచ్చాక 1956లో రెండు తెలుగు రాష్ట్రాలు ఒక్కటిగా ఉండాలన్న సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ లో విలీనం చేసారు. అయితే ఆంధ్రా పాలకుల తీరు, తెలంగాణ ప్రాంతం పై విమర్శ తదితర ఈ పరిణామాల నేపథ్యంలో 1969-71  ప్రాంతంలో  మర్రి చెన్నారెడ్డి నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. తరువాత కనుమరుగైపోయిన ఈ ఉద్యమం 2001లో తిరిగి ఊపిరి పోసుకుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు పెట్టిన ఈ ఉద్యమానికి విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, వివిధ సంఘాలు, మీడియా ప్రోత్సాహం అందించడంతో 2009లో తెలంగాణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తరువాత అనేక పరిణామాలు, పలు పోరాటాల తర్వాత 2014 జూన్ రెండవ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఉద్యమం ద్వారా తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన పార్టీగా టిఆర్ఎస్, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, తెలంగాణ ఇవ్వడానికి పార్లమెంటులో సహకరించిన పార్టీగా బిజెపి ప్రస్తుతం ఇక్కడ కీలక పార్టీలు గా ఉన్నాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి   
 



2022-06-02  News Desk