collapse
...
Home / వినోదం / తెలుగు / దిల్ రాజు ప్రయోగం సక్సెస్ అయిందా .. ? - 6TV News : Telugu in News | Telugu News | Latest Telugu News | News for Telugu...

దిల్ రాజు ప్రయోగం సక్సెస్ అయిందా .. ?

2022-06-03  Entertainment Desk

Email share linkFacebook share linkGoogle share linkLinkedIn share linkPinterest share linkPrint share linkReddit share linkTwitter share link

akhan,chiru
*అనుకున్నాదొక్కటి అయినది మరొక్కటి అయ్యిందా .. ?

*సినిమాలో విషయం ఉంటే టికెట్ రేట్ సమస్య కాదట  ..

పెద్ద సినిమా లకు టికెట్ రేటు పెంచుకునే వెసులుబాటు ఉన్నా కూడా నిర్మాత  దిల్ రాజు తన ఎఫ్ 3 మూవీ రేట్లు పెంచలేదు .  ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకె సినిమా చూపించారు . ముందు అందరూ దిల్ రాజు నిర్ణయాన్ని వింతగా చూశారు . కానీ ఎఫ్ 3 కలక్షన్లు చూసి వారే అంతా నివ్వెరబోయారు .. ఎఫ్ 3 అనేది కుటుంబం అంతా చూసి నవ్వుకునే మంచి చిత్రం .  ఈ  నేపథ్యంలోనే దిల్ రాజు ఆలోచించారు . టికెట్ రేట్ పెరిగితే కుటుంబం అంతా రావడానికి బడ్జెట్ సరిపోదు . పైగా నాలుగు రోజలు ఆగితే పైరసీ లోనో .. బుల్లి తెరమీదో ఇంట్లో కూర్చొని చూసేవచ్చు అనే ఆలోచన ప్రేక్షకుడి మదిలో రాకపోదు  .. ఇది ముందుగానే గ్రహించిన దిల్ రాజు ఎఫ్ 3 సినిమాకు కుటుంబ సమేతంగా థియేటర్ కు రావలనే ఆలోచన చేసి టికెట్ రేటు అందుబాటులో ఉంచారు . దీంతో ఎఫ్ 3 సినిమా కు కుటుంబ సమేతంగా వచ్చే వారి సంఖ్య పెరిగింది .. దీంతో పాత రోజులు పునరావృతం అయ్యాయయని సినిమా పెద్దలు ఆనందపడుతున్నారని,  ఎఫ్ 3 థియేటర్ లు తెలుగు రాష్ట్రాలలో హౌస్ ఫుల్ కలెక్షన్ లతో నడుస్తున్నాయని ఎఫ్ 3 నిర్మాత సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు ..  


అయితే అనుకున్నాదొక్కటి అయినది మరొక్కటి అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు .  దిల్ రాజు ప్లాన్ ఫలించలేదని,  సినిమా బావుంటే టికెట్ రేటును పెద్దగా పట్టించుకోరని అంటున్నారు.  టికెట్ రేటు పెంపు మీదనే బాహుబలి , ఆర్ ఆర్ ఆర్ సినిమా లు సూపర్ హిట్ అయ్యాయనీ  టికెట్ రేటు పెంచినా కూడా రాధే శ్యామ్ , ఆచార్య సినిమా లు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయనీ రుజువు చేసేయంటున్నారు  .. ఎంత పెద్ద హీరో అయినా సినిమా లో విషయం లేకపోతే టికెట్ రేటు తగ్గించినా  కూడా థియేటర్ కు రారనేది తెలిపోయిన రహస్యం.. టికెట్ రేటు పెంచకపోయినా అఖండ , భీమ్లా నాయక్ బాగా కలక్షన్లు రాబట్టాయి అంటే అర్ధం .. సినిమా లు బావున్నాయని అర్ధంమే.  డబ్బులు ఎవరికి ఊరికే రావు అని టికెట్ రేటు తక్కువైన బాగాలేని సినిమా చూడరు.  బావుంటే ఎక్కువైన చూడకుండా వదిలిపెట్టరు .. 


ఇందులో కించిత్తు రహస్యం కూడా లేకపోలేదట. రిలీజ్ అయిన మొదటి ఆటకు గాని మొదటి రోజుకు కానీ టాక్ బయటకు వచ్చేస్తుంది.. సరిగ్గా అక్కడ మొదలవుతుంది మనవాళ్ళ తెలివి.. బావుంటే 100 రోజుల వరకూ బుల్లి తెరమీద చూడలేం .. బాగుండకపోతే వారం తిరక్కుండా ఏదో ఓటిటి లో చూసేయచ్చు అని కూడా అనుకుంటారని బయట టాక్ నడుస్తుంది.. ఏమైనా తెలుగు ప్రేక్షకుడు తెలివి తక్కువ వాడు కాదనేది తెలిసిపోయిన సత్యం .



2022-06-03  Entertainment Desk