collapse
...
Home / ఆరోగ్యం / హెచ్ఐవి డ్రగ్‌తో మెమరీ లాస్ - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu | News Tel...

హెచ్ఐవి డ్రగ్‌తో మెమరీ లాస్

2022-06-02  Health Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

hiv pills
 

కాలిఫోర్నియా యూనివర్శిటీ - లాస్ ఏంజెల్స్ హెల్త్ సైన్సెస్ జరిపిన కొత్త అధ్యయనం ప్రకారం మన మెదళ్లు విడివిడి జ్ఞాపకాలను కాకుండాక కొన్ని జ్ఞాపకాల గ్రూప్ స్టోర్‌ని నమోదు చేస్తాయని తెలిపింది. అందుచేత, ఒక నిర్దిష్ట మెమొరీని రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అది ఇతర జ్ఞాపకాలను కూడా రీకాల్ చేయగల విడి మెమరీని ప్రేరేపించదగలదని వీరు చెబుతున్నారు. ఈ క్రమంలో రిలేటెడ్ మెమరీస్‌ని లింక్ చేయగలిగే సామర్థ్యాన్ని  మనం వయసు పెరిగేకోద్దీ కోల్పోతూ వస్తామని ఈ అధ్యయనం తెలిపింది.

అంతర్జాతీయ మీడియా చెబుతున్న దాని ప్రకారం, ఈ  పరిశోధకులు మెమెరీ అనుసంధానం వెనుక ఉన్న కీలకమైన మాలిక్యులర్ మెకానిజంని కనుగొన్నారు. మధ్య వయస్సు కల ఎలుకలో మెదడు పనితీరును పునరుద్దరించే మార్గాన్ని కూడా వీరు కనుగొన్నారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించిన ఒక మందు కూడా దీన్ని సాధిస్తోందని వీరు కనిపెట్టారు. నేచర్ పత్రికలో అచ్చయిన వీరి వ్యాసం మధ్య వయస్సులో మానవ జ్ఞాపక శక్తిని బలోపేతం చేసే కొత్త పద్ధతిని సూచించింది.  వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపును నిరోధించే అవకాశం కూడా ఉందని ఈ కథనం తెలిపింది.

మనం ఎవరు అనేది మన జ్ఞాపకశక్తిలో అతి ముఖ్య భాగమని యూనివర్సిటీ ఆఫ్ కాలిపోర్నియా - లాస్ ఏంజెల్స్ హెల్త్ సైన్సెస్ లోని స్కూల్ ఆఫ్ మెడిసన్‍‌ విభాగంలోని ప్రముఖ ప్రొఫెసర్ అల్సినో శిల్వియా చెప్పారు. రిలేటెడ్ అనుభవాలను లింక్ చేసే సామర్థ్యం ఈ ప్రపంచంలో మనం ఎంత సురక్షితంగా ఉండి, విజయవంతంగా ఆపరేట్ అవుతుండాలో మనకు బోధిస్తుంది.

ప్రస్తుత అధ్యయనంలో శిల్వా అతడి సహాధ్యాయులు రెండు వేర్వేరు బోనుల్లో ఉన్న వాటి మెమరీస్‌ని అనుసంధానించే ఎలుకల సామర్థ్యాన్ని వెలికితీసే సెంట్రల్ మెకానిజాన్ని కనుగొన్నారు. మొదటగా ఎలుక మెదడుకి ఒక చిన్నమైక్రోస్కోప్ ఒక విండోను తెరుస్తుంది. ఈ క్రమంలో న్యూరాన్‌లు మెమరీస్‌తో అనుసంధానమై కొత్త మెమరీలను రూపొందించే క్రమాన్ని ఇది శాస్త్రజ్ఞులకు అందించింది. మధ్యవయస్సులో ఉన్న ఎలుక మెదళ్లలో సీసీఆర్5 జీన్స్ వ్యక్తీకరణను ఇది ప్రోత్సహిస్తుంది. ఇది మెమరీ లింకుతో ఇంటర్పర్ అవుతుంది. ఈ క్రమంలో జంతువులు రెండు బోనుల మధ్య కనెక్షన్‌ని మర్చిపోతాయి. ఈ ఎలుకల్లో సీసీఆర్5 జీన్‌ని తొలగించినప్పుడు, సాధారణ ఎలుకకు సాధ్యం కాని మెమరీస్ అనుసంధానాన్ని చేయగలిగాయి.

సిల్వా అంతకుముందు మరవరోక్ అనే డ్రగ్‌ని అధ్యయనం చేశారు. ఇది 2007లో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ కోసం ఎఫ్‌డీఎ ఆమోదించిన డ్రగ్. ఎలుక మెదడులోని సీసీఆర్5‌ని అణచిపెట్టే  మరవిరోక్‌ని సిల్వా ల్యాబ్‌లో కనుగొన్నారు.ఈ మరవికోక్ డ్రగ్‌ని వయసు మీరిన ఎలుకకు ఇచ్చినప్పుడు ఎలుక డీఎన్ఏలోని సీసీఆర్5ని జీన్స్ పరంగా తొలగించే ప్రభావాన్ని ఈ డ్రగ్ డూప్లికేట్ చేసిందని సిల్వా చెప్పారు. దీంతో ముసలిఎలుకలు మెమరీస్‌ని తిరిగి అనుసంధించగలిగాయి.

మధ్యవయస్కులలో మెమరీ లాస్‌ని పునరుద్దరించేందుకు హెచ్ఐవీ చికిత్సకు వాడుతున్న మరవిరోక్ డ్రగ్ ఉపయోగపడుతదని ఈ కొత్త అధ్యయనం సూచిస్తోంది.  అలాగే హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ ద్వారా కలిగిన ఎరుక లోపాన్ని కూడా ఈ డ్రగ్ రివర్స్ చేస్దోందని ఇది తెలుపుతోంది. మెమరీ ఎందుకు తగ్గిపోతోందో మనం అర్థం చేసుకున్నప్పుడు మెమరీ తగ్గిపోయే క్రమాన్ని మనం తగ్గించగలం. ప్రతి జ్ఞాపకాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఉండగలిగితే జీవితం అసాధ్యమవుతుంది. ఈ క్రమంలో తక్కువ ప్రాధాన్యం కలిగిన వివరాలను వడపోత పోయడం ద్వారా సీసీఆర్5 అర్థవంతమైన జ్ఞాపకాలను మాత్రమే మెదడుకు అనుసంధానిస్తుందని సిల్వాచెప్పారు. ఈ అధ్యయనాన్ని మరింతగా కొనసాగిస్తే మెదడులో మెమరీలు పనిచేసే తీరుపై కొత్త కాంతి ప్రసరిస్తుందని సిల్వా అభిప్రాయం.

 

మరిన్ని ఆరోగ్య వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 2022-06-02  Health Desk