రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే నెలల్లో కీలక వడ్డీరేట్లు పెంచాలనే ఆలోచనలో ఉంది. కఠినమైన ద్రవ్యపరపతి విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ నిర్వహించిన పోల్‌లో దాదాపు అందరూ ఆర్థికవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరి అంచనా ప్రకారం రెపో రేటు వచ్చే ఏడాది ప్రారంభానికి మరింత పెరిగే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు.
అయితే రిజర్వుబ్యాంకు మే 4వ తేదీన అందరిని ఆశ్చర్యపరుస్తూ కీలక వడ్డీరేట్లు లేదా రెపో రేటు అమాంతం పెంచేసింది. గత నెల నిర్వహించిన ద్రవ్యపరపతి సమీక్ష కమిటీలోని దాదాపు అందరూ సభ్యులు వడ్డీరేట్లు పెంచడానికి మొగ్గు చూపారు. అదే సమయంలో ఈ ఏడాదిలో జరగబోయే తదుపరి సమావేశంలో కూడా వడ్డీరేట్లు పెంచాలని నిర్ణయించారు. దీనికి ప్రధాన కారణం పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ఈ నిర్ణయం తీసుకోవాలనేది ఆర్బీఐ ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిది నెలల గరిష్ఠానికి ఎగబాకింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్బీఐ రెపోరేటు పెంచింది. రెపో రేటు అంటే రిజర్వుబ్యాంకు వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటుగా గుర్తించాలి.
ఇదిలా ఉండగా రాయిటర్స్ వార్తా సంస్త గత నెల 26 నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించిన పోల్స్‌లో దాదాపు అందరూ ఆర్థిక వేత్తలు ముక్తకంఠంతో వడ్డీరేట్లు పెరిగే అవకాశాలున్నాయని స్పష్టంగా చెప్పారు. కాగా వచ్చే నాలుగు ఆర్బీఐ ద్రవ్యపరపతి సమీక్షా సమావేశాల్లో కనీసం వంద బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందని వీరు గట్టి నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా రిజర్వుబ్యాంకు గత నెలలో అకస్మాత్తుగా అనుకోకుండా ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం నిర్వహించింది.ర్ ఉరుములు మెరుపులు లేకుండా రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచి కీలక వడ్డీరేటు 4.40 శాతానికి సవరించింది. కాగా ఈ నెల 8వ తేదీన మళ్లీ రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపరపతి సమీక్షా సమావేశం నిర్వహించనుంది. దీనిపై రిజర్వుబ్యాంకు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్ మాట్లాడుతూ పరోక్షంగా వడ్డీరేట్లు పెరుగుతాయని దాని గురించి బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు.అయితే వడ్డీరేట్లు ఎంత మేరకు పెరుగుతాయనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. అయితే ఈ వడ్డీరేట్లు ఆరు విధాలుగా ఉండవచ్చునని అది 25 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు ఉండవచ్చునని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ఈఎంఐ, ఎఫ్‌డీల విషయానికి వస్తే : ఒక వేళ రిజర్వుబ్యాంకు రెపోరేటు పెంచితే వడ్డీరేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. గృహ రుణాలు కానీయండి, లేదా కారు రుణాలతో పాటు ఇతర రకాల అన్ని రుణాలు పెరుగుతాయి. దాని ప్రభావం నెలసరి సులభతర వాయిదా లేదా ఈఎంఐలు కూడా పెరుగుతాయి. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారిపోతాయి. అయితే ఇక్కడ మరో అంశం గుర్తుంచుకోవాల్సిందే ఏమిటంటే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొనే వారికి రుణ భారం పెరిగితే.. అదే సమయంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారికి వడ్డీరేట్లు పెరుగుతాయి. ఇప్పటి వరకు వడ్డీరేట్లు తగ్గాయని నిరుత్సాహపడిపోయిన వారికి మాత్రం ఆర్బీఐ వడ్డీరేట్లు పెంచడం సంతోషించే అంశమే అవుతుంది. రెపో రేటు పెంచితే పొదుపు ఖాతాలతో పాటు ఎఫ్డీలపై వడ్డీరేట్లు పెరగుతాయి. రిజర్వుబ్యాంకు గత వారంలో విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి నిర్మాణాత్మకమైన సంస్కరణలు తీసుకోవాల్సిందేనని నిర్ణయించింది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సంస్కరణలు తప్పవని హెచ్చరించింది. కాగా అదే సమయంలో వాణిజ్య బ్యాంకులు లోన్ రీ స్ర్టక్చర్ల సందర్భంగా డిఫాల్ట్‌లు కాకుండా జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చింది.
మరిన్ని బిసినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి