collapse
...
Home / తెలంగాణ / ఎనిమిదేళ్లు ఓకే..రాబోయే రెండేళ్లలో సవాళ్లు ఏంటి? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

ఎనిమిదేళ్లు ఓకే..రాబోయే రెండేళ్లలో సవాళ్లు ఏంటి?

2022-06-02  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

kcr telanagana
Courtesy:Twitter/@MutaGopal 

 

తెలంగాణ పోరాటం తో మొదలుపెట్టి.. ఉద్యమాలతో ఊపందుకుని, రాష్ట్ర సాధన తో పాటు అధికార పీఠాన్ని అలంకరించి అరుదైన గెలుపు లతో ముందుకు సాగిన టిఆర్ఎస్ ప్రస్థానం గత కొంత కాలంగా ఆసక్తికరమైన మలుపులు తిరుగుతుంది. పాలన విషయంలో గాని, ప్రతిపక్షాల పోరాటం గాని టిఆర్ఎస్ ను ఆలోచనలో పడ్డ వేశాయి. ప్రజల ద్వారా కూడా భిన్నమైన  ఆలోచనలు మొదలయ్యాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న టిఆర్ఎస్ గత ఎనిమిది ఏళ్లలో సాధించింది ఏమిటి.. రాబోయే రెండేళ్లలో ఎలాంటి సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది.. అటు కేంద్రంతో కయ్యాలు, రాష్ట్రంలో ప్రగతి కార్యక్రమాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాలుగానే చెప్పాలి. గత ఎనిమిదేళ్ల చరిత్రను ఒక్కసారి తిరగేస్తే..

ఇదీ వైభవం 

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి అన్నీ తానై నిలిచిన కేసిఆర్ కు 2014లో తెలంగాణ ప్రజలు హారతి పట్టారు. అధికారంలోకి వచ్చిన కెసిఆర్ చేపట్టిన వివిధ కార్యక్రమాలు కూడా ప్రజలను ఆకర్షించాయి. రైతులకు పెట్టుబడుల కోసం ఏర్పాటుచేసిన రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, అలాగే వృద్ధుల కోసం పెన్షన్లు, నిరుపేదల వివాహాల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు, తాగునీటి సమస్య నివారణ దిశగా మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ పథకాలన్నీ 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశాయి. దీనితో 2014 కన్నా అత్యధిక సీట్లతో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయాన్ని సాధించింది. తెలంగాణలో తిరుగులేని పార్టీగా అవతరించింది. కానీ గత మూడేళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు అధికార పార్టీకి సవాలుగా మారాయి.

ముప్పేట దాడి..  

ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలు పార్టీని ఇరుకున పెట్టాయి అనే చెప్పాలి. 89 స్థానాలతో తిరుగులేని విజయాన్ని అందుకున్న టిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కోవడం విమర్శలకు దారి తీసింది. వీరిలో అత్యధికులు తెలంగాణను వ్యతిరేకించిన నాయకులే కావడం గమనార్హం. మరోవైపు పార్టీ కోసం పని చేసిన నాయకులను, తెలంగాణ పోరాట యోధులను పట్టించుకోకపోవడంతో పార్టీలో అసంతృప్తి పెరిగింది. ఇక పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్నా కేసిఆర్  ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో జాప్యం చేయడం, పంచాయతీలకు, పురపాలిక లకు  నిధులు కేటాయించకపోవడం, ఎన్నికలకు ముందు ఇచ్చిన పలు హామీలను నెరవేరకపోవడం, పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టిన వాటిని లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వంటి పలు అంశాలు టీఆర్ఎస్ పై వ్యతిరేకత కారణమయ్యాయి. మరోవైపు నిరుద్యోగులను పట్టించుకోకపోవడం కూడా పార్టీకి మైనస్ గా మారింది. ఇవన్నీ అధికార పార్టీ ప్రస్తుతం ఇరుకున పెడుతున్న అంశాలు.

లక్ష్యం కెసిఆర్..   

ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బిజెపి.. లక్ష్యం మాత్రం టిఆర్ఎస్.. వీళ్లు మాత్రమే కాదు చిన్న చిన్న పార్టీలు కూడా కేసీఆర్ని ప్రధానలక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల ద్వారా విరుచుకుపడడం టిఆర్ఎస్ వర్గాలకు మింగుడు పడని అంశంగా మారింది. ముఖ్య మంత్రులు ,ఎమ్మెల్యేలు అవినీతి  ఆరోపణలు పెరగడం, దీనిపై కెసిఆర్ ఏమాత్రం స్పందించక పోవడం బిజెపి, కాంగ్రెస్ లు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. కెసిఆర్ పాలనలో ఉన్న ప్రయోజనకర అంశాలను పక్కన పెట్టి, లోపాలను భారీ ఎత్తున ప్రచారం చేస్తుండడంతో అడుగడుగున అధికారపార్టీ ఇరుకున పడుతుంది. ఈ లెక్కన రానున్న రెండేళ్ల కాలం ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద సవాలుగా చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొన్న కేసీఆర్  ఈ సవాలును కూడా దీటుగా ఎదుర్కొని హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటారా.. ప్రత్యర్థుల విజయాన్ని అడ్డుకుంటారా.. అన్నది ఈ రెండేళ్ల అధికార పార్టీ పనితీరుపై ఆధారపడి ఉంటుంది.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి  
 



2022-06-02  News Desk