collapse
...
Home / అంతర్జాతీయం / యుద్దానికి వందరోజులు..ఆహార సంక్షోభం ముదురుతుందా? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News f...

యుద్దానికి వందరోజులు..ఆహార సంక్షోభం ముదురుతుందా?

2022-06-02  News Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

russia war

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై వందరోజులు దాటింది. ప్రపంచంలోనే అత్యంత అధికంగా జొన్న, గోధుమలను ఎగుమతి చేసే ఈ రెండు దేశాలు యుద్ధంలో మునిగిపోవడంతో ప్రపంచ ఆహార సరఫరా చైన్ కకావికలయిపోయింది. అంతర్జాతీయంగా ఆహార పదార్థాల ధరలు చుక్కలంటుతుండటానికి కారణం రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దమే. జొన్న, గోదుమ ప్రపంచవ్యాప్తంగా దాదాపు అందరూ వాడే ఆహార పదార్థాలు.

ప్రపంచవ్యాప్తంగా 40 శాతం కెలోరీలను అందిస్తున్న గోధుమలు, జొన్నలు, వరి ధాన్యల్లో తొలి రెండు పంటల ఉత్పత్తి 2022 లో తగ్గిపోయింది. అమెరికాలో ఈ సంవత్సరం 40 లక్షల టన్నుల పంట తగ్గిపోయింది. జొన్న పంట ఉత్పత్తి కూడా ఈ సంవత్సరం దెబ్బతినే అవకాశముందని  భావిస్తున్నారు. అదే సమయంలో  వరి పంట మాత్రం 515 మిలియన్ టన్నుల రికార్డు స్థాయిలో పెరిగిపోయింది.

ఆఫ్రికా ఖండంలోని 25 దేశాలు తమ గోధుమ అవసరాల్లో మూడోవంతు కంటే ఎక్కువగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటున్నాయి. ప్రధానంగా ఈ దేశాల గోధుమ అవసరాలను రష్యా ఉక్రెయిన్ దేశాలే తీర్చేవి. వీటిలో 15 దేశాలయితే 50 శాతం పైగా గోధుమ అవసరాలను దిగుమతుల ద్వారానే తీర్చుకునేవి. కానీ రష్యాపై ఆంక్షలు, ఉక్రెయిన్ నుంచి ఎగుమతులు ఆగిపోవడం కారణంగా ఆహార సరఫరా మార్గాలు స్తంభించిపోయాయి.

ఫలితంగా ఈదేశాల్లో అనేకం ప్రత్యామ్నాయ మార్గాలకోసం వెతుక్కోవలసి వచ్చింది. కానీ వాటికి అదేమంత సులభంకాదు. అంతర్జాతీయ ద్రవ్యోల్బణంతో ఈ స్థాయి పోరాటం ఇదివరకెన్నడూ ప్రపంచం చూడలేదు. ఆహార పదార్థాల వాణిజ్యంపై అనేక సరఫరా దేశాలు ఆంక్షలు విధించడంతో పరిస్థితులు మరీ విషమించిపోయాయి.

ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడి నేపథ్యంలో సంభవించనున్న పరిణామాలను గ్రహించిన ప్రపంచ ఆహార ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్‌పి) భవిష్యత్తు నిరాశాజనకమేనని స్పష్టం చేసింది. పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలు పేద దేశాల్లోని స్థానిక మార్కెట్లకు బదలాయించబడినప్పుడు పోషక విలువలతో కూడి ఆహారం అసలే తక్కువగా ఉన్న ఈ దేశాలు  పరిస్థితి మరింత భయానకంగా మారుతుందని పేర్కొంది. 2020 మధ్య నుంచి ఆహార ధరలు విపరీతంగా పెరుగుతున్నందున ఈ అదనపు భారం ఈ దేశాలను 2008 మరియు 2011 నాటి ఆహార ధరల సంక్షోభం మరోసారి వెంటాడక తప్పదు.

మహమ్మారితో అల్లాడుతున్న ప్రపంచం ఈ బ్రెడ్ మరియు బట్టర్ సంక్షోభాన్ని తట్టుకోగలదా అనేది ఊహాతీతమే అని చెప్పాల్సి ఉంటుంది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
 



2022-06-02  News Desk