collapse
...
Home / బిజినెస్ / టెలికామ్ / టిక్ టాక్ మళ్లీ రాబోతుందా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Telug...

టిక్ టాక్ మళ్లీ రాబోతుందా?

2022-06-02  Business Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

tiktok
 

భారతీయ మార్కెట్లోకి బైట్‌ డాన్స్‌ తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. కంపెనీ చేతిలో బాగా ప్రసిద్ది చెందిన టిక్‌ టాక్‌ ప్లాట్‌పాం ఉన్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాల క్రితం విభిన్న కారణాల వల్ల దేశం నుంచి నిష్క్రమించాల్సి  వచ్చింది. తాజాగా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం బైట్‌ డాన్స్‌ భారత్‌లో భాగస్వామ్యం ద్వారా తిరిగి  ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. కొత్త ఉద్యోగులతో పాటు పాత ఉద్యోగులను తీసుకుని కంపెనీని మరింత అభివృద్ది పథంలో తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉంది.

ఇక బైట్‌ డాన్స్‌ విషయానికి వస్తే దీని యాప్‌ టిక్‌ టాక్‌ను భారత్‌ ప్రభుత్వం 2020లో నిషేధించింది.  ఇక్కడి డేటాను చైనాలో వినియోగిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ యాప్‌ను రద్దు చేసింది. బైట్‌ డాన్స్‌ హిరానందానీ గ్రూపుతో ప్రస్తుతం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే హీరానందానీకి డేటా సెంటర్‌ వ్యాపారం  యోట్టా ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ సొల్యూషన్స్‌ ఉంది.  కాగా టిక్‌టాక్‌ మాతృ సంస్థ స్థానిక సొల్యూషన్‌తో జట్టుకట్టి తమ వ్యాపారాన్ని తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీని అర్థం ఏమిటంటే టిక్‌టాక్‌ రెండేళ్ల విరామం తర్వాత తిరిగి భారత్‌ మార్కెట్లో ప్రవేశించబోతోందని స్పష్టం మవుతోంది. 

ప్రభుత్వ ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి చర్చలు అధికారిక స్తాయిలోకి రాలేదని, అయితే దీన్ని కేంద్రప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోందని.. కొత్తగా భారత్‌లోకి ఎంట్రీ కావాలనుకుంటే ప్రభుత్వం అనుమతులు పొందాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 
భారత్‌లోకి తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే బైట్‌ డ్యాన్స్‌ భాగస్వామ్యం పద్దతిలో రావడమే మేలని ఆయన  సూచించారు. దీంతో కంపెనీ స్థానిక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. స్థానికంగా సేకరించిన డేటా స్థానికంగానే వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.  బైట్‌ డాన్స్‌ క్రాఫ్టాన్‌ స్ర్టాటజీని అమలు చేయాల్సి ఉంటుంది. పబ్‌జి మోబైల్‌ తరహాలో ఉంటుందని ఆయన న్నారు. అయితే దీనికి పేరు విధానం తదితరాలు ప్రత్యేకంగా ఉంటాయి. మరో అంశం ఏమిటంటే బైట్‌ డాన్స్‌ టిక్‌ టాక్‌ పేరును కూడా మార్చాల్సి ఉంటుందని ప్రభుత్వ ఉన్నతాధికారి వివరించారు. 

బైట్‌ డాన్స్‌ తిరిగి భారత్‌ మార్కెట్లో వస్తోందనే సరికి మార్కెట్లో కొత్త రకం ఉత్సాహం  వచ్చింది. కాగా కంపెనీ స్థానికులకు ఉద్యోగాలు కల్పించాల్సి ఉంటుంది. కొత్త కంపెనీని ప్రారంభిచాలనుకుంటే తమ వ్యాపార కార్యకలాపాల కోసం కొత్త సిబ్బందిని అది స్థానికులను ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే టిక్‌టాక్‌ అత్యంత కీలక పాత్ర పోషించి స్థానిక ప్లాట్‌ఫాంలు ఉదాహరణకు చింగారీ, ఎంఎక్స్‌ టాకా టాక్‌తో పాటు రీల్స్‌ ఆన్‌ ఇన్‌స్టాగ్రాం పుంజుకోవడానికి  సహకరించాయని మరచిపోవద్దని ఆయన తెలిపారు. టిక్‌టాక్‌ను నిషేధించిన వెంటనే ఈ లోకల్‌ ఫ్లాట్‌ఫాంలకు డిమాండ్‌ పెరిగింది. కాగా టిక్‌టాక్‌ తిరిగి భారత్‌లో వస్తే..కొత్త కొత్తస్కీంలతో యూజర్లను ఆకట్టుకుంటుంది. అలాగే యూజర్లు కూడా సంతోషిస్తారనడంతో ఎలాంటి సందేహం లేదు.


 మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి



2022-06-02  Business Desk